‘ప్రాజెక్ట్ లయన్’లో భాగంగా చేపడుతున్న ప్రయత్నాల పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాలు గుజరాత్‌లో సింహాలకు అనుకూల పరిసరాలను సమకూర్చడంతో పాటు వాటి సంరక్షణకు కూడా పూచీపడుతున్నాయి.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ:
‘‘చాలా ఉత్సాహాన్నిచ్చే సమాచారమిది. ‘ప్రాజెక్ట్ లయన్’లో భాగంగా చేపడుతున్న ప్రయత్నాలతో, గుజరాత్‌లో సింహాలకు అనుకూలమైన వాతావరణం నెలకొనడంతోపాటు వాటి సంరక్షణకు అన్ని జాగ్రత్తచర్యలను తీసుకొంటుండడాన్ని చూస్తే ఎంతో సంతోషం కలుగుతోంది’’ అని పేర్కొన్నారు.
बहुत उत्साहित करने वाली जानकारी! यह देखकर बेहद खुशी हो रही है कि ‘प्रोजेक्ट लॉयन’ के तहत किए जा रहे प्रयासों से गुजरात में शेरों को अनुकूल माहौल मिलने के साथ ही उनका संरक्षण भी सुनिश्चित हो रहा है। https://t.co/YFUVBKVtF3
— Narendra Modi (@narendramodi) May 21, 2025


