బీహార్ కోకిల శారదా సిన్హా ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. "జానపద పాటల ద్వారా ఆమె బీహార్ కళలు, సంస్కృతికి కొత్త గుర్తింపునిచ్చారు. దీని కోసం ఆమెను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఛఠ్ పండగతో అనుబంధం గల ఆమె మధురమైన పాటలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"బీహార్ కోకిల శారదా సిన్హా జీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమెకు హృదయపూర్వక నివాళి. జానపద పాటల ద్వారా బీహార్ కళలు, సంస్కృతికి ఆమె ఒక కొత్త గుర్తింపునిచ్చారు. దీని కోసం ఆమెను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఛఠ్ పండగతో మమేకమైన ఆమె పాటలు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి."
बिहार कोकिला शारदा सिन्हा जी की पहली पुण्यतिथि पर उन्हें भावभीनी श्रद्धांजलि। उन्होंने बिहार की कला-संस्कृति को लोकगीतों के माध्यम से एक नई पहचान दी, जिसके लिए उन्हें सदैव याद किया जाएगा। महापर्व छठ से जुड़े उनके सुमधुर गीत हमेशा जनमानस में रचे-बसे रहेंगे।
— Narendra Modi (@narendramodi) November 5, 2025


