ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మాలేలోని అధ్యక్షుడి కార్యాలయంలో మాల్దీవుల దేశాధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీకి రిపబ్లిక్ స్క్వేర్‌లో అధ్యక్షుడు ముయిజు ఘనంగా సంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్యనున్న లోతైన స్నేహ బంధాన్ని, హృదయపూర్వక వాతావరణాన్ని ఈ సమావేశం ప్రతిబింబించింది. 

తనతో పాటు తన బృందానికి అందించిన ఆతిథ్యానికి ప్రధానమంత్రి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆ దేశ 60వ స్వాతంత్ర్య దినోత్సవం, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

శతాబ్దాలుగా నెలకొన్ని మానవ సంబంధాల ద్వారా బలోపేతమైన లోతైన స్నేహ బంధం, విశ్వాసం గురించి ఇద్దరు నాయకులు చర్చించారు. 2024 అక్టోబర్‌లో మాల్దీవుల అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా చేసుకున్న 'సమగ్ర ఆర్థిక, సముద్ర భద్రతా భాగస్వామ్యానికి' సంబంధించిన భారత-మాల్దీవుల ఉమ్మడి దార్శనికత అమలులో పురోగతిని కూడా ఇరువురు తెలుసుకున్నారు. "ఇరుగుపొరుగు వారే మొదటి ప్రాధాన్యాత", మహాసాగర్ దార్శనికత విధానాలకు అనుగుణంగా మాల్దీవులతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి భారత్‌ నిబద్ధతతో ఉందని ప్రధానమంత్రి పునురుద్ఘాటించారు. సంక్షోభం ఏదైనా, దాన్ని ఎదుర్కోవడంలో మాల్దీవులకు సహాయపడే మొదటి దేశంగా ఉంటున్న భారత్ ‌కట్టుబాటును అధ్యక్షుడు ముయిజు ప్రశంసించారు. అభివృద్ధి భాగస్వామ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు సహాయం, సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవటం, వాతావరణ విషయంలో చర్యలు తీసుకోవటం, ఆరోగ్యం వంటి రంగాలలో సహకారం గురించి ఇరు దేశాల నాయకులు చర్చించారు. రక్షణ, నౌకా వాణిజ్యం విషయంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు అన్నారు. ఈ విషయంలో కొలంబో భద్రతా సమావేశం ప్రకారం రెండు దేశాల మధ్య సహకారాన్ని వారు గుర్తించారు.

రెండు దేశాల మధ్యనున్న ఆర్థిక భాగస్వామ్యాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించారు. ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం రెండు దేశాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ప్రధాని మోదీ ప్రధానంగా పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రెండు దేశాలూ సద్వినియోగం చేుకోవాలన్న ఆయన.. ముఖ్యంగా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, యూపీఐ అమలు, రూపే కార్డులను అంగీకరించటం, స్థానిక కరెన్సీలో వ్యాపారం విషయంలో ఇటీవల రెండు దేశాల మధ్య వచ్చిన అవగాహనను ఆయన  స్వాగతించారు. దేశాల మధ్య సన్నిహిత అభివృద్ధి భాగస్వామ్యం ఇప్పటికే బలంగా ఉన్న మానవ సంబంధాలకు మరో స్థాయికి తీసుకెళ్తాయని ఇరువురు ప్రధానంగా పేర్కొన్నారు. 

గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా భూమి, దాని మీది ప్రజల ప్రయోజనాలను కాపాడేలా వాతావరణ మార్పు, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం, విపత్తు సంబంధింత ప్రమాదాలను తగ్గించటం, పర్యావరణ శాస్త్రం వంటి అంశాలపై పనిచేయటాన్ని కొనసాగిస్తామని రెండు దేశాల నేతలు తెలిపారు. 

పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంఘీభావం తెలిపినందుకు అధ్యక్షుడు ముయిజుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

మత్స్య, జలచరాల పెంపకం… పర్యావరణ శాస్త్రం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, యూపీఐ, భారత ఫార్మకోపియా, రాయితీతో కూడిన రుణం (లైన్ ఆఫ్ క్రెడిట్) వంటి వాటికి సంబంధించి 6 అవగాహాన ఒప్పందాలను పరస్పరం మార్చుకున్నారు. ఆ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర కార్యకలాపాలకు సహయం అందించే కొత్త రుణ పరిమితి రూ. 4850 కోట్లుగా (సుమారు 550 మిలియన్ల డాలర్లు) ఉంది. ఇప్పటికే ఉన్న రుణాలకు సంబంధించి సవరణ ఒప్పందం కూడా ఈ సందర్భంగా ఇరువురు ఇచ్చి పుచ్చుకున్నారు. కొత్త రుణ పరిమితి ఆ దేశ వార్షిక రుణ చెల్లింపును 40% తగ్గిస్తుంది (51 మిలియన్ల డాలర్ల నుంచి 29 మిలియన్ల డాలర్లకు). ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను కూడా ఇరుదేశాలు మార్పిడి చేసుకున్నాయి. 

అడ్డూ నగరంలో రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులను.. ఇతర నగరాల్లో అత్యంత ప్రభావంగా పనిచేసే 6 సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులను ఇరువురు వర్చువల్‌గా ప్రారంభించారు. ఆ దేశ జాతీయ రక్షణ దళాలతో పాటు విదేశాంగ అధికారులకు 3,300 గృహాలను, 72 వాహనాలను ప్రధాని మోదీ అందజేశారు.

ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ (భీష్మ్) కింద రెండు మొబైల్ ఆస్పత్రులను ఆ దేశ ప్రభుత్వానికి అందజేశారు. వీటిలో అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. ఆరుగురు వైద్య సిబ్బందితో కూడిన సిబ్బంది 72 గంటల వరకు పనిచేసేలా సౌకర్యాలున్న ఈ ఆస్పత్రులు 200 మంది బాధితులకు వైద్య సహాయం అందించగలవు.

ప్రకృతి పరిరక్షణ పట్ల తమకున్న లోతైన నిబద్ధతకు అనుగుణంగా భారతదేశానికి చెందిన "తల్లి పేరు మీద ఒక చెట్టు", మాల్దీవులకు చెందిన "50 లక్షల చెట్లను పెంచే ప్రతిజ్ఞ" కార్యక్రమాల్లో భాగంగా ఇద్దరు నాయకులు మామిడి మొక్కలను నాటారు.

ఆ దేశ అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా మాల్దీవులకు, ఆ దేశ ప్రజలకు సహయసహకారాలు అందించే విషయంలో భారత్ నిబద్ధతనను ప్రధాని మరోసారి తెలియజేశారు. హిందూ మహాసముద్ర ప్రాంత శాంతి, పురోగతి, శ్రేయస్సుకు భారత్ కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit

Media Coverage

Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 జూలై 2026
July 11, 2026

Record Exports, Record Investments, Record Pride: India’s Rise Under PM Modi is Multi-Dimensional