పవిత్ర గీతా జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణపై అమూల్యమైన సందేశాలతో రూపొందించిన ఈ దివ్య గ్రంథం.. భారతీయ కుటుంబ, సామాజిక, ఆధ్యాత్మిక జీవితాల్లో అత్యంత విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘‘భగవదగీత దివ్య శ్లోకాలు నిస్వార్థ చర్య వైపు ప్రతి తరాన్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో మోదీ ఇలా పేర్కొన్నారు.
‘‘శ్రీమద్ భగవద్గీత ఆవిర్భావ దినోత్సవమైన ‘‘గీతా జయంతి’’ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. విధి నిర్వహణకు సంబంధించిన విలువైన సందేశాలతో అలంకరించిన ఈ దివ్య గ్రంథం భారతీయ కుటుంబ, సామాజిక, ఆధ్యాత్మిక జీవితాల్లో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇందులోని దివ్య శ్లోకాలు ప్రతి తరాన్ని నిస్వార్థ సేవకు ప్రేరేపిస్తూనే ఉంటాయి. జై శ్రీ కృష్ణ!’’
देशभर के मेरे परिवारजनों को श्रीमद्भगवद्गीता के अवतरण से जुड़े पावन दिवस ‘गीता जयंती’ की ढेर सारी शुभकामनाएं। कर्तव्य-पालन के अनमोल संदेशों से सुशोभित इस दिव्य ग्रंथ का भारतीय पारिवारिक, सामाजिक और आध्यात्मिक जीवन में अत्यंत विशिष्ट स्थान रहा है। इसके दिव्य श्लोक हर पीढ़ी को… pic.twitter.com/2ojqdCZLDK
— Narendra Modi (@narendramodi) December 1, 2025


