భారతీయ యువత స్ఫూర్తిని, అంకితభావం కనబరుస్తోందని, ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ వేదిక ద్వారా దేశ యువతతో ముచ్చటించేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చెప్పారు.
దృఢమైన, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించడంలో కీలక శక్తి భారతీయ యువతేనని, వారి అసమానమైన సామర్థ్యం, నిబద్ధత ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువత, తమ ఆలోచనలను, ఆకాంక్షలను పంచుకునే వేదికగా ఈ చర్చా కార్యక్రమం నిలుస్తుందన్నారు. అలాగే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడుతుందని తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మన్షుఖ్ మాండవీయ రాసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:
"అద్భుతమైన ఉత్సాహం, సాటిలేని పట్టుదలతో కూడిన మన యువతరం శక్తివంతమైన, సుసంపన్నమైన దేశ నిర్మాణానికి నడుం బిగించింది. ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ వేదికపై యువ మిత్రులతో ముచ్చటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 12న మీ అందరినీ కలుస్తాను."
अद्भुत जोश और बेमिसाल जज्बे से भरी हमारी युवा शक्ति सशक्त और समृद्ध राष्ट्र के लिए संकल्पबद्ध है। विकसित भारत यंग लीडर्स डायलॉग में देशभर के अपने युवा साथियों से संवाद को लेकर बेहद उत्सुक हूं। इस कार्यक्रम में 12 जनवरी को आप सभी से मिलने वाला हूं। https://t.co/IMMvpi05Mb
— Narendra Modi (@narendramodi) January 10, 2026


