భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) రెండు దేశాల భాగస్వామ్యంలో ఒక చారిత్రక ఘట్టమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వ్యాఖ్యానించారు.

ఉభయ దేశాల అభివృద్ధి భాగస్వామ్యానికి ఈ ఒప్పందం అనూహ్య ఉత్తేజమిస్తుందని, పరస్పర ప్రగాఢ విశ్వాసం, ఉమ్మడి విలువలు, ఆశయాలను ఇది ప్రతిబింబిస్తున్నదని ఆయన అన్నారు.

ఈ FTA వల్ల రైతులు, యువత, మహిళలు, ఎంఎస్ఎంఈలు, చేతివృత్తులవారు, స్టార్టప్‌లు, విద్యార్థులు మరియు ఆవిష్కర్తలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇది వృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుందని, అవకాశాలను సృష్టిస్తుందని మరియు వివిధ రంగాలలో సమన్వయాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు.

భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి హామీపై న్యూజిలాండ్ నిబద్ధత వ్యవసాయం, తయారీ, ఆవిష్కరణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తుందని పేర్నొన్నారు. తద్వారా రెండు దేశాల సుసంపన్న, చైతన్యవంతమైన భవిష్యత్తుకు మార్గం సుగమం కాగలదని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“భారత్-న్యూజిలాండ్ భాగస్వామ్యంలో ఇవాళ ఒక చారిత్రత్మక ఘట్టం ఆవిష్కృతమైంది!

ఈ రోజు సంతకాలు పూర్తయిన భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) మన అభివృద్ధి భాగస్వామ్యానికి అద్భుత్ వేగం ఇస్తుందని విశ్వాసం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఇది మన రెండు దేశాలను ఒకటిగా నిలిపే ప్రగాఢ విశ్వాసం, ఉమ్మడి విలువలు, ఆశయాలకు ప్రతిబింబం.

మన రైతులు, యువత, మహిళలు, ‘ఎంఎస్ఎంఈ’లు, చేతివృత్తులవారు, అంకుర సంస్థలు, విద్యార్థులు, ఆవిష్కర్తలకు ఈ ఒప్పందంతో ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. ఇది ప్రగతికి సరికొత్త బాటలు వేయడంతోపాటు వినూత్న అవకాశాలను సృష్టిస్తుంది. అన్ని రంగాల్లో ద్వైపాక్షికంగా సమన్వయాన్ని మరింత బలపరుస్తుంది...

భారత్‌లో 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిపై న్యూజిలాండ్ కట్టుబాటు వల్ల వ్యవసాయం, తయారీ, ఆవిష్కరణ, సాంకేతికత రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత విస్తృతం అవుతుంది. దీనివల్ల రెండు దేశాల సుసంపన్న, చైతన్యవంతమైన భవిష్యత్తుకు మార్గం సుగమమవుతుంది”

 

 

@chrisluxonmp” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం కూడా ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“విస్తృత ప్రపంచ సంబంధాలు, ఉమ్మడి శ్రేయస్సు దిశగా భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కీలక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక సందేశంలో తెలిపారు” అని పేర్కొంది.

రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుంది. భారత్‌లో రైతులు, చేతివృత్తులవారు, యువత, పారిశ్రామికవేత్తలు, మహిళల సహా ‘ఎంఎస్ఎంఈ’లకూ సదవకాశాలు కల్పిస్తుంది.”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
IndiaAI Mission-backed startup Avataar launches indigenous video AI model

Media Coverage

IndiaAI Mission-backed startup Avataar launches indigenous video AI model
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 జూన్ 2026
June 13, 2026

Viksit Bharat Accelerating: Tech, Defense, Infra & Exports Power India's Global Leap Under the Leadership of PM Modi