దేశాభివృద్ధిలో యువశక్తి అత్యంత ప్రధానమైనదనీ, శ్రద్ధ, ఆసక్తితో తమ లక్ష్యాన్ని భారతీయ యువత నెరవేర్చుకోగలదనే స్వామి వివేకానందుని నమ్మకాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
"అంగణవేదీ వసుధా కుల్యా జలధిః స్థలీ చ పాతాళమ్।
వల్మీకశ్చ సుమేరుః కృతప్రతిజ్ఞస్య వీరస్య॥"
ధైర్యంగా, దృఢ నిశ్చయంతో ఉండేవారికి ఈ భూమి ఇంటి ముందున్న వాకిలి వంటిదనీ, సముద్రాలు చెరువుల్లాంటివనీ, మేరు పర్వతం సైతం చిన్న పుట్టలా కనిపిస్తుందనీ, దృఢ సంకల్పం ఉన్నవారికి ఈ పుడమిపై సాధించలేనిది ఏమీ లేదని ఈ సుభాషితం తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘దేశాభివృద్ధికి అత్యంత శక్తిమంతమైన ఆధారం యువశక్తి అని స్వామి వివేకానంద విశ్వసించారు. ఉత్సాహం, పట్టుదలతో భారతీయ యువత తమ సంకల్పాన్ని నెరవేర్చుకోగలదు.
"అంగణవేదీ వసుధా కుల్యా జలధిః స్థలీ చ పాతాళమ్।
వల్మీకశ్చ సుమేరుః కృతప్రతిజ్ఞస్య వీరస్య॥"
स्वामी विवेकानंद का मानना था कि युवा शक्ति ही राष्ट्र-निर्माण की सबसे सशक्त आधारशिला है। भारतीय युवा अपने जोश और जुनून से हर संकल्प को साकार कर सकते हैं।
— Narendra Modi (@narendramodi) January 12, 2026
अङ्गणवेदी वसुधा कुल्या जलधिः स्थली च पातालम्।
वल्मीकश्च सुमेरुः कृतप्रतिज्ञस्य वीरस्य॥ pic.twitter.com/6cliyTstvE


