బీహార్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ సుసంపన్న వారసత్వాన్ని,
దేశ చరిత్రలో రాష్ట్రానికిగల ఉన్నత స్థానాన్ని, రాష్ట్ర ప్రగతికి
తోడ్పాటులో అక్కడి ప్రజల నిర్విరామ స్ఫూర్తిని ఈ సందర్భంగా ఆయన
ప్రశంసించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“బీహార్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఎందరో మహనీయులు, వీరులకు
జన్మనిచ్చిన ఈ పవిత్ర భూమి నివాసులైన సోదరసోదరీమణులకు నా హృదయపూర్వక
శుభాకాంక్షలు. భారతదేశ చరిత్రకు గర్వకారణమైన బీహార్ రాష్ట్రం నేడు
పురోగమన పథంలో కీలక ప్రయాణం సాగిస్తోంది. అందువల్ల కష్టజీవులు,
ప్రతిభావంతులైన ప్రజలు ఇందులో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. ఈ సమయంలో
మన సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుగొమ్మ వంటి ఈ రాష్ట్ర
సర్వతోముఖాభివృద్ధికి ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ శాయశక్తులా
కృషిచేద్దాం” అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
वीरों और महान विभूतियों की पावन धरती बिहार के अपने सभी भाई-बहनों को बिहार दिवस की ढेरों शुभकामनाएं। भारतीय इतिहास को गौरवान्वित करने वाला हमारा यह प्रदेश आज अपनी विकास यात्रा के जिस महत्वपूर्ण दौर से गुजर रहा है, उसमें यहां के परिश्रमी और प्रतिभाशाली बिहारवासियों की अहम भागीदारी…
— Narendra Modi (@narendramodi) March 22, 2025


