‘సురక్షిత్ జాయేఁ, ప్రశిక్షిత్ జాయేఁ’ స్మారక తపాలా బిళ్ళ ను విడుదల చేశారు
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ - భారతదేశ స్వాతంత్య్ర సమరం లో ప్రవాసుల తోడ్పాటు’ ఇతివృత్తం పై ఏర్పాటైన మొట్ట మొదటిడిజిటల్ పిబిడి ప్రదర్శన ను ప్రారంభించారు
‘‘ఇందౌర్ అనేది ఒక నగరం మాత్రమే కాకుండా ఒక దశ కూడాను. ఆ దశ ఎలాంటిదిఅంటే అది తన వారసత్వాన్ని పరిరక్షించుకొంటూనే కాలాని కంటే ముందు గా పయనించేటటువంటిది’’
‘‘భారతదేశం యొక్క ‘అమృత కాలం’ యాత్ర లో మన ప్రవాసి భారతీయుల కు ఒక ప్రముఖస్థానం ఉంది’’
‘భారతదేశం యొక్క అద్వితీయ గ్లోబల్ విజన్ ను మరియు ప్రపంచ క్రమం లో భారతదేశంపాత్ర ను ప్రవాసి భారతీయులు ‘అమృత కాలం’ లో బలపరచనున్నారు’’
‘‘ప్రవాసి భారతీయుల లో, ‘వసుధైవ కుటుంబకమ్’, ఇంకా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ ల తాలూకు అనేక దృశ్యాల మాలిక ను మనం గమనించవచ్చును’’
‘‘ప్రవాస భారతీయులు భారతదేశం యొక్క శక్తియుక్తమైనటువంటి మరియు సమర్ధమైనటువంటివాణి ని ప్రతిధ్వనింప చేస్తున్నారు’’
‘‘జి-20 అనేది అదేదో దౌత్యపరమైన కార్యక్రమం ఒక్కటే కాదు, దానిని సార్వజనిక భాగస్వామ్యం యొక్కచరిత్రాత్మక కార్యక్రమం గా తీర్చిదిద్దవలసి ఉంది; మరి దీనిలో ఎవరైనా ‘అతిథి దేవో భవ’ తాలూకు భావన నూ దర్శించవచ్చును’’
‘‘భారతదేశం యువతీయువకుల నైపుణ్యం, విలువ లు మరియు శ్రమ తాలూకు నైతిక నియమాలు ప్రపంచ వృద్ధి కి చోదక శక్తి కాగలుగుతాయి’’

మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో ఏర్పాటైన పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ సంబంధి సమ్మేళనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ‘సురక్షిత్ జాయేఁ, ప్రశిక్షిత్ జాయేఁ’ పేరు తో రూపొందించినటువంటి ఒక స్మారక తపాలా బిళ్ళ ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు. అంతేకాకుండా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ - భారతదేశ స్వాతంత్య్ర సమరం లో ప్రవాసుల యొక్క తోడ్పాటు’ ఇతివృత్తం తో మొట్టమొదటిసారి గా ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ పిబిడి ఎగ్జిబిశను ను కూడా ఆయన ప్రారంభించారు.

ప్రవాసి భారతీయ దివస్ (పిబిడి) సమ్మేళనం విదేశాల లోని భారతీయుల తో సంబంధాల కోసం ఒక ముఖ్యమైన వేదిక ను అందించే మరియు ప్రవాసులు పరస్పరం ముఖాముఖి గా భేటీ అయ్యేందుకు కూడా అవకాశాన్ని కల్పించే భారత ప్రభుత్వ ఆధ్యర్యం లోని ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమంగా ఉంది. ‘‘అమృత కాలం’ లో భారతదేశం యొక్క ప్రగతి కి ఆధారపడదగినటువంటి భాగస్వాములు గా ప్రవాసులు’ అనేది ఈ సారి పిబిడి సమావేశం యొక్క ఇతివృత్తం గా ఉంది. దాదాపు గా 70 దేశాల కు చెందిన 3,500 మంది కి పైగా ప్రవాసీ సముదాయం సభ్యులు ఈ పిబిడి సమ్మేళనాని కి వారి పేరుల ను నమోదు చేసుకొన్నారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రవాసీ భారతీయ దివస్ తన వైభావాన్నంతటినీ రంగరించుకొని నాలుగు సంవత్సరాల అంతరం తరువాత తిరిగి వచ్చిందన్నారు. ఈ సమ్మేళనం లో స్వయం గా పాలుపంచుకొని మాట్లాడుతుండడం యొక్క ప్రాముఖ్యాన్ని, ఉల్లాసాన్ని గురించి ఆయన నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమాని కి ప్రతి ఒక్కరిని 130 కోట్ల మంది భారతీయుల పక్షాన ఆహ్వానిస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం మధ్య ప్రదేశ్ గడ్డ మీద జరుగుతోంది, మధ్య ప్రదేశ్ భారతదేశాని కి హృదయ స్థానం గా ప్రసిద్ధి చెందింది, అంతేకాదు ఆధ్యాత్మిక వాదం, ఆదివాసి సంస్కృతి, పచ్చదనం, ఇంకా నర్మద తాలూకు పవిత్ర జలాల కు ఖ్యాతి ని గాంచిన నేల కూడాను అని ఆయన వివరించారు. ఇటీవలే దేశ ప్రజల కు అంకితం చేసిన మహా కాళ్ మహా లోక్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, ఈ పవిత్ర ప్రదేశాన్ని సమ్మేళనాని కి విచ్చేసిన ప్రముఖులు మరియు ప్రతినిధులు సందర్శిస్తారని తాను ఆశపడుతున్నాననన్నారు. ఆతిథేయి నగరం అయిన ఇందౌర్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ఇందౌర్ అనేది ఒక నగరం తో పాటు గా ఒక దశ కూడా. అది ఎటువంటి దశ అంటే ఈ నగరం తన వారసత్వాన్ని పరిరక్షించుకొంటూనే కాలాని కంటే ముందు గా సాగిపోతున్నటువంటి దశ’’ అని ఆయన పేర్కొన్నారు. ఇందౌర్ కు వంట కు సంబంధించి ఉన్నన ఖ్యాతి ని గురించి మరియు స్వచ్ఛత ఉద్యమం లో ఈ నగరం యొక్క కార్యసాధన ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

భారతదేశం తన స్వాతంత్య్రం యొక్క 75 సంవత్సరాల ను ఈ మధ్యే పూర్తి చేసుకొంది కాబట్టి ఈ ప్రవాసి భారతీయ దివస్ అనేక రకాలు గా విశిష్టమైందని ప్రధాన మంత్రి అన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఇతివృత్తం గా డిజిటల్ పిబిడి ఎగ్జిబిశను ను మొట్టమొదటిసారి గా నిర్వహించడం జరుగుతున్నదని ఆయన వెల్లడిస్తూ అది వైభవోపేతమైనటువంటి కాలాన్ని మరొక్క మారు కళ్ళ కు కడుతోంది అన్నారు. రాబోయే 25 సంవత్సరాల కు సంబంధించిన అమృత కాలం యొక్క ప్రస్థానం లో ప్రవాసి భారతీయుల కు ఉన్న సార్థక పాత్ర ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, భారతదేశం యొక్క విశిష్టమైన గ్లోబల్ విజన్ ను మరియు ప్రపంచ వ్యవస్థ లో భారతదేశాని కి ఉన్న పాత్ర ను వారు పటిష్టపరచనున్నారు అని పేర్కొన్నారు.

యావత్తు ప్రపంచాన్ని ఒక వ్యక్తి యొక్క స్వంత దేశం గా భావించేటటువంటి, మరి అదే విధం గా మానవ జాతి ని తన స్వంత సోదరులు మరియు సోదరీమణులు గా తలపోసేటటువంటిది మన భారతీయ దర్శనం అని ప్రధాన మంత్రి వివరిస్తూ, మన పూర్వికులు భారతదేశం యొక్క సాంస్కృతిక విస్తరణ కు పునాదుల ను వేశారు అని చెప్పారు. వర్తమాన ప్రపంచాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతీయులు భూగ్రహం లో అన్ని ప్రాంతాల ను చుట్టివచ్చారు. వారు విభిన్న సంస్కృతుల మరియు సంప్రదాయాల మధ్య మనుగడ సాగిస్తూనే వ్యాపార భాగస్వామ్యాల ద్వారా సమృద్ధి తాలూకు అవకాశాల ను చేజిక్కించుకొన్నారు అని పేర్కొన్నారు. ప్రపంచ చిత్రపటం లో ప్రవాసి భారతీయు ల సంఖ్య ను మనం చూసినప్పుడు, అనేకమైన దృశ్యాలు కానవస్తాయి. అవి ‘వసుధైవ కుటుంబకమ్’ చిత్రం గా రూపుదాల్చుతాయి; అంతేకాదు, ఎవరైనా ఇద్దరు ప్రవాస భారతీయులు ఏ విదేశం లో అయినా కలుసుకొన్నారు అంటే ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన పెల్లుబుకుతుంది అని ఆయన అన్నారు. ప్రపంచం లోని వేరు వేరు ప్రాంతాల లో ప్రవాసుల ను అత్యంత ప్రజాస్వామికమైనటువంటి, శాంతి కాముకులు అయినటువంటి మరియు క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులు అని చెప్పుకొంటూ ఉంటే అప్పుడు ప్రజాస్వామ్యాని కి తల్లి వంటి దేశాని కి చెందిన వారం అనే భావన బహువిధాలు గా కలుగుతుంటుంది అని ఆయన అన్నారు. ప్రవాసి భారతీయుల లో ప్రతి ఒక్కరు భారతదేశాని కి చెందిన జాతీయ దూత లు అని తాను అంటానని ప్రధాన మంత్రి అన్నారు. ఇలా ఎందుకు అంటే వారి తోడ్పాటు ను ప్రపంచం గణించే సంద్భాల లో వారు ఒక శక్తివంతమైన మరియు సమర్ధత కలిగిన భారతదేశం యొక్క వాణి ని మారుమోగింప చేస్తున్నట్లే అవుతుంది అని ఆయన వివరించారు. ‘‘మీరు భారతదేశం యొక్క, ‘మేక్ ఇన్ ఇండియా’ యొక్క, యోగ యొక్క, ఆయుర్వేద యొక్క, భారతదేశ కుటీర పరిశ్రమలు మరియు హస్తకళ ల యొక్క జాతీయ దూత లు గా ఉన్నారు’’ అని ఆయన చెప్పసాగారు. ‘‘అదే కాలం లో మీరు భారతదేశం యొక్క చిరుధాన్యాల కు సైతం బ్రాండ్ అంబాసడర్ లు’’ అని ఆయన అన్నారు. 2023వ సంవత్సరాన్ని ‘చిరుధాన్యాల యొక్క అంతర్జాతీయ సంవత్సరం’ గా ప్రకటించిన సంగతి ని ఆయన ప్రస్తావించి, ప్రతి ఒక్కరు వెనుదిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని చిరుధాన్యాల ఉత్పత్తుల ను వారి వెంట తీసుకు పోవాలంటూ విజ్ఞప్తి చేశారు.

భారతదేశాన్ని గురించి మరింత గా తెలుసుకోవాలి అని ప్రపంచ దేశాల లో ఉన్న అభిలాష ను నెరవేర్చడం లో ప్రవాస భారతీయులు ముఖ్య పాత్ర ను పోషించవలసి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తి తో భారతదేశానికేసి చూస్తున్నాయి అని ఆయన అన్నారు. ఇటీవల కొన్నేళ్ళు గా దేశం అసాధారణమైనటువంటి కార్యసాధనల ను సొంతం చేసుకొంది అని ఆయన చెప్పారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మేక్ ఇన్ ఇండియా వేక్సీన్ ను గురించి మరియు రెకార్డు సంఖ్య లో 220 కోట్ల కు పైగా ఉచిత డోజుల ను భారతీయు లకు అందజేయడాన్ని గురించి ఉదాహరించారు. ప్రస్తుతం అస్థిరత కొనసాగుతున్న వేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాలూకు ముఖచిత్రం లో భారతదేశం ప్రముఖ స్థానాన్ని దక్కించుకోవడాన్ని గురించి కూడా ఆయన తన ప్రసంగం లో ప్రస్తావించారు. భారతదేశం ప్రపంచం లో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా రూపొందింది అని ఆయన అన్నారు. ఆయన ఇంకా కొన్ని ఉదాహరణల ను ఇస్తూ, భారతదేశం లో స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ ప్రవర్థమానం అవుతోందని, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం లో మేక్ ఇన్ ఇండియా తనదైన గుర్తింపు ను తెచ్చుకొంటోందన్నారు. తేజస్ పోరాట విమానాలు, యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు పరమాణు జలాంతర్గామి అరిహంత్ లను గురించి ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యం లో భారతదేశం గురించి ప్రపంచ ప్రజల లో కుతూహలం ఏర్పడడం స్వాభావికమే అని ఆయన అన్నారు. భారతదేశం లో నగదు చలామణి తక్కువ గా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ను గురించి, ఫిన్ టెక్ ను గురించి కూడా ప్రధాన మంత్రి చెప్తూ, ప్రపంచం లో వాస్తవ కాల ప్రాతిపదిక న చోటు చేసుకొంటున్నటువంటి డిజిటల్ ట్రాన్సాక్శన్స్ లో 40 శాతం లావాదేవీ లు భారతదేశం లోనే జరుగుతున్నాయి అని వివరించారు. అంతరిక్ష సాంకేతిక విజ్ఞానాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వందల కొద్దీ మానవ నిర్మిత ఉపగ్రహాల ను ఏక కాలం లో అంతరిక్షం లోకి ప్రవేశపెట్టినటువంటి అనేక రికార్డు లను భారతదేశం నెలకొల్పుతోంది అన్నారు. భారతదేశం లో సాఫ్ట్ వేర్ మరియు డిజిటల్ టెక్నాలజీ పరిశ్రమల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ కాలం తో పాటే భారతదేశం యొక్క సామర్థ్యం వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ‘‘భారతదేశం ఇస్తున్నటువంటి సందేశాని కి ఒక విశిష్టమైనటువంటి ప్రాముఖ్యం ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం యొక్క బలం భవిష్యత్తు లో ఒక పెద్ద ఉత్తేజాన్ని అందుకోనుంది అని ఆయన పేర్కొన్నారు. భారతదేశం యొక్క సంస్కృతి , సంప్రదాయాల ను గురించినటువంటి జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవడం ఒక్కటే కాకుండా దేశం సాధిస్తున్న ప్రగతి ని గురించి సైతం అవగాహన ను ఏర్పరచుకోండి అంటూ ప్రధాన మంత్రి సమ్మేళనం లో పాలుపంచుకొన్న ప్రతి ఒక్కరి కి విజ్ఞప్తి ని చేశారు.

జి-20 అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం ఈ సంవత్సరం లో చేపడుతున్న సంగతి ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ఈ యొక్క బాధ్యత ఒక స్థిరమైన భవిష్యత్తు ను చేజిక్కించుకోవడాని కి, అదే విధం గా తత్సంబంధిత అనుభవాల నుండి నేర్చుకోవడానికి భారతదేశం తాలూకు గత అనుభవాల ను ప్రపంచం తెలుసుకొనేటట్లు చూడడాని కి అందివచ్చిన ఒక గొప్ప అవకాశం అని కూడా ఆయన అన్నారు. ‘‘జి-20 అనేది దౌత్యపరమైన కార్యక్రమం ఒక్కటే కాదు. దాని ని సార్వత్రిక భాగస్వామ్యం తో కూడిన ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం గా తీర్చిదిద్దుకోవాలి. ఈ క్రమం లో ఎవరైనా సరే ‘‘అతిథి దేవో భవ’’ అనేటటువంటి భావన ను గురించి కూడా ను అనుభూతి ని పొందవచ్చును’’ అని ప్రధాన మంత్రి అన్నారు. జి-20 శిఖర సమ్మేళనం లో భాగం గా 200కు పైగా సమావేశాలు భారతదేశం లోని వేరు వేరు నగరాల లో జరుగనున్నాయి. మరి ఇది అనేక దేశాల ప్రతినిధుల తో అర్థవంతమైనటువంటి సంబంధాల ను ఏర్పరచుకోవడం కోసం దక్కే ఒక గొప్ప అవకాశం కాగలదు అని ఆయన తెలిపారు.

ప్రస్తుతం భారతదేశాని కి జ్ఞాన కేంద్రం గా మారేటటువంటి అవకాశం ఒక్కటే లభించడం అనేది కాకుండా ప్రపంచం లో నైపుణ్య రాజధాని గా కూడా మారేచేటటువంటి అవకాశం లభించింది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లోని యువత లో గల నైపుణ్యం, విలువ లు మరియు శ్రమ సంబంధి నీతి నియమాల ను గురించి ఆయన నొక్కిచెప్పారు. ‘‘నైపుణ్య రాజధాని అనేది ప్రపంచ వృద్ధి కి చోదక శక్తి గా ఆవిర్భవించగలదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. తదుపరి తరాని కి చెందిన ప్రవాసి భారతీయ యువత లోని అభినివేశాన్ని గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు. యువత కు వారి దేశాన్ని గురించి చెప్పండి, దేశాన్ని సందర్శించడాని కి వారి కి అవకాశాల ను కూడా కల్పించండి అంటూ సభికుల ను ఆయన కోరారు. ‘‘సాంప్రదాయిక అవగాహన తోను, ఆధునికమైన దృక్పథం తోను ఈ యువ ప్రవాసి లు ప్రపంచాని కి భారతదేశాన్ని గురించి మరింత ప్రభావశీలమైన రీతి లో తెలియ జేయగలుగుతారు. యువత లో భారతదేశాన్ని గురించి న జిజ్ఞాస అధికం అవుతున్న కొద్దీ భారతదేశం యొక్క పర్యటన, పరిశోధన రంగాలు మరియు భారతదేశం యొక్క కీర్తి ఇంతలంతలు అవుతాయి’’ అని ఆయన అన్నారు. అటువంటి యువత పండుగల సందర్భాల లో భారతదేశాన్ని సందర్శించడమో లేదా ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్’ తో ముడిపడిన కార్యక్రమాల తో అనుబంధాన్ని ఏర్పరచుకోవడమో చేయవచ్చు అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రవాసీ భారతీయులు వారు ఉంటున్న దేశాల లో అందజేస్తున్న తోడ్పాటు, వారి యొక్క సంఘర్షణ మరియు వారి జీవితాల ను గురించి విశ్వవిద్యాలయాల ద్వారాను, పరిశోధన సంస్థల ద్వారాను స్థిర ప్రాతిపదికన ప్రయాస జరుగుతూ ఉండాలి అని ప్రధాన మంత్రి సూచన చేశారు. ప్రతి ఒక్క భారత వంశీకుడు/భారత వంశీకురాలు వారితో పాటు గా యావత్తు భారతదేశాన్ని వారి భుజస్కందాల పై మోస్తూ ఉంటారు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘గడచిన 8 సంవత్సరాల లో భారతదేశం తన ప్రవాసి సముదాయాన్ని బలపరచడం కోసం ప్రయత్నాల ను చేసింది. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ను దేశం మీ యొక్క ప్రయోజనాల ను గురించి మరియు మీ యొక్క ఆశల ను గురించి పట్టించుకోవడానికి దేశం కట్టుబడి ఉంది అనేదే వర్తమానం లో భారతదేశం యొక్క వచనబద్ధత గా ఉంది’’ అని ఆయన అన్నారు.

ప్ర‌త్యేక అతిధులు గయానా సహకార రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ, సూరినామ్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ చంద్రికాపర్సాద్ సంతోఖి ల వ్యాఖ్యలు, సూచనలకు ప్ర‌ధానమంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన వారిలో - గయానా సహకార రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ, సూరినామ్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ చంద్రికా పర్సాద్ సంతోఖి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, కేంద్ర సహాయ మంత్రులు శ్రీమతి మీనాక్షి లేఖి, శ్రీ వి మురళీధరన్, డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ మొదలైన వారు ఉన్నారు.

నేపథ్యం

ప్రవాసీ భారతీయ దివస్ (పి.బి.డి) సమ్మేళనం అనేది భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం, విదేశాల్లో ఉన్న భారతీయులను కలవడానికి, వారితో అనుసంధానం కావడంతో పాటు, ప్రవాస భారతీయులు ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించుకోడానికి, ఇది ఒక ముఖ్యమైన వేదికను అందిస్తుంది. 17వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో 2023 జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఇండోర్‌ లో నిర్వహించడం జరుగుతోంది. "ప్రవాస భారతీయులు : అమృత్ కాల్‌ లో భారతదేశ పురోగతికి విశ్వసనీయ భాగస్వాములు" అనే ఇతివృత్తంతో ఈ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనం జరుగుతోంది. దాదాపు 70 దేశాల నుంచి సుమారు 3,500 మందికి పైగా ప్రవాస భారతీయులు, ఈ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనం కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

సురక్షితమైన, చట్టబద్ధమైన, క్రమబద్ధమైన, నైపుణ్యం కలిగిన వలసల ప్రాముఖ్యతను నొక్కిచెప్పేందుకు ‘సురక్షిత్ జాయేన్, ప్రశిక్షిత్ జాయేన్’ అనే స్మారక తపాలా బిళ్ళ ను కూడా ఈ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. భారతదేశ స్వాతంత్య్రం లో మన ప్రవాస స్వాతంత్య్ర సమరయోధుల సహకారాన్ని ప్రత్యేకంగా తెలియజెప్పే విధంగా "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్ – భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రవాస భారతీయుల సహకారం" అనే అంశంపై మొట్టమొదటి డిజిటల్ ప్రవాసీ భారతీయ దివస్ ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.

ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనం లో ఐదు ముఖ్యమైన విషయాలపై ప్లీనరీ సదస్సులు ఏర్పాటు చేశారు -

* యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షతన 'ఆవిష్కరణలు, నూతన సాంకేతికతల్లో ప్రవాస భారతీయ యువత పాత్ర' పై మొదటి ప్లీనరీ.

* '"అమృత్ కాల్ సమయంలో భారతీయ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడంలో భారతీయ డయాస్పోరా పాత్ర : విజన్ @ 2047" అనే ఇతివృత్తం పై రెండవ ప్లీనరీ ఏర్పాటయింది. దీనికి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్‌ కుమార్ రంజన్ సింగ్ సహ-అధ్యక్షత వహించారు.

* విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి అధ్యక్షతన 'భారతదేశ మృదువైన శక్తిని ఉపయోగించుకోవడం - క్రాఫ్ట్, వంటకాలు, సృజనాత్మకత ద్వారా సద్భావన' అనే ఇతివృత్తం పై మూడవ ప్లీనరీ ఏర్పాటు చేయడం జరిగింది.

* 'ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భారత శ్రామిక శక్తి - ప్రవాస భారతీయుల పాత్ర' అనే ఇతివృత్తంతో, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన నాల్గవ ప్లీనరీ ఏర్పాటు చేయడం జరిగింది.

* 'దేశ నిర్మాణంలో సమగ్ర విధానం దిశగా ప్రవాస పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని వినియోగించుకోవడం' అనే ఇతివృత్తంతో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఐదవ ప్లీనరీ ఏర్పాటు చేయడం జరిగింది.

* అన్ని ప్లీనరీ సదస్సుల్లోనూ ప్రముఖ ప్రవాస భారతీయ నిపుణులను ఆహ్వానించి, ప్యానెల్ చర్చలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

17వ ప్రవాసీ భారతీయ దివస్ ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఇది నాలుగు సంవత్సరాల విరామం తర్వాత, అదేవిధంగా, కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత భౌతికంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇంతకు ముందు 2021 లో మహమ్మారి సమయంలో నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనం దృశ్య మాధ్యమం ద్వారా జరిగింది.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Insurance industry's premium growth tops 20% for the first time in FY26

Media Coverage

Insurance industry's premium growth tops 20% for the first time in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles demise of Baba Adhav Ji
December 09, 2025

The Prime Minister, Shri Narendra Modi, condoled the passing away of Baba Adhav Ji today.

The Prime Minister said Baba Adhav Ji will be remembered for his efforts to serve society through various causes, notably empowering the marginalised and furthering labour welfare.

In a post on X, Shri Modi wrote:

“Baba Adhav Ji will be remembered for his efforts to serve society through various causes, notably empowering the marginalised and furthering labour welfare. Pained by his passing away. My thoughts are with his family and admirers. Om Shanti.” 

“विविध सामाजिक कामांसाठी आयुष्य वाहून घेत समाजसेवा करणारे, विशेषतः वंचितांचे सबलीकरण आणि कामगार कल्याणासाठी लढणारे बाबा आढावजी, त्यांच्या या कार्यासाठी सदैव स्मरणात राहतील. त्यांच्या निधनाने अतिशय दुःख झाले आहे. त्यांचे कुटुंब आणि प्रशंसकांप्रति माझ्या संवेदना. ॐ शांती.”