మహా సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులర్పించారు. “సత్యం, అహింస, ఉన్నతమైన నైతిక విలువల సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆయన సమాజంలో సరికొత్త చైతన్యాన్ని నింపారు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం దేశ ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"మహా సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయనకు నమస్కారాలు. సత్యం, అహింస, ఉన్నతమైన నైతిక విలువల సందేశాన్ని అందిస్తూ ఆయన సమాజంలో నవచేతనను రగిలించారు. వారి ప్రేరణాత్మక జీవితం దేశప్రజలను ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది.
జై సేవాలాల్!
महान समाज सुधारक श्री संत सेवालाल महाराज को उनकी जयंती पर शत-शत नमन। सत्य, अहिंसा और उच्च नैतिक मूल्यों का संदेश देकर उन्होंने समाज में नवचेतना का संचार किया। उनका प्रेरणादायी जीवन सदैव देशवासियों का मार्गदर्शन करता रहेगा।
— Narendra Modi (@narendramodi) February 15, 2026
जय सेवालाल! pic.twitter.com/iOfMvbzqtI


