ఈ రోజు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృత్రిమ మేధ యుగంలో యాక్సెసిబిలిటీ, సమ్మిళితత్వం పట్ల భారత్ అచంచలమైన నిబద్ధతను స్పష్టం చేశారు.
ఏఐ సాంకేతికత ద్వారా సంజ్ఞా భాషలో రియల్-టైమ్ అనువాదం ప్రారంభమైంది. దీని ద్వారా దివ్యాంగులు ఈ కార్యకలాపాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనగలరు. విభజలను అనుసంధానించే, పౌరులందరినీ శక్తిమంతం చేసే ఆవిష్కరణలకు భారత్ మద్దతునిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా నా ప్రసంగంలో ఏఐని ఉపయోగించి సంకేత భాషలో రియల్-టైమ్ అనువాదం గురించి నేను ప్రస్తావించాను. ఇది ఏఐ రంగంలో యాక్సెసిబిలిటీ, సమ్మిళితత్వాల పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. సాంకేతికతను, ప్రజల మధ్య అభిప్రాయాల బదిలీని దివ్యాంగులకూ అందుబాటులో ఉంచేందుకు సదా మేం కృషి చేస్తాం."
My speech at the AI Impact Summit included real-time translation in sign language using AI. It reflects our commitment to accessibility and inclusion when it comes to AI. We will always work to ensure that technology and public discourse are accessible to persons with…
— Narendra Modi (@narendramodi) February 19, 2026


