సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ -
‘‘ఇది నిజంగా ఓ చరిత్రాత్మక ఒప్పందం.. మరీ ముఖ్యంగా నాగాలాండ్‌లోని తూర్పు ప్రాంత అభివృద్ధి ప్రక్రియను ఇది వేగవంతం చేస్తుంది. ప్రజలకు కొత్త అవకాశాలను అందించడంతో పాటు వారి సమృద్ధికి కూడా ఈ ఒప్పందం తోడ్పడుతుందని నేను మనసారా నమ్ముతున్నాను. దేశ ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో శాంతినీ, ప్రగతినీ సాధించడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకూ అందించాలన్న మా తిరుగులేని నిబద్ధతకు ఈ ఒప్పందం అద్దం పడుతోంది’’ అని పేర్కొన్నారు.
Today a historic agreement was signed between Govt of India, Govt of Nagaland and ENPO resolving decades-long pending issues of Eastern Nagaland. It is a giant step towards realising Modi Ji's vision for a peaceful and prosperous Northeast by resolving all contentious issues. pic.twitter.com/sxt23lBX1n
— Amit Shah (@AmitShah) February 5, 2026


