షేర్ చేయండి
 
Comments
ఇంతకుముందు,చౌక ధరల రేషన్ పథకాల బడ్జెటు, పరిధి పెరుగుతూ పోయినప్పటికీ పస్తులు ఉండటం,పౌష్టికాహార లోపం అదే నిష్పత్తి లో తగ్గలేదు: ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొదలైన తరువాత ఇదివరకటి కంటే దాదాపు రెండింతల రేషన్ ను లబ్ధిదారులు అందుకోవడం ఆరంభం అయింది: ప్రధాన మంత్రి
మహమ్మారికాలంలో 80 కోట్ల మందికి పైగా ప్రజలు ఉచితంగా ఆహార పదార్థాలను పొందుతూ వచ్చారు; దీనికిగాను 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చయింది: ప్రధాన మంత్రి
వందేళ్లలోఅతి పెద్దదయిన విపత్తు ఎదురయినప్పటికీ పౌరులలో ఏ ఒక్కరు ఆకలితో అలమటించలేదు:ప్రధాన మంత్రి
పేదలసాధికారిత కల్పన కు ప్రస్తుతం అగ్ర ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం జరుగుతోంది: ప్రధానమంత్రి
మనక్రీడాకారులలో సరికొత్త విశ్వాసం ‘న్యూ ఇండియా’ కు చిహ్నంగా మారుతోంది: ప్రధాన మంత్రి
50 కోట్లమందికి టీకామందు ను ఇప్పించిన మైలు రాయి కేసి దేశం శర వేగంగా పయనిస్తోంది: ప్రధాన మంత్రి
‘ఆజాదీ కాఅమృత్ మహోత్సవ్’ సందర్భం లో దేశ నిర్మాణం కోసం ఒక కొత్త స్ఫూర్తి ని మేలుకొలపడానికిమనం పవిత్రమైన ప్రతిన ను పూనుదాం: ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’’ లబ్ధి దారుల తో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ పథకాన్ని గురించి మరింత జాగృతి ని వ్యాప్తి చేయడం కోసం ఆ రాష్ట్రం లో ఒక ప్రజా భాగస్వామ్య కార్య్రకమాన్ని ప్రారంభించడం జరిగింది.

కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ లో భాగంగా ఆహార పదార్థాలను గుజరాత్ లో లక్షల కొద్ది కుటుంబాలు ఉచితంగా అందుకొంటున్నారన్నారు. ఈ ఉచిత రేషన్ పేదల కు దుర్గతి ని తగ్గించి వారిలో విశ్వాసాన్ని నింపుతుందన్నారు. ఎటువంటి విపత్తు ముంచుకువచ్చినప్పటికి కూడా దేశం తన వెన్నంటి ఉందని పేదలు భావించాలి అని ఆయన అన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత దాదాపు గా ప్రతి ప్రభుత్వం పేదల కు తక్కువ ధరకే ఆహారాన్ని అందిస్తున్నామని చెబుతూ వచ్చిందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. చౌక ఆహార ధాన్యాల పథకాల బడ్జెటు, చౌక ఆహార ధాన్యాల పథకాల పరిధి ఏటేటా అధికం అయినా గాని ఆ పథకాల తాలూకు ప్రభావం పరిమితంగానే ఉందని ఆయన అన్నారు. దేశం లో ఆహారం నిలవ లు పెరుగుతూ ఉన్నప్పటికీ పస్తులు, పోషకాహార లోపం అదే దామాషా లో తగ్గలేదు అని ప్రధాన మంత్రి వివరించారు. దీనికి ఒక ప్రధానమైన కారణం సరైన అందజేత వ్యవస్థ కొరవడడమే అని ఆయన అన్నారు. ఈ స్థితి ని మార్చడం కోసం 2014వ సంవత్సరం తరువాత సరికొత్త కృషి మొదలైందన్నారు. నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ కోట్ల కొద్దీ బూటకపు లబ్ధిదారులను వ్యవస్థలో నుంచి ఏరివేయడం జరిగిందని, రేషన్ కార్డుల ను ఆధార్ కార్డుల తో ముడివేయడమైందని ఆయన తెలిపారు. ఇది వంద సంవత్సరాల లో కని విని ఎరుగని అతి పెద్ద విపత్తు విరుచుకుపడి, బతుకు తెరువు కు బెదిరింపు ఎదురై, లాక్ డౌన్ కారణం గా వ్యాపారాలు నష్టాల పాలైనప్పటికీ దేశం లో ఏ ఒక్క వ్యక్తి ఆకలి బాధ ను అనుభవించలేదని ఆయన అన్నారు. మహమ్మారి కాలం లో 2 లక్షల కోట్ల రూపాయల కు పైగా ఖర్చు పెట్టి 80 కోట్ల కు పైచిలుకు ప్రజల కు ఆహార పదార్థాలను ఉచితం గా అందేటట్లు చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రస్తుతం 2 రూపాయల ధర కు కిలో గోధుమలు, 3 రూపాయల కు కిలో బియ్యం కోటా కు అదనం గా 5 కిలో ల గోధుమలను/ బియ్యాన్ని లబ్ధిదారుల లో ప్రతి ఒక్కరి కి ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. అంటే ఈ పథకం ఆరంభం కావడాని కన్నా ముందు రేషన్ కార్డు దారులకు ఇస్తూ వచ్చినటువంటి ఆహార పదార్థాలు దాదాపు గా రెట్టింపు అయ్యాయన్న మాట. ఈ పథకం దీపావళి పండుగ వరకు కొనసాగనుంది. పేద ప్రజల లో ఏ ఒక్కరు కూడా ఆకలి బాధ తో సతమతం కాకూడదు అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రవాసీ శ్రామికుల పట్ల శ్రద్ధ ను తీసుకొంటున్నందుకు, వన్ నేశన్ వన్ రేషన్ కార్డ్ కార్యక్రమం పరమార్థాన్ని నెరవేరుస్తున్నందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.

 

దేశం ప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పన కు లక్షల కొద్దీ కోట్ల రూపాయల ను వెచ్చిస్తోందని, అయితే అదే కాలం లో సామాన్య మానవుల జీవన నాణ్యత ను మెరుగుపరచడం కోసం ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ లక్ష్యాన్ని సాధించడానికి దేశం కొత్త ప్రమాణాలను సైతం ఏర్పరుస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. పేదల సశక్తీకరణ కోసం ప్ర

స్తుతం పెద్ద పీట వేయడం జరుగుతోంది అని ఆయన అన్నారు. 2 కోట్ల కు పైచిలుకు పేద కుటుంబాలు గృహ వసతి ని పొందాయి, 10 కోట్ల కుటుంబాలు టాయిలెట్ సౌకర్యానికి నోచుకున్నాయని తెలిపారు.

అదేవిధంగా, జన్ ధన్ ఖాతా ద్వారా వారు బ్యాంకింగ్ వ్యవస్థ లో చేరినప్పుడు వారికి సాధికారిత ప్రాప్తిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

స్వశక్తీకరణ జరగాలీ అంటే వైద్యం, విద్య, సౌకర్యాల తో పాటు గౌరవం లభించేటట్లు చూడటానికి అదేపని గా కఠోర శ్రమ అవసరపడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయుష్మాన్ యోజన, ఆర్థికం గా బలహీనమైన వర్గాల వారికి రిజర్వేషన్ లు, రహదారులు, ఉచితం గా గ్యాస్ కనెక్షన్, ఉచితం గా విద్యుత్ సౌకర్యం, ముద్ర యోజన, స్వనిధి యోజన ల వంటి పథకాలు పేదల కు గౌరవ ప్రదమైనటువంటి జీవనం లభించడానికి దిశ ను సూచిస్తున్నాయి. మరి అవి సాధికారిత కల్పన కు ఒక మాధ్యమం గా మారాయి అని ఆయన అన్నారు.

గుజరాత్ సహా యావత్ దేశంలో జరుగుతున్న అనేక పనుల కారణం గా దేశం లోని ప్రతి వ్యక్తి లో, ప్రతి ఒక్క ప్రాంతం లో విశ్వాసం ఇనుమడిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. మరి ఈ విధమైన ఆత్మ విశ్వాసం ఎలాంటి సవాళ్లను అయినా సరే అధిగమించడానికి, ప్రతి ఒక్క కల ను నెరవేర్చుకోవడానికి తోడ్పడే ఒక సూత్రం అని ఆయన అన్నారు.

 

భారతదేశం నుంచి ఒలింపిక్ క్రీడోత్సవాల లో పాలుపంచుకొంటున్న దళాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, నూరు సంవత్సరాల లో ఒకసారి వచ్చే విపత్తు ఎదురైన కాలం లో సైతం ఒలింపిక్స్ కు అత్యధిక సంఖ్య లో క్రీడాకారులు అర్హత ను సాధించారన్నారు. వారు అర్హత ను సాధించడం ఒక్కటే కాకుండా మెరుగైన ర్యాంకుల ను కలిగి ఉన్న ఆటగాళ్లతో బలంగా పోరాడుతున్నారు కూడా అని ప్రధాన మంత్రి అన్నారు.

 

భారతదేశం క్రీడాకారుల లో ఉత్సాహం, ఉద్వేగం, స్ఫూర్తి ప్రస్తుతం అత్యధిక స్థాయి లో ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. సరియైన ప్రతిభ ను గుర్తించి, ప్రోత్సహించినప్పుడు ఈ రకమైన విశ్వాసం ఉదయిస్తుందని ఆయన అన్నారు. వ్యవస్థ లు మార్పునకు లోనై, పారదర్శకం గా మారినప్పుడు ఈ విధమైన విశ్వాసం పుట్టుకువస్తుందని చెప్పారు. ఈ సరికొత్త విశ్వాసం ‘న్యూ ఇండియా’ కు గుర్తు గా మారుతోందని ఆయన అన్నారు.

 

కరోనా కు వ్యతిరేకం గా పోరాటం చేయడం లో, టీకామందు ను వేయించుకొనే ఉద్యమం లో ఇదే విధమైన విశ్వాసం తో మెలగడాన్ని కొనసాగించాలి అని ప్రజల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. మహమ్మారి గుప్పిట్లో ప్రపంచం చిక్కుకొన్న ఈ తరుణం లో, మనం జాగరూకత ను వీడనే కూడదు అంటూ ఆయన నొక్కిచెప్పారు.

దేశం 50 కోట్ల మందికి టీకాల ను ఇప్పించిన తాలూకు మైలురాయి కేసి శరవేగం గా దూసుకుపోతున్న దశ లో గుజరాత్ కూడా 3.5 కోట్ల వ్యాక్సీన్ డోసులను ఇప్పించిన ఘనత కు చేరువ అవుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. టీకా ను వేయించుకోవడం, మాస్కుల ను ధరించడం, సాధ్యమైనంత వరకు సమూహం లో భాగం కాకుండా జాగ్రత్త తీసుకోవడం.. ఇవి ఎంతయినా అవసరం అని ఆయన స్పష్టం చేశారు.

దేశ నిర్మాణానికి ఒక కొత్త స్ఫూర్తి ని జాగృతం చేయడానికి ఒక సంకల్పాన్ని తీసుకోండి అంటూ దేశ వాసుల కు ప్రధాన మంత్రి సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలైన సందర్భం లో ఈ పవిత్రమైనటువంటి శపథాన్ని స్వీకరించండి అని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంకల్పాల విషయంలో పేదలు, దళితులు, పురుషులు, మహిళలు, అణచివేతకు లోనయినవారు, ప్రతి ఒక్కరికి సమాన భాగం ఉంటుంది అని చెప్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

గత సంవత్సరం లో సుమారు గా 948 లక్షల మెట్రిక్ టన్ను ల ఆహార ధాన్యాల ను కేటాయించిన సంగతి ని గుర్తు పెట్టుకోవాలి. అది ఒక సాధారణ సంవత్సరం కంటే కూడా 50 శాతం ఎక్కువ. కోవిడ్ కాలం లో ఆహార భద్రత కు భరోసా ను ఇవ్వడం కోసం ఈ చర్య ను తీసుకోవడం జరిగింది. 2020‍-21 లో ఆహార సబ్సిడీ కి గాను దాదాపు 2.84 లక్షల కోట్ల రూపాయల ను ఖర్చు చేయడమైంది.

గుజరాత్ లో 3.3 కోట్ల కు పైగా అర్హులైన లబ్ధిదారులు 25.5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల ను అందుకొన్నారు. దీనికి గాను 5 వేల కోట్ల రూపాయల కు పైగా సబ్సిడీ ని భరించడమైంది.

ప్రవాసీ లబ్ధిదారులకు ఆహార భద్రత ను మరింత పటిష్ట పరచడం కోసం ‘వన్ నేశన్ వన్ రేషన్ కార్డు’ పథకాన్ని ఇంతవరకు 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలు లోకి తీసుకురావడమైంది.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Mann KI Baat Quiz
Explore More
జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం
India Inc raised $1.34 billion from foreign markets in October: RBI

Media Coverage

India Inc raised $1.34 billion from foreign markets in October: RBI
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 డిసెంబర్ 2021
December 03, 2021
షేర్ చేయండి
 
Comments

PM Modi’s words and work on financial inclusion and fintech initiatives find resonance across the country

India shows continued support and firm belief in Modi Govt’s decisions and efforts.