క్రొయేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ జొరాన్ మిలనోవిచ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జాగ్రెబ్‌లో సమావేశమయ్యారు.

ద్వైపాక్షిక సంబంధాల్లో వివిధ అంశాలపై నేతలు ఇద్దరూ చర్చించారు. ప్రజాస్వామ్య విలువలు, చట్ట బద్ధ పాలన, అంతర్జాతీయ శాంతి-స్థిరత్వాల పరిరక్షణ కోసం కృషిచేస్తూ ఉండాలన్న ఉమ్మడి లక్ష్యంతోపాటు రెండు దేశాల సన్నిహిత మైత్రీ సంబంధాలను ఇకపైనా కొనసాగించాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సహకారం- రక్షణ, అంకుర సంస్థలు, క్రీడలతో పాటు నవకల్పన వంటి సరికొత్త రంగాలకు కూడా విస్తరించినందుకు వారు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి క్రొయేషియా బలమైన మద్దతుతో పాటు సంఘీభావాన్ని తెలిపినందుకు అధ్యక్షుడు శ్రీ మిలనోవిచ్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు పలికారు. నేతలు అనేక వందల సంవత్సరాలుగా రెండు దేశాలను గట్టిగా పెనవేసి ఉంచుతున్న సన్నిహిత సాంస్కృతిక అనుబంధాన్ని గురించి కూడా చర్చించారు.

 

పరస్పర ప్రయోజనాలతో కూడిన ప్రాంతీయ అంశాలతో పాటు ప్రపంచ అంశాలను కూడా చర్చించారు. భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇటీవలి కాలాల్లో విస్తరించిన విషయాన్ని వారు గమనించారు. ఇది భారత్-క్రొయేషియా సంబంధాలకు అనేక విధాలుగా విలువను జోడించగలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

 

భారత్, క్రొయేషియా సంబంధాల పూర్తి శక్తియుక్తుల్ని సద్వినియోగపరచుకొనే దిశగా కలసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ‌

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
West Asia conflict: 59 India-bound vessels transited Hormuz since war

Media Coverage

West Asia conflict: 59 India-bound vessels transited Hormuz since war
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets the Prime Minister
July 22, 2026

The Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu, today met Prime Minister Shri Narendra Modi.

In a post on X, the Prime Minister shared:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn met Prime Minister @narendramodi.

@AndhraPradeshCM"