దేశ ప్రగతి, దేశ శ్రేయస్సు కోసం సామూహిక శక్తితో పాటు సంకల్పం ముఖ్యమని స్పష్టం చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా పంచుకున్నారు:

‘‘స్వస్తి పన్థామనుచరేమ సూర్యాచన్ద్రమసావివ

పునర్దదాతాఘ్నతా జానతా సంగమేమహి’’.

భారత ప్రజల అపరిమిత శక్తే దేశాభివృద్ధికి మూలమని ప్రధాని అన్నారు. మన సామర్థ్యాలు, మన పరస్పర విశ్వాసాలను ఊతంగా తీసుకొని ప్రతి ఒక్క సంకల్పాన్నీ నెరవేర్చాం.. భవిష్యత్తులోనూ ఇలాగే నెరవేరుస్తూ ఉంటామని ఆయన అన్నారు.

సూర్య, చంద్రుల మాదిరిగా మనం కూడా శుభ మార్గంలో నిరంతరం ముందుకు సాగుతూ ఉండాలి. రండి, పరస్పర సద్భావన, అహింస, జ్ఞానం.. వీటిని తోడుగా తీసుకొని, ముందుకు సాగుదాం. ప్రగతినీ, శ్రేయస్సునీ సాధించే దిశగా పయనించడంలో ఒకరికి మరొకరం సహకరించుకుందామనే సందేశాన్ని ఈ సుభాషితం అందిస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘ భారత ప్రజల అపరిమిత శక్తే దేశాభివృద్ధికి కీలకం. మన సామర్థ్యంతో, పరస్పర విశ్వాసంతో ప్రతి సంకల్పాన్నీ సాకారం చేసుకుంటూ వచ్చాం.. ఇక ముందు కూడా ఇలాగే చేస్తూ ఉందాం.

‘‘స్వస్తి పన్థామనుచరేమ సూర్యాచన్ద్రమసావివ

పునర్దదాతాఘ్నతా జానతా సంగమేమహి’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India poised to be global hub for small satellites, in-orbit manufacturing

Media Coverage

India poised to be global hub for small satellites, in-orbit manufacturing
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 సెప్టెంబర్ 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi