అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సంప్రదాయం, ప్రకృతి మధ్య సామరస్యానికి అరుణాచల్ ప్రదేశ్ గొప్ప ఉదాహరణ అని పీఎం కొనియాడారు. స్ఫూర్తిమంతమైన, శ్రమించే తత్వం ఉన్న ఈ రాష్ట్ర ప్రజలు దేశ పురోగతిని బలోపేతం చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, అసాధారణ సాంస్కృతిక వైవిధ్యం అరుణాచల్ ప్రదేశ్ సొంతం. సంప్రదాయానికి, ప్రకృతికి మధ్య సామరస్యానికి ఈ రాష్ట్రం గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. దేశ పురోగతిని బలోపేతం చేయడంలో స్ఫూర్తిమంతమైన, శ్రమించే తత్వం ఉన్న ఈ రాష్ట్ర ప్రజలు కీలకపాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో వైవిధ్యమైన రాష్ట్ర గిరిజన సంస్కృతులు దేశానికి అపారమైన సుసంపన్నతను జోడిస్తున్నాయి.
భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధిలో నూతన శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను”.
Warm wishes to the people of Arunachal Pradesh on the occasion of their Statehood Day.
— Narendra Modi (@narendramodi) February 20, 2026
Blessed with majestic landscapes and an extraordinary cultural diversity, Arunachal Pradesh stands as a shining example of harmony between tradition and nature. Its spirited and industrious…


