అయోధ్యలో దివ్యమైన రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ రామ భక్తులందరినీ భక్తి, ఆనందాలతో నింపుతుందని ప్రధాని పేర్కొన్నారు.
మర్యాద పురుషోత్తముడు భగవంతుడు శ్రీరాముడు దేశ ప్రజలందరిని ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యంతో దీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
“ శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య మరో అద్భుతమైన, చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. ఈ మహత్తరమైన, దివ్యమైన రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ చేసిన పవిత్ర సందర్భం రామభక్తులందరినీ భక్తితో, ఆనందంతో నింపుతుంది. మర్యాద పురుషోత్తముడు భగవంతుడు శ్రీ రాముడు దేశప్రజలందరికీ సుఖ సంతోషాలు, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
జై శ్రీరాం”
प्रभु श्री राम की जन्मस्थली अयोध्या एक और गौरवशाली और ऐतिहासिक क्षण का साक्षी बनी है। भव्य-दिव्य राम दरबार की प्राण-प्रतिष्ठा का ये पावन अवसर समस्त रामभक्तों को श्रद्धा और आनंद से भावविभोर करने वाला है। मेरी कामना है कि मर्यादा पुरुषोत्तम भगवान श्री राम सभी देशवासियों को… https://t.co/sbZ4HrJm20
— Narendra Modi (@narendramodi) June 5, 2025


