‘‘భారతదేశ స్వాతంత్య్రాని కి దేశ ఈశాన్య ప్రాంతం ప్రవేశ ద్వారం అని నేతాజీఅన్నారు. అదే ప్రాంతం ఒక ‘న్యూ ఇండియా’ కలల ను నెరవేర్చడాని కి ఒక ప్రవేశద్వారం గా మారుతోంది’’
‘‘ఈశాన్య ప్రాంతం లో ఉన్నటువంటి అవకాశాల కు రూపు ను ఇచ్చేందుకు మేము కృషిచేస్తున్నాం’’
‘‘ప్రస్తుతం దేశ యువత మణిపుర్ క్రీడాకారుల వద్ద నుంచి ప్రేరణ ను పొందుతున్నది’’
‘‘మణిపుర్ ఒక ‘దిగ్బంధ రాష్ట్రం’ గా ఉన్నది కాస్తా అంతర్జాతీయ వ్యాపారాన్నిప్రోత్సహించేటటువంటి ఒక రాష్ట్రం గా మారింది
‘‘మణిపుర్ లో స్థిరత్వాన్ని సైతం మనం పరిరక్షించవలసి ఉంది; మరి మణిపుర్ నుఅభివృద్ధి లో కొత్త శిఖరాల కు కూడా చేర్చవలసి ఉన్నది. జోడు ఇంజన్ లప్రభుత్వం మాత్రమే ఈ కార్యాన్ని చేయగలుగుతుంది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మణిపుర్ లోని ఇంఫాల్ లో సుమారు 2950 కోట్ల రూపాయల విలువైన 9 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడంతో పాటు దాదాపు గా 1850 కోట్ల రూపాయల విలువైన 13 ప్రాజెక్టుల ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రహదారుల సంబంధిత మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, గృహనిర్మాణం, సమాచార సంబంధి సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, కళలు, ఇంకా సంస్కృతి సహా వివిధ రంగాల కు చెందినవి అయి ఉన్నాయి.

1700 కోట్ల రూపాయల కు పైచిలుకు ఖర్చు తో నిర్మించే అయిదు జాతీయ రహదారి పథకాల పనుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్ హెచ్-37 పై బరాక్‌ నది మీద ఒక ఉక్కు వంతెన ను ఆయన ప్రారంభించారు. దీని నిర్మాణాని కి 75 కోట్ల రూపాయల కు పైనే వ్యయం అయింది. ఇది సిల్ చర్ కు మరియు ఇంఫాల్ కు మధ్య వాహనాల రద్దీ ని తగ్గించనుంది. రమారమి 1100 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించినటువంటి 2387 మొబైల్ టవర్ లను కూడా మణిపుర్ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు.

ప్రధాన మంత్రి 280 కోట్ల రూపాయల విలువైన ‘థౌబల్ బహుళార్థ సాధక జల పంపిణీ వ్యవస్థ’ ను కూడా ప్రారంభించారు. ఇది ఇంఫాల్ నగరాని కి తాగునీటి ని సరఫరా చేస్తుంది; ఈ నీటి సరఫరా పథకం నిర్మాణాని కి 65 కోట్ల రూపాయలు ఖర్చయింది. తామెంగ్ లోంగ్ జిల్లా లో పది జనావాసాల లో నివసిస్తున్న వారికి రక్షిత తాగునీటి ని ఈ పథకం అందజేస్తుంది. దీనితో పాటు 51 కోట్ల రూపాయల వ్యయం తో అభివృద్ధి పరచిన సేనాపతి జిల్లా కేంద్ర నీటి సరఫరా పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది.

ఇంఫాల్ లో ఒక ‘అత్యంత ఆధునికమైన కేన్సర్ ఆసుపత్రి’ కి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. పిపిపి పద్ధతి లో నిర్మించే ఈ ఆసుపత్రి విలువ సుమారు 160 కోట్ల రూపాయలు. కియామ్ గెయి లో 200 పడకల సదుపాయం కలిగిన కోవిడ్ ఆసుపత్రి ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ని డిఆర్ డిఒ సహకారం తో సుమారు 37 కోట్ల రూపాయల ఖర్చు తో ఏర్పాటు చేయడమైంది. 170 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో అభివృద్ధి చేసినటువంటి ‘ఇంఫాల్ స్మార్ట్ సిటీ మిశన్’ తాలూకు మూడు పథకాల ను ఆయన ప్రారంభించారు. వీటిలో- ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్’ (ఐసిపిసి)తో పాటు, ఇంఫాల్ నది లో ‘పశ్చిమ నదీముఖ ప్రాంత అభివృద్ధి (ఒకటో దశ)’, ఇంకా ‘థంగల్ బాజార్ లో మాల్ రోడ్ అభివృద్ధి (ఒకటో దశ)’ ప్రాజెక్టు లు ఉన్నాయి.

దాదాపు గా 200 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న ‘సెంటర్ ఫర్ ఇన్ వెన్శన్, ఇనొవేశన్, ఇంక్యూబేశన్ ఎండ్ ట్రైనింగ్’ (సిఐఐఐటి)’ కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే 240 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో హరియాణా లోని గుడ్ గాఁవ్ లో నిర్మాణం కానున్న ‘మణిపుర్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెర్ ఫార్మింగ్ ఆర్ట్స్’ కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఇప్పటి నుంచి కొద్ది రోజుల లోపల- అంటే జనవరి 21వ తేదీ నాడు- రాష్ట్ర ప్రతిపత్తి ని పొందిన తరువాతి 50వ వార్షికోత్సవాన్ని మణిపుర్ జరుపుకోనుందన్నారు. ఈ యథార్థాని కి తోడు, భారతదేశం స్వాతంత్య్రం తాలూకు 75 సంవత్సరాల వేళ ‘అమృత్ మహోత్సవాన్ని’ జరుపుకొంటూ ఉన్న సందర్భం తనంతట తాను ఒక ప్రధానమైనటువంటి ప్రేరేపణ కూడాను అని ఆయన అన్నారు.

మణిపుర్ ప్రజల ధైర్య సాహసాల కు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని ఘటించారు. దేశ ప్రజల లో స్వాతంత్య్రం పట్ల ఉన్న నమ్మకం అనేది ఇక్కడి మొయిరంగ్ గడ్డ మీద నుంచే మొదలైంది; నేతాజీ సుభాష్ కు చెందిన సైన్యం మొట్టమొదటిసారి గా జాతీయ జెండా ను ఇక్కడ ఎగుర వేసింది అని ప్రధాన మంత్రి గుర్తుచేశారు. భారతదేశం స్వాతంత్య్రాని కి ప్రవేశ ద్వారం ఈశాన్య ప్రాంతం అని నేతాజీ పేర్కొన్నారు. అటువంటి ఈశాన్య ప్రాంతం ఒక ‘న్యూ ఇండియా’ యొక్క కలల ను పండించేందుకు ప్రవేశ ద్వారం గా మారుతున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో తూర్పు ప్రాంతం మరియు ఈశాన్య ప్రాంతాలు దేశ పురోగతి కి ఒక వనరు గా నిలుస్తాయి అనే నమ్మకం నాలో ఉంది; ఈ నమ్మకం ఇవాళ ఈ ప్రాంతం సాధించినటువంటి వృద్ధి లో కనిపిస్తోంది అని ఆయన అన్నారు.

ఈ రోజు న ప్రారంభమైన మరియు శంకుస్థాపన జరిగిన అనేక పథకాల కు గాను మణిపుర్ ప్రజల కు ప్రధాన మంత్రి అభినందనలను తెలియజేశారు. పూర్తి సంఖ్యాధిక్యం తో, సంపూర్ణ ప్రభావం తో పాలన సాగిస్తున్నటువంటి ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించినందుకు మణిపుర్ ప్రజల కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ స్థిరత్వం వల్లనే, మరి మణిపుర్ ప్రజల ఎంపిక కారణం గానే కిసాన్ సమ్మాన్ నిధి లో భాగం గా వందల కొద్దీ కోట్ల రూపాయల ను 6 లక్షల రైతు కుటుంబాలు అందుకొంటూ ఉండడం; పిఎమ్ గరీబ్ కళ్యాణ్ యోజన లో భాగం గా 6 లక్షల పేద కుటుంబాలు ప్రయోజనాల ను పొందుతూ ఉండటం; పిఎమ్ఎవై లో భాగం గా 80 వేల గృహాల నిర్మాణం; ఆయుష్మాన్ యోజన లో భాగం గా 4.25 లక్షల ఉచిత వైద్య చికిత్స; 1.5 లక్షల గ్యాస్ ఉచిత కనెక్శన్ లు; 1.3 లక్షల విద్యుత్తు ఉచిత కనెక్శన్ లు; 30 వేల టాయిలెట్ లు; రాష్ట్రం లోని ప్రతి జిల్లా లో ఆక్సీజన్ ప్లాంటు లు; ఇంకా 30 లక్షల కు పైగా వ్యాక్సీన్ ఉచిత డోజు ల వంటి కార్యసాధన లు సాధ్యపడ్డాయి అని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి పదవి ని తాను స్వీకరించే కన్నా పూర్వమే మణిపుర్ ను అనేక సార్లు సందర్శించినట్లు ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. వారి బాధ ఏమిటన్నది తాను అర్థం చేసుకోగలను అని ఆయన అన్నారు. ‘‘ఈ కారణం గానే 2014వ సంవత్సరం తరువాతి కాలం లో నేను దిల్లీ ని – అదే, భారతదేశం ప్రభుత్వాన్ని మీ ముంగిట కు తీసుకు వచ్చాను.’’ ఈ ప్రాంతాన్ని సందర్శించవలసింది గా ప్రతి ఒక్క మంత్రి కి, ప్రతి ఒక్క అధికారి కి సూచించడం జరిగింది. ‘‘ఈ ప్రాంతాని కి చెందిన అయిదుగురు ప్రముఖులు మంత్రిమండలి లో కీలక శాఖల ను నిర్వహిస్తున్న సంగతి ని మీరు గమనించవచ్చును’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వం ఏడు సంవత్సరాలు గా చేస్తున్న కఠోర శ్రమ ను యావత్తు ఈశాన్య ప్రాంతం లో చూడవచ్చు. ప్రత్యేకించి మణిపుర్ లో దీని ఫలితాల ను గమనించవచ్చు అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం మణిపుర్ ఒక కొత్త శ్రమ సంస్కృతి కి సంకేతం గా మారుతోంది. ఈ మార్పు లు మణిపుర్ సంస్కృతి కి మరియు మణిపుర్ ప్రజల సంరక్షణ కు ఉద్దేశించినవి. సంధానం అనేది కూడా ఈ పరివర్తన లో ఒక మహత్వపూర్ణమైనటువంటి అంశం. అదే విధం గా రచనాత్మకత అంతే ప్రధానమైన విషయం అని ఆయన అన్నారు. రహదారులు మరియు మౌలిక సదుపాయాల కు సంబంధించిన పథకాలు, వీటికి తోడు ఉత్తమమైన మొబైల్ నెట్ వర్క్ లు.. ఇవి అన్నీ కలసి సంధానాన్ని పటిష్ట పరచగలుగుతాయి అని ప్రధాన మంత్రి వివరించారు. సిఐఐఐటి స్థానిక యువత లో రచనాత్మకత కు, నూతన ఆవిష్కరణ సంబంధి స్ఫూర్తి కి తోడ్పడుతుంది అని ఆయన అన్నారు. ఆధునిక కేన్సర్ ఆసుపత్రి అనేది సంరక్షణ తాలూకు మరొక పార్శ్వాన్ని జోడిస్తుంది. మరి అదే మాదిరి గా మణిపుర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెర్ ఫార్మింగ్ ఆర్ట్, గోవింద్ జీ మందిరం పునర్ నవీకరణ లు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తాయి అని ఆయన చెప్పారు.

ఈశాన్య ప్రాంతాల కోసం ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని తమ ప్రభుత్వం సంకల్పం గా తీసుకుంది అని ప్రధాన మంత్రి అన్నారు. దైవం ఎన్నో విధాలైన ప్రాకృతిక వనరుల ను ప్రసాదించడం వల్ల ఈ ప్రాంతాని కి సామర్థ్యం బాగా దండి గా ఉంది అని ఆయన అన్నారు. ఇక్కడ అభివృద్ధి కి, పర్యటన కు ఎంతో ఆస్కారం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈశాన్య ప్రాంతం లో ఉన్నటువంటి ఈ అవకాశాల ను అందిపుచ్చుకోవడం కోసం ఇక్కడ ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్నాయి అని కూడా ఆయన తెలిపారు. ఈశాన్య ప్రాంతం ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి కి ఒక ప్రవేశద్వారం గా మారుతోంది అని ఆయన వివరించారు.

మణిపుర్ దేశాని కి అత్యంత అరుదైనటువంటి రత్నాల ను ప్రసాదిస్తున్న రాష్ట్రాల లో ఒక రాష్ట్రం గా ఉంటూ వచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక్కడి యువత, మరీ ముఖ్యం గా మణిపుర్ కుమార్తె లు, దేశాన్ని ప్రపంచం అంతటా గర్వపడేటట్టు చేశారు. మరీ ముఖ్యం గా దేశం లో యువత మణిపుర్ క్రీడాకారుల నుంచి ప్రేరణ ను స్వీకరిస్తోంది అని ఆయన అన్నారు.

రెండు ఇంజిన్ ల ప్రభుత్వం నిరంతర ప్రయాస ల ఫలితం గా ప్రస్తుతం ఈ ప్రాంతం లో ఎలాంటి ఉగ్రవాదం తాలూకు మంటలు గాని, మరి అభద్రత గాని లేదు అని ప్రధాన మంత్రి అన్నారు. దానికి బదులు గా ఇక్కడ శాంతి, ఇంకా అభివృద్ధి ల తాలూకు వెలుగులు ప్రసరిస్తూ ఉన్నాయి అని ఆయన అన్నారు. ఈశాన్య ప్రాంతం లో వందల కొద్దీ యువతీ యువకులు ఆయుధాల ను వదలిపెట్టి అభివృద్ధి తాలూకు ప్రధాన స్రవంతి లో చేరుతున్నారు అని ఆయన అన్నారు. దశాబ్దాల తరబడి పెండింగు పడ్డ ఒప్పందాల ను వర్తమాన సర్కారు చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందాలు గా కొలిక్కి తెచ్చింది అని ఆయన చెప్పారు. ‘దిగ్బంధాని కి లోనైన రాష్ట్రం’ గా ఉంటూ వచ్చిన మణిపుర్ అంతర్జాతీయ వ్యాపారాని కి బాట పరుస్తున్నటువంటి ఒక రాష్ట్రం గా మారింది అని ఆయన అన్నారు.

ఇరవై ఒకటో శతాబ్దం లోని ఈ దశాబ్ది మణిపుర్ కు చాలా ముఖ్యమైనటువంటిది అని ప్రధాన మంత్రి అన్నారు. గతం లో చాలా కాలాన్ని నష్టపోవడం శోచనీయం అని ఆయన అన్నారు. అటువంటి ఒక్క క్షణం అయిని ఇప్పుడు లేదు అని కూడా ఆయన అన్నారు. ‘‘మనం మణిపుర్ లో స్థిరత్వాన్ని కూడా కాపాడవలసి ఉంది; అలాగే మణిపుర్ ను అభివృద్ధి తాలూకు కొత్త శిఖరాల కు తీసుకు పోవలసి ఉంది. మరి రెండు ఇంజిన్ ల ప్రభుత్వమొక్కటే ఈ పని ని చేయగలదు’’ అని ఆయన నొక్కి చెప్పారు.

 

 

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India's job market among world's most prepared for recruitment: QS Skills Index

Media Coverage

India's job market among world's most prepared for recruitment: QS Skills Index
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The glorious history of Vadnagar in Gujarat is more than 2500 years old: Prime Minister
January 17, 2025

The Prime Minister Shri Narendra Modi today remarked that the glorious history of Vadnagar in Gujarat is more than 2500 years old and unique efforts were taken to preserve and protect it.

In a post on X, he said:

“गुजरात के वडनगर का गौरवशाली इतिहास 2500 साल से भी पुराना है। इसे संजोने और संरक्षित करने के लिए यहां अनूठे प्रयास किए गए हैं।”