కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యాంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, గ్రీన్ హైడ్రోజన్, నౌకా నిర్మాణంతో పాటు మరిన్ని రంగాల్లో భారత్, కొరియా రిపబ్లిక్ కలసి పనిచేయాలని కోరుకొంటున్నాయని శ్రీ మోదీ అన్నారు.
ఎక్స్‌లో ఆయన రాసిన ఒక సందేశంలో:
‘‘అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యాంగ్, నేను కెనడాలో సుహృద్భావ వాతావరణంలో సమావేశమయ్యాం. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, గ్రీన్ హైడ్రోజన్, నౌకా నిర్మాణంతో పాటు మరిన్ని రంగాల్లో కలసి పనిచేయాలని భారత్, కొరియా రిపబ్లిక్ అభిలషిస్తున్నాయి. @Jaemyung_Lee’’
President Mr. Lee Jae-myung and I had a very good meeting in Canada. India and the Republic of Korea seek to work together in sectors like commerce, investment, technology, green hydrogen, shipbuilding and more. @Jaemyung_Lee pic.twitter.com/rh4JiEIabE
— Narendra Modi (@narendramodi) June 17, 2025


