నమో డ్రోన్ దీదీ లు వ్యవసాయ డ్రోన్ లనుప్రయోగించడాన్ని ఆయన తిలకించారు
డ్రోన్ లను ఒక వేయి మంది నమో డ్రోన్ దీదీ లకు అందజేశారు
సుమారు గా 8,000 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు రుణాల ను మరియు 2,000 కోట్ల రూపాయల మూలధన సంబంధి సహాయ నిధి ని ఎస్‌హెచ్‌జిలకు పంపిణీ చేశారు
లఖ్‌పతీ దీదీ లను సమ్మానించారు
‘‘సాఫల్యం తాలూకు క్రొత్త అధ్యాయాల ను డ్రోన్ దీదీ లు మరియు లఖ్‌పతీ దీదీ లు లిఖిస్తున్నారు’’
‘‘ఏ సమాజం అయినా అవకాశాల ను కల్పించడం మరియు మహిళా శక్తి యొక్క గౌరవాని కి పూచీ పడడం ద్వారామాత్రమే పురోగమించ గలుగుతుంది’’
‘‘టాయిలెట్ లు, సైనిటరి పేడ్ స్, పొగ చూరే వంట ఇళ్ళు, నల్లా ద్వారా నీరు ల వంటి అంశాల ను ఎర్ర కోట యొక్క బురుజుల మీది నుండి ప్రస్తావించినమొట్టమొదటి ప్రధాన మంత్రి ని నేనే’’
‘‘సమస్య ల పట్లమోదీ యొక్క అవగాహన మరియు మోదీ యొక్క పథకాలు రోజువారీ జీవనం లోని అనుభవాల ఆధారం గారూపుదిద్దుకొన్నవే’’
‘‘వ్యవసాయం లో డ్రోన్ టెక్నాలజీ తాలూకు పరివర్తనాత్మక ప్రభావం దేశం లో మహిళలసారథ్యం లో చోటు చేసుకొంటోంది’’
‘‘దేశం లో సాంకేతిక విజ్ఞాన సంబంధి క్రాంతి కి నారీ శక్తి నాయకత్వాన్ని వహిస్తుంది అని నాకు పూర్తి నమ్మకం ఉంది’’
‘‘గడచిన పదేళ్ళ లో భారతదేశం లో స్వయం సహాయ సమూహాల యొక్క విస్తరణ ప్రశంసాయోగ్యమైంది గా ఉంది. ఈ సమూహాలు దేశం లో మహిళ ల సశక్తీకరణ తాలూకు గాథను తిరిగి వ్రాశాయి’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని పూసా లో గల ఇండియన్ ఎగ్రీకల్చరల్ రిసర్చ్ ఇన్స్‌ టిట్యూట్ లో జరిగిన ‘సశక్త్ నారీ - వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకోవడం తో పాటు నమో డ్రోన్ దీదీ ల ఆధ్వర్యం లో జరిగిన వ్యవసాయ డ్రోన్ ప్రదర్శన ను వీక్షించారు. దేశ వ్యాప్తం గా పది వివిధ ప్రాంతాల కు చెందిన నమో డ్రోన్ దీదీ లు డ్రోన్ ప్రదర్శన లో పాలుపంచుకొన్నారు. ప్రధాన మంత్రి ఇదే కార్యక్రమం లో భాగం గా ఒక వేయి మంది నమో డ్రోన్ దీదీ లకు డ్రోన్ లను అందజేశారు. ప్రధాన మంత్రి ప్రతి ఒక్క జిల్లా లో బ్యాంకు లు ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ లింకేజీ కేంపుల మాధ్యం ద్వారా తగ్గించిన వడ్డీ రేటు తో కూడినటువంటి సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు రుణాల ను కూడా స్వయం సహాయ సమూహాల (ఎస్‌హెచ్‌జి స్) కు పంపిణీ చేశారు. ఎస్‌హెచ్‌జి లకు రమారమి 2,000 కోట్ల రూపాయల విలువైన కేపిటలైజేశన్ సపోర్ట్ ఫండు ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి సమావేశమై, వారి తో మాట్లాడారు.

 

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, డ్రోన్ దీదీ లు (డ్రోన్ సోదరీమణులు) మరియు లఖ్‌పతీ దీదీ లు (లక్షాధికారి సోదరీమణులు) సాఫల్యం తాలూకు నూతన అధ్యాయాల ను లిఖిస్తూ ఉన్న కారణం గా ఈ రోజు న జరుగుతున్న కార్యక్రమాన్ని చరిత్రాత్మకం అయినటువంటి సందర్భం గా చెప్పుకో వచ్చును అన్నారు. ఆ కోవ కు చెందిన సఫలీకృత మహిళా నవ పారిశ్రమికవేత్తల తో మాట్లాడడం దేశ భవిష్యత్తు పట్ల తనలో విశ్వాసాన్ని నింపుతోంది అని ఆయన తెలిపారు. మహిళా శక్తి యొక్క దృఢ సంకల్పాన్ని మరియు నిరంతర ప్రయాసల ను ఆయన ప్రశంసించారు. ఇది నాకు 3 కోట్ల లక్షాధికారి సోదరీమణుల ను తీర్చిదిద్దే యాత్ర ను మొదలుపెట్టే ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘‘అవకాశాల ను అందించడం మరియు మహిళా శక్తి యొక్క గౌరవానికి పూచీ పడడం ద్వారానే ఏ సమాజం అయినా పురోగమించగలుగుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కాస్తంత సహాయాన్ని అందించినంత మాత్రాననే మహిళా శక్తి కి మరింత సమర్థన ను అందించవలసిన అవసరం తలెత్తదు మరి వారు ఇతరుల కు కూడాను ఆలంబన గా మారిపోతారు’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మహిళ ల కోసం టాయిలెట్ లు; సైనిటరి పేడ్ స్; అనారోగ్యాని కి గురి చేసే పొగ చూరిన వంట గదులు; రోజువారీ అసౌకర్యం బారి నుండి మహిళల ను కాపాడగల నల్లా నీరు; ప్రతి ఒక్క మహిళ కు జన్ ధన్ ఖాతా; మహిళ ల విషయం లో వారిని అవమానం పాలుజేసేటటువంటి భాష ను ప్రయోగించడాన్ని వ్యతిరేకించడం; అంతేకాకుండా మహిళా శక్తి పట్ల సముచితమైన నడవడిక ను ఏర్పరచుకొనేటట్లు గా శిక్షణ ను ఇవ్వవలసిన అవసరం వగైరా మహిళా సశక్తీకరణ కు సంబంధించిన అంశాల ను గురించి ఎర్ర కోట బురుజుల నుండి మాట్లాడిన తొలి ప్రధాన మంత్రి ని నేనే అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

‘‘రోజువారీ జీవనం లో ఎదురుపడే అనుభవాల నుండి మోదీ యొక్క సంవేదనశీలత్వం మరియు మోదీ యొక్క పథకాలు రూపు రేఖలను దిద్దుకొన్నాయి’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జీవన యథార్థాల ను అనుభవం లోకి తెచ్చుకోవడం ఈ సంవేదనల కు మరియు పథకాల కు మూలాధారం గా మారాయి అని ఆయన అన్నారు. ఈ కారణం గా, ఈ పథకాలు దేశం లో మాతృమూర్తుల మరియు కుమార్తెల కు జీవన సౌలభ్యాన్ని ప్రసాదిస్తున్నాయి అని ఆయన అన్నారు.

 

మహిళా శక్తి విషయం లో మహిళ ల జీవనం లోని ప్రతి దశ కు సంబంధించిన సమస్యల కు పరిష్కారాన్ని చూపెట్టడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఆయా పథకాల ను గురించి వివరించారు. శిశువు పిండ రూపం లో ఉన్నప్పుడే ఆ శిశువు ను హత్య చేయడాన్ని నివారించడానికని బేటీ బచావో, బేటీ పఢావో; గర్భవతుల కు పౌష్టికాహారాన్ని అందజేయడం కోసం 6,000 రూపాయలు సాయం గా అందించడం; బాలికల కు చదువుకొనే కాలం లో తగిన ఆర్థిక వనరుల కు పూచీ పడడం కోసమని సుకన్య సమృద్ధి పథకం; నవ పారిశ్రమికత్వం రంగం లో సొంత కాళ్ళ మీద నిలబడగలిగే విధం గా సాయాన్ని అందించడాని కి గాను ముద్ర యోజన; మాతృత్వ సెలవు పరిధి ని పెంచడం; వైద్య చికిత్స ను ఉచితం గా అందించడం; తక్కువ ఖర్చు లో మందుల లభ్యత కు పూచీ పడడం మరియు పిఎమ్ ఆవాస్ గృహాల ను మహిళల పేరిట నమోదు చేసి వారి యాజమాన్యాన్ని పెంచడం.. వంటి కార్యాలు పాత మనస్తత్వం లో మార్పు ను తీసుకు వచ్చాయి అని ఆయన వివరించారు. వ్యవసాయం లో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ప్రసరిస్తున్నటువంటి పరివర్తనాత్మకమైన ప్రభావం విషయం లో దేశం లోని మహిళలే దీనికి సంబంధించిన సారథ్యాన్ని వహిస్తున్నారు అని కూడా ఆయన అన్నారు. ఒక డ్రోన్ సోదరీమణి తో జరిపిన సంభాషణ ను గురించి ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, డ్రోన్ దీదీ యొక్క ఆదాయం, నైపుణ్యం మరియు గుర్తింపు ల పరం గా చూసినప్పుడు వారి లో సశక్తీకరణ తాలూకు భావన ఎలా నెలకొంటున్నదీ వివరం గా ఆయన తెలియ జేశారు. ‘‘దేశం లో సాంకేతిక విజ్ఞానానికి సంబంధించినటువంటి క్రాంతి కి మహిళా శక్తి నాయకత్వం వహించ గలదు అని నేను పూర్తి గా నమ్ముతున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. అన్ని రంగాల లో మహిళలు ముందడుగు వేస్తున్నారు అని ఆయన తెలిపారు. పాల ను మరియు కాయగూరల ను బజారు వరకు తరలించడం, మందుల పంపిణీ వంటి రంగాల లో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన విషయాన్ని ప్రధాన మంత్రి విస్తృతం గా చర్చించారు. వీటి వల్ల డ్రోన్ సోదరీమణుల కు క్రొత్త దారులు తెరచుకొంటాయి అని ఆయన అన్నారు.

 

‘‘గత పదేళ్ళ లో భారతదేశం లో స్వయం సహాయ సమూహాల విస్తరణ ప్రశంసాయోగ్యమైంది గా ఉంది. ఈ సమూహాలు దేశం లో మహిళల సశక్తీకరణ గాథ ను తిరిగి వ్రాశాయి’’ అని ఆయన అన్నారు. స్వయం సహాయ సమూహాల లో సభ్యత్వం కలిగి ఉన్న మహిళ లు పోషిస్తున్నటువంటి కీలక పాత్ర ను ప్రధాన మంత్రి గుర్తిస్తూ, ఈ విషయం లో వారికి కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ‘‘ ఈ రోజు న స్వయం సహాయ సమూహాల లోని ప్రతి ఒక్క సోదరి కి నేను నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. వారి యొక్క కఠోర శ్రమ ఈ సమూహాల ను దేశ నిర్మాణం లో అగ్రగామి గా నిలబెట్టాపాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. స్వయం సహాయ సమూహాల లో మహిళల భాగస్వామ్యం ప్రభావవంతం అయినటువంటి వృద్ధి చోటు చేసుకొంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ‘‘ప్రస్తుతం స్వయం సహాయ సమూహాల లో చేరిన మహిళ ల సంఖ్య 10 కోట్ల కు మించిపోయింది’’ అని ఆయన అన్నారు. స్వయం సహాయ సమూహాల కు సమర్థన ను అందించడం లో ప్రభుత్వం యొక్క ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ‘‘గత పది సంవత్సరాల లో, మా ప్రభుత్వం స్వయం సహాయ సమూహాల ను విస్తరించడం ఒక్కటే కాకుండా ఆ సమూహాల లో 98 శాతం సమూహాలు బ్యాంకు ఖాతాల ను ప్రారంభించేందుకు మార్గాన్ని సుగమం చేసింది’’ అని ఆయన తెలిపారు. ఆ విధమైన సమూహాల కు అందిస్తున్న సహాయాన్ని 20 లక్షల రూపాయల కు పెంచడం జరిగింది; అంతేకాదు, ఆయా సమూహాల యొక్క ఖాతాల లో 8 లక్షల కోట్ల రూపాయల కు పైగా జమ చేయడం జరిగింది అని ఆయన వివరించారు. ఆధునిక మౌలిక సదుపాయాల ను అందిపుచ్చుకోవడం తో ఈ స్వయం సహాయ సమూహాల యొక్క ఆదాయం మూడు రెట్లు వృద్ధి చెందింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఆర్థిక సశక్తీకరణ కు అదనం గా, స్వయం సహాయ సమూహాలు సమాజం పైన ప్రసరిస్తున్నటువంటి ప్రభావాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘‘ఈ సమూహాలు గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధి కి మరియు గ్రామీణ సముదాయాల సమగ్ర అభ్యున్నతి కి చెప్పుకోదగినంత గా తోడ్పాటు ను అందించాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. బ్యాంకు సఖి, కృషి సఖి, పశు సఖి మరియు మత్స్య సఖి ల పాత్ర ను మరియు సేవల ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రశంసించారు. ‘‘ఈ సోదరీమణులు దేశం లో ఆరోగ్యం మొదలుకొని డిజిటల్ ఇండియా వరకు చూసుకొంటే జాతీయ స్థాయి ప్రచార ఉద్యమాల కు క్రొత్త ఉత్తేజాన్ని జోడిస్తున్నారు అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ ను నిర్వహిస్తున్న వారి లో 50 శాతాని కంటే ఎక్కువ గా మహిళలే ఉన్నారు. మరి 50 శాతం కంటే ఎక్కువ లబ్ధిదారులు కూడా మహిళలే అని ఆయన తెలిపారు. ఈ సాఫల్యాల పరంపర మహిళా శక్తి పట్ల నా నమ్మకాన్ని మరింత గా బల పరుస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజలి యోజన ను అమలు పరచడం లో స్వయం సహాయ సమూహాలు సమధికోత్సాహం తో ముందంజ వేయాలంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో స్వయం సహాయ సమూహాల కు చెందిన సభ్యురాళ్లు ఎక్కడెక్కడ చొరవ తీసుకొన్నా, వారికి ఈ పథకం లోప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ఆయన అన్నారు.

 

ఈ సందర్భం లో కేంద్ర మంత్రులు శ్రీ అర్జున్ ముండా, డాక్టర్ శ్రీ మన్‌సుఖ్ మండావియా, ఇంకా శ్రీ గిరిరాజ్ సింహ్ తదితరులు పాలుపంచుకొన్నారు.

 

మహిళల లో విశేషించి ఆర్థిక గ్రామీణ మహిళల లో ఆర్థిక సశక్తీకరణ మరియు ద్రవ్య సంబంధి స్వతంత్ర ప్రతిపత్తి ని పెంచాలనే ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణం లో ఒక భాగమే నమో డ్రోన్ దీదీ మరియు లఖ్‌పతి దీదీ కార్యక్రమాలు. ఈ ఆలోచన ను మరింత గా ముందుకు తీసుకు పోవడం కోసం ప్రధాన మంత్రి లఖ్ పతి దీదీల ను సమ్మానించనున్నారు. లఖ్ పతి దీదీ లు దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన – నేశనల్ రూరల్ లైవ్ లీహుడ్ మిశన్ (ఎన్ఆర్ఎల్ఎమ్) కు సాయం తో సాఫల్యాన్ని చేజిక్కించుకోవడం తో పాటు ఇతర స్వయం సహాయ సమూహాల సభ్యుల కు వారు సైతం ఎదిగేటట్టుగా ప్రేరణ ను కూడా అందిస్తున్నారు.

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
2025 reforms form the base for a superstructure to emerge in late 2020s-early 2030s

Media Coverage

2025 reforms form the base for a superstructure to emerge in late 2020s-early 2030s
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Shri Atal Bihari Vajpayee ji at ‘Sadaiv Atal’
December 25, 2025

The Prime Minister, Shri Narendra Modi paid tributes at ‘Sadaiv Atal’, the memorial site of former Prime Minister, Atal Bihari Vajpayee ji, on his birth anniversary, today. Shri Modi stated that Atal ji's life was dedicated to public service and national service and he will always continue to inspire the people of the country.

The Prime Minister posted on X:

"पूर्व प्रधानमंत्री श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की जयंती पर आज दिल्ली में उनके स्मृति स्थल ‘सदैव अटल’ जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का सौभाग्य मिला। जनसेवा और राष्ट्रसेवा को समर्पित उनका जीवन देशवासियों को हमेशा प्रेरित करता रहेगा।"