భారతదేశ ఆర్ధిక నిర్మాణాన్ని, అంతర్జాతీయ స్థితిని మార్చిన సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలపై గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా వెల్లడించారు. పెట్టుబడులకు ఊతమిచ్చిన కార్పొరేట్ పన్ను తగ్గింపుల నుంచి, దేశీయ మార్కెట్ ను ఏకీకృతం చేసిన జీఎస్టీ అమలు వరకు, అలాగే జీవన సౌలభ్యం పెంచిన వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు వరకు సంస్కరణల పథం నిరంతరం ప్రజాప్రయోజనాల ఆధారితంగా కొనసాగుతోంది.
పన్ను విధానాలను సులభతరం చేయడం, రేట్లను సరళీకరించడం, వ్యవస్థను మరింత సమానత్వంగా, వృద్ధి ఆధారితంగా మార్చడం ద్వారా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తాజా జీఎస్టీ సంస్కరణల దశను ఆయన ప్రశంసించారు. ఈ చర్యలకు తోడుగా, భారతదేశ దృఢమైన ఆర్ధిక క్రమశిక్షణ అంతర్జాతీయ స్థాయిలో విశ్వాసాన్ని పెంచుకుని ప్రభుత్వ క్రెడిట్ రేటింగ్స్ మెరుగుపడటానికి దారి తీసింది.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో శ్రీ విజయ్ చేసిన ఒక పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ, “గత దశాబ్దం భారతదేశ ఆర్థిక దృశ్యాన్ని మార్చే సాహసోపేతమైన సంస్కరణలకు, పెట్టుబడిని ప్రేరేపించిన కార్పొరేట్ పన్ను తగ్గింపుల నుంచి ఏకీకృత మార్కెట్ ను సృష్టించిన జీఎస్టీ, జీవన సౌలభ్యాన్ని పెంపొందించిన వ్యక్తిగత ఆదాయ పన్ను సంస్కరణలకు సంబంధించినది. కొత్త జీఎస్టీ సంస్కరణలు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, వ్యవస్థను మరింత సులభంగా, సక్రమంగా, వృద్ధి ఆధారితంగా మారుస్తాయి. వీటికి తోడు మన ఆర్ధిక క్రమశిక్షణ ప్రపంచవ్యాప్తంగా విశ్వాసాన్ని, మెరుగైన క్రెడిట్ రేటింగ్స్‌ను కూడా సాధించింది. ఈ ప్రయత్నాల ద్వారా మనం వికసిత్ భారత్ కోసం ఒక బలమైన పునాదిని వేస్తున్నాం” అని పేర్కొన్నారు.
We are lucky to have witnessed Finance history in last 5-10 yrs - Corp Tax reduction, GST intro and #NextGenGSTReforms along with Personal Income Tax Changes and moving to New Tax Regime and higher exemption slabs , Rating improvements by keeping Fiscal deficit in control pic.twitter.com/iFaLRJZTvH
— Vijay (@centerofright) September 3, 2025


