ఈ సందర్భంగా ఒక సంస్కృత సుభాషితాన్ని, దేవీ స్తోత్రాన్ని పంచుకున్న ప్రధాని

నవరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని.. 'వికసిత భారత్' సంకల్పం నెరవేరాలని ఆయన ప్రార్థించారు.

నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు. ఇది శైలపుత్రి దేవి దివ్యమైన, దయాపూర్వకమైన అనుగ్రహాన్ని చాటిచెబుతోంది. ఈ సందర్భంగా అమ్మవారికి అంకితం చేసిన ఒక భక్తి స్తోత్రాన్ని కూడా ప్రధాని పంచుకున్నారు. అమ్మవారి అపార కృపతో ప్రజలందరికీ శుభం చేకూరుతుందని.. తద్వారా అభివృద్ధి చెందిన భారత్ అనే మన ఉమ్మడి లక్ష్యానికి గొప్ప బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులలో ఈ విధంగా పేర్కొన్నారు:

"దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు. శక్తిని ఆరాధించే ఈ దివ్యమైన పర్వదినం మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను, సౌభాగ్యాన్ని, సమృద్ధిని, ఉత్తమ ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. శక్తిస్వరూపిణి అయిన దుర్గామాత అపార కృపతో అందరికీ శుభం కలగాలని.. తద్వారా 'వికసిత భారత్' అనే మన సంకల్పానికి సరికొత్త శక్తి లభించాలని ప్రార్థిస్తున్నాను. జై అంబే జగదంబే మా!"

"నవరాత్రి మొదటి రోజున దుర్గామాత ప్రథమ స్వరూపమైన 'శైలపుత్రి' దేవిని పూజించడం ఆనవాయితీ. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సంయమనం, శాంతి, సానుకూల శక్తి వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాను.

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ |
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ||"

"భక్తుల కోర్కెలను తీర్చేవారూ, నొసట నెలవంకను ధరించినవారూ, వృషభాన్ని అధిరోహించి చేతిలో త్రిశూలాన్ని ధరించినవారూ.. అత్యంత కీర్తిమూర్తి అయిన శైలపుత్రి దేవికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను."

"జగజ్జనని అయిన దుర్గామాత పాదపద్మాలకు కోట్లమంది దేశప్రజల తరపున నా కోటి కోటి ప్రణామాలు! ఈ పవిత్ర నవరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరికీ అమ్మవారి స్నేహపూర్వక, కరుణాభరితమైన ఆశీస్సులు లభించాలని మనసారా వేడుకుంటున్నాను. జై మాతా దీ!"

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways clears ₹755-crore project to build third line between Champa and Korba

Media Coverage

Indian Railways clears ₹755-crore project to build third line between Champa and Korba
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 జూన్ 2026
June 17, 2026

PM Narendra Modi's Dual Legacy: Commanding Global Respect While Delivering Health Miracles, Rail Revolution & Digital Leadership