విభిన్నబోధనా పద్ధతుల గురించి ప్రధానికి వివరించిన పురస్కార గ్రహీతలు
వికసిత భారత్ కోసం నేటి యువతను సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది: ప్రధానమంత్రి
జాతీయ విద్యావిధాన ప్రభావం, మాతృభాషలో విద్యాభ్యాస ప్రాముఖ్యతల గురించి చర్చించిన ప్రధాన మంత్రి
విద్యార్థులకు వివిధ భాషల్లో స్థానిక జానపద కథలను నేర్పించి, ఇతర భాషలను ఉపాధ్యాయులు పరిచయం చేయాలని సూచించిన ప్రధాన మంత్రి
తాము అవలంబిస్తున్న ఉత్తమ బోధనా విధానాలను ఒకరితో ఒకరు పంచుకోవాలని సూచించిన ప్రధాన మంత్రి
భారత వైవిధ్యాన్ని తెలిపేందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు పర్యటనలకు తీసుకెళ్లాలి: ప్రధాన మంత్రి

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లోక్ కల్యాణ్ మార్గ్, 7 లోని ఆయన నివాసంలో సంభాషించారు.

 

పురస్కార గ్రహీతలు తమ బోధనానుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. అభ్యాసాన్ని ఆసక్తికరంగా మార్చేందుకు తాము పాటిస్తున్న బోధనా విధానాల గురించి వివరించారు. ఉపాధ్యాయ వృత్తితో పాటు వారు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో కొన్నింటిని పంచుకున్నారు. ఎన్నో ఏళ్లుగా బోధనపై చూపిస్తున్న అంకిత భావాన్నీ, కొనసాగిస్తున్న ఉత్సాహాన్నీ, పురస్కారాల ద్వారా సాధించిన గుర్తింపు పొందడాన్నీ ప్రధానమంత్రి ప్రశంసించారు.

జాతీయ విద్యా విధాన ప్రభావం, మాతృభాషలో విద్యాభ్యాస ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి వారితో చర్చించారు. వేర్వేరు భాషల్లో స్థానిక జానపద కథలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. దీనివల్ల విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవడంతో పాటు వైవిధ్యమైన భారతదేశ సంస్కృతి గురించి తెలుసుకుంటారని అన్నారు.

 

భారత వైవిధ్యాన్ని తెలుసుకునేందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు విద్యా యాత్రలకు తీసుకువెళ్లాలని, ఇది వారి అభ్యాసానికి, దేశం గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రధామంత్రి తెలిపారు. ఇలా చేయడం ద్వారా పర్యటక రంగం వృద్ధి చెందుతుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన అన్నారు.

అవార్డు గ్రహీతలైన ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల ద్వారా తాము పాటిస్తున్న ఉత్తమ బోధనా విధానాలను ఒకరితో మరొకరు పంచుకోవాలని సూచించారు. తద్వారా ప్రతి ఒక్కరూ వాటిని నేర్చుకుని, స్వీకరించి, ప్రయోజనం పొందుతారని ప్రధానమంత్రి అన్నారు.

ఉపాధ్యాయులు దేశానికి అతి ముఖ్యమైన సేవ చేస్తున్నారన్న ప్రధాని నేటి యువతను వికసిత భారత్ కోసం సిద్ధం చేసే బాధ్యత గురువుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.

 

నేపథ్యం

నిబద్ధత, విశిష్టమైన కృషి ద్వారా విద్యారంగంలో నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా తమ విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించడమే ఈ జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధాన ఉద్దేశం. ఈ అవార్డుల కోసం ఈ ఏడాది 82 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. అందులో 50 మందిని పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం, 16 మందిని ఉన్నత విద్యా విభాగం, మరో 16 మందిని నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక విభాగం ఎంపిక చేశాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
New FTAs open big export gains across key sectors

Media Coverage

New FTAs open big export gains across key sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
September 05, 2026

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, September 27th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.