‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన్-అర్బన్’ (పిఎంఎవై-యు) లో భాగం గా ఉత్తర్ ప్రదేశ్ లో నిర్మాణంజరిగిన ఇళ్ల తాళం చెవుల ను అక్కడి 75 జిల్లాల కు చెందిన 75,000 మంది లబ్ధిదారుల కు అప్పగించిన ప్రధాన మంత్రి
స్మార్ట్సిటీస్ మిశన్,అమృత్ లలోభాగం గా ఉత్తర్ ప్రదేశ్ లో 75 పట్టణ అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించారు/శంకుస్థాపన చేశారు
ఎఫ్ఎఎమ్ఇ-II లో భాగం గా 75 బస్సుల కు ప్రధాన మంత్రి ప్రారంభ సూచకంగా జెండాచూపడం తో అవి లఖ్ నవూ,కాన్ పుర్, వారాణసీ,ప్రయాగ్రాజ్, గోరఖ్ పుర్,ఝాంసీ, ఇంకా గాజియాబాద్ ల కు పయనమయ్యాయి
లఖ్ నవూలోని బాబా సాహెబ్ భీమ్ రావ్ ఆంబేడ్‌ క‌ర్ యూనివర్సిటి (బిబిఎయు) లో శ్రీ అటల్బిహారీ వాజ్ పేయీ పీఠాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
ఆగ్ రా, కాన్ పుర్,ఇంకాలలిత్ పుర్ ల కు చెందిన ముగ్గురు లబ్ధిదారుల తో ఇష్టాగోష్ఠి గా అప్రయత్న సిద్ధం గామాటామంతీ జరిపారు
‘‘పిఎమ్ఎవై లో భాగం గా 1.13 కోట్ల కు పైగా గృహాల ను నగరాల లో నిర్మించడమైంది. మరి వాటిలో 50 లక్షల కు పైగా ఇళ్ళ ను నిర్మించి, పేద ప్రజల కు స్వాధీనపరచడం జరిగింది’’
‘‘పిఎంఎవై లో భాగం గా దేశం లో సుమారు 3 కోట్ల గృహాల ను నిర్మించడమైంది, వాటి ఖర్చు ఎంతనేది మీరు ఊహించవచ్చును; ఈ ప్రజలంతా ‘లక్షాధికారులు’అయిపోయారు
‘‘ఈ రోజు న, మనం ‘పహెలే ఆప్’(ముందుమీరు) అనాలి, ఈ మాట కు అర్థం- టెక్నాలజీ ఫస్ట్ అన్న మాట!’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున లఖ్ నవూ లో ‘ఆజాదీ @75 – న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ శీర్షిక తో జరిగిన ఒక సమావేశాన్ని, ఎక్స్ పో ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింహ్, శ్రీ హర్ దీప్ పురీ, శ్రీ మహేంద్ర నాథ్ పాండే, శ్రీ కౌశల్ కిశోర్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ లతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు అయ్యారు.

 

 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (పిఎమ్ఎవై-యు) లో భాగం గా నిర్మాణం జరిగిన గృహాల యొక్క తాళం చెవుల ను ప్రధాన మంత్రి ఉత్తర్ ప్రదేశ్ లో 75 జిల్లాల కు చెందిన 75,000 లబ్ధిదారుల కు డిజిటల్ మాధ్యమం ద్వారా అప్పగించడం తో పాటు వారితో మాట్లాడారు కూడాను. స్మార్ట్ సిటీస్ మిశన్ మరియు అమృత్ లకు చెందిన 75 పట్టణ అభివృద్ధి పథకాల కు ఆయన ప్రారంభోత్సవం/శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా లఖ్ నవూ, కాన్ పుర్, వారాణసీ, ప్రయాగ్ రాజ్, గోరఖ్ పుర్, ఝాంసీ, ఇంకా గాజియాబాద్ లతో పాటు ఏడు నగరాల కు ఎఫ్ఎఎమ్ఇ-II లో భాగం గా 75 బస్సు లకు ప్రారంభ సూచక జెండా ను చూపడం తో ఆ బస్సులు బయలుదేరాయి. అలాగే, భారత ప్రభుత్వ గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు చెందిన విభిన్న ప్రముఖ మిశన్ లలో భాగం గా అమలు చేసిన 75 ప్రాజెక్టుల ను గురించి వివరించేటటువంటి ఒక కాఫీ టేబల్ బుక్ ను కూడా ఆవిష్కరించారు. ప్రధాన మంత్రి లఖ్ నవూ లో బాబా సాహెబ్ భీమ్ రావ్ ఆంబేడ్‌ క‌ర్ యూనివర్సిటి (బిబిఎయు) లో శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ పీఠాన్ని ఏర్పాటు చేసిన సంగతి ని ఈ సందర్బం లో ప్రకటించారు.

ఆగ్ రా కు చెందిన శ్రీమతి విమలేశ్ తో ప్రధాన మంత్రి మాట్లాడినప్పుడు పిఎమ్ ఆవాస్ తో పాటు గ్యాస్ సిలిండర్, టాయిలెట్, కరెంటు, నీటి కనెక్శన్, ఇంకా రేషన్ కార్డు తదితర పథకాల వల్ల తాను ప్రయోజనాల ను పొందినట్లు లబ్ధిదారు తెలియజేశారు. ప్రభుత్వ పథకాల తాలూకు ప్రయోజనాల ను పొందవలసిందిగాను, పిల్లల ను, ప్రత్యేకించి ఆడపిల్లలను చదువు చెప్పించవలసిందిగాను ఆమె కు ప్రధాన మంత్రి సూచించారు.

కాన్ పుర్ కు చెందిన పాల విక్రేత రామ్ జానకి గారి తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘స్వామిత్వ యోజన’ తాలూకు ప్రయోజనాల ను అందుకున్నారా? అని ఆవిడ ను అడిగారు. పది వేల రూపాయల రుణాన్ని తాను తీసుకొన్నట్లు ఆమె తెలియజేస్తూ, ఆ సొమ్ము ను తన వ్యాపారం లో పెట్టుబడి పెట్టినట్లు బదులిచ్చారు. డిజిటల్ లావాదేవీల ద్వారా వ్యాపారాన్ని పెంచుకోండి అని ప్రధాన మంత్రి ఆమెతో అన్నారు.

లలిత్ పుర్ కు చెందిన పిఎం ఆవాస్ యోజన లబ్ధిదారు శ్రీమతి బబిత ను బ్రతుకుతెరువు కోసం ఆమె ఏమి చేస్తుంటారో ప్రధాన మంత్రి వాకబు చేశారు. ఆ పథకం ఆమె కు ఏ విధం గా ఉపయోగపడిందో వివరించవలసిందని ఆయన అడిగారు. డబ్బు ను నేరు గా లబ్ధిదారుల కు బదలాయించడం లో జన్ ధన్ ఖాతా తోడ్పడిందని ఆయన అన్నారు. సాంకేతిక విజ్ఞానం ఎక్కువ గా పేదల కు సహాయకారి అవుతోందని ఆయన చెప్పారు. స్వామిత్వ యోజన తాలూకు ప్రయోజనాల ను పొందవలసిందిగా ప్రధాన మంత్రి ఆమె కు సూచించారు. లబ్ధిదారులందరి తో ప్రధాన మంత్రి చాలా సరళం గాను, ఆత్మీయత తోను ముచ్చటించారు. ఈ మాటామంతీ ఎంతో ఇష్టాగోష్ఠి గా సహజ వాతావరణం లో సాగింది.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, చాలావరకు సంపత్తులు ఇంటి లో పురుషుల పేరుల తో ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని పరిశీలన లోకి తీసుకొని గట్టి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అంటూ, మరి ఒక నిర్ధిష్ట చర్యగానా అన్నట్లు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లోని 80 శాతాని కి పైగా గృహాల రిజిస్ట్రేశన్ ను మహిళ ల పేరిట జరుపుతుండడమో, లేదా వారి ని సంయుక్త యజమానులు గా పేర్కొనడమో జరిగింది అని వివరించారు.

భరతమాత కు తనను తాను పూర్తి గా అంకితం చేసుకొన్నటువంటి ఒక జాతీయ దార్శనికుడు అయిన అటల్ బిహారీ వాజ్ పేయీ గారి వంటి వ్యక్తి ని దేశాని కి లఖ్ నవూ ప్రసాదించింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఈ రోజు న ఆయన స్మృతి లో, బాబాసాహెబ్ భీమ్ రావ్ ఆంబేడ్‌ క‌ర్ యూనివర్సిటి లో అటల్ బిహారీ వాజ్ పేయీ పీఠాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి ప్రకటించారు.

ఇదివరకటి సంఖ్యల తో పోలిస్తే ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లో భాగం గా నిర్మాణం జరిగిన ఇళ్ళ సంఖ్య లో అత్యధిక వృద్ధి ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. నగరాల లో 1.13 కోట్ల కు పైగా ఇళ్ళ ను నిర్మించడం జరిగిందని, మరి వాటిలో 50 లక్షల కు పైగా ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే పూర్తి కావడంతో పాటు ఆ ఇళ్ల ను పేదల కు అప్పగించడం కూడా జరిగింది అని ఆయన తెలియజేశారు. ఇంతకాలం మురికివాడల లో నివసిస్తూ వచ్చినటువంటి పట్టణ ప్రాంతాల పేద ప్రజానీకం లో మూడు కోట్ల కుటుంబాలు పక్కా ఆశ్రయం అంటూ లేకుండా ఉండగా, అటువంటి వారి కి ‘లక్షాదికారులు’ అయ్యే అవకాశం దక్కింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా దాదాపు 3 కోట్ల గృహాల ను నిర్మించడం జరిగింది. ఆ ఇళ్ళ ఖర్చు ఎంతో మీరు అంచనా వేయండి. ఈ ప్రజలంతా ‘లక్షాధికారులు’ అయ్యారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఇప్పుడు అధికారం లో ఉన్న ప్రభుత్వాని కంటే ముందు ఇదివరకటి ప్రభుత్వాలు పథకాల ను అమలు చేయడానికి వాటి కాళ్ల ను ఈడ్చుకొన్నాయని, ఎందుకంటే 18,000కు పైగా గృహాల ను ఆ కాలం లో ఆమోదం ఇవ్వగా 18 ఇళ్ళ ను అయినా నిర్మించడం జరుగలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వం లో వర్తమాన ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన అనంతరం, 9 లక్షల కు పైగా యూనిట్ లను పట్టణ పేదల కు అప్పగించడమైందని, మరో 14 లక్షల యూనిట్ లు వేరు వేరు దశల లో నిర్మాణం లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఇళ్ళ లో ఆధునిక సదుపాయాలను సమకూర్చడం జరిగిందని ఆయన అన్నారు.

పట్టణ ప్రాంతాల లో మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ను, సవాళ్ళ ను తొలగించడం కోసం ప్రభుత్వం చాలా మహత్వపూర్ణమైనటువంటి ప్రయత్నాన్ని చేసిందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (ఆర్ఇఆర్ఎ- ‘రెరా’), యాక్టు ఆ కోవ కు చెందినటువంటి ఒక పెద్ద నిర్ణయం అని ఆయన అన్నారు. ఈ చట్టం యావత్తు గృహ నిర్మాణ రంగాన్ని అపనమ్మకం నుంచి, మోసం నుంచి బయటకు తీసుకు రావడం లో సహాయకారి అయిందని, అంతేకాక ఈ రంగం తో సంబంధం గల అన్ని వర్గాల కు సాయపడి, వాటికి సాధికారిత ను కల్పించిందని ఆయన అన్నారు.

ఎల్ఇడి వీధి దీపాల ను అమర్చడం ద్వారా పట్టణ సంస్థ లకు కూడా ప్రతి సంవత్సరం రమారమి 1000 కోట్ల రూపాయలు మిగులుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఇక ఈ మొత్తాన్ని ఇతర అభివృద్ధి పనుల కోసం వినియోగించడం జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఎల్ఇడి నగర ప్రాంతాల లో నివసిస్తున్న ప్రజల కు కరెంటు బిల్లు ను సైతం చాలా తగ్గించి వేసింది అని ఆయన అన్నారు.

భారతదేశం లో గడచిన ఆరేడేళ్ళ లో సాంకేతిక విజ్ఞానం కారణం గా పట్టణ ప్రాంతాల లో ఒక భారీ పరివర్తన చోటు చేసుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం దేశం లో 70 కి పైగా నగరాల లో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్స్ కు సాంకేతిక విజ్ఞానం ఆధారం గా ఉంది అని ఆయన తెలిపారు. ‘పహెలే ఆప్’ (ముందు మీరు) సంస్కృతి కి పేరు తెచ్చుకొన్న లఖ్ నవూ లో ప్రధాన మంత్రి చమత్కారమైన వ్యాఖ్య ను చేస్తూ, ‘‘ఈ రోజు న మనం టెక్నాలజీ ఫస్ట్’’ అని పేర్కొనవలసి వస్తోంది అన్నారు.

వీధి వీధి కీ తిరుగుతూ సరకుల ను అమ్మేటటువంటి చిన్న వ్యాపారస్తుల ను ‘పిఎం స్వనిధి యోజన’ లో భాగం గా బ్యాంకు లతో జోడించడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పథకం ద్వారా 25 లక్షల కు పైగా లబ్ధిదారుల కు 2,500 కోట్ల రూపాయల కు పైగా సహాయం చేయడమైంది అని ఆయన తెలిపారు. వీరిలో 7 లక్షల మంది కి పైగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన లబ్ధిదారులే ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల ను పెంచుతున్నందుకు గాను ఈ వ్యాపారుల ను ఆయన అభినందించారు.

దేశం అంతటా ప్రధాన నగరాల కు ఇండియా మెట్రో సర్విస్ శరవేగం గా విస్తరిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. 2014వ సంవత్సరం లో, మెట్రో సేవ 250 కిలో మీటర్ల కన్నా తక్కువ పొడవు తో కూడిన మార్గం లో నడిచేదని, ఇప్పుడు మెట్రో సుమారు 750 కిమీ పొడవైన మార్గం లో నడుస్తోందని వివరించారు. దేశం లో మరో 1000 కిలో మీటర్ కు పైగా మెట్రో మార్గాల ను సిద్ధం చేసే పనులు జరుగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు.

 

 

 



 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasising the belief of Swami Vivekananda on the power of youth
January 12, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam emphasising the belief of Swami Vivekananda that youth power is the most powerful cornerstone of nation-building and the youth of India can realize every ambition with their zeal and passion:

"अङ्गणवेदी वसुधा कुल्या जलधिः स्थली च पातालम्।

वल्मीकश्च सुमेरुः कृतप्रतिज्ञस्य वीरस्य॥"

The Subhashitam conveys that, for the brave and strong willed, entire earth is like their own courtyard, seas like ponds and sky – high mountain like mole hills . Nothing on earth is impossible for those whose will is rock solid.

The Prime Minister wrote on X;

“स्वामी विवेकानंद का मानना था कि युवा शक्ति ही राष्ट्र-निर्माण की सबसे सशक्त आधारशिला है। भारतीय युवा अपने जोश और जुनून से हर संकल्प को साकार कर सकते हैं।

अङ्गणवेदी वसुधा कुल्या जलधिः स्थली च पातालम्।

वल्मीकश्च सुमेरुः कृतप्रतिज्ञस्य वीरस्य॥"