హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రపంచ దేశాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందనలు ఎంతో ప్రభావితం చేశాయని, భారత్‌కు సేవ చేయటం, దేశాభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానని  చెప్పారు. ప్రజల విశ్వాసమే తనకు ఎంతో బలమన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, భారతదేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి బోలా అహ్మద్ టినుబుకు ధన్యవాదాలు.

మన మధ్య స్నేహాన్ని, భారత్-నైజీరియా మధ్యనున్న బలమైన భాగస్వామ్యాన్ని నేను గౌరవిస్తాను. ఇరుదేశాల ప్రజల పురోగతి, సంక్షేమానికి, గ్లోబల్ సౌత్ దేశాల ప్రగతికి మనం కలిసికట్టుగా కృషి చేయాలి.

@officialABAT”

 

 

"ఆత్మీయ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం కు ధన్యవాదాలు.

భారత్, మలేషియా మధ్యనున్న బలమైన, శాశ్వతమైన స్నేహాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నా. ఇరుదేశాల ప్రజలు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేయటానికి ఆసక్తితో ఉన్నాను.

@anwaribrahim”

"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు దిసనాయకేకు ధన్యవాదాలు.

 

 

 

శ్రీలంకతో ఉన్న శాశ్వత స్నేహాన్ని భారత్ ఎంతగానో గౌరవిస్తుంది. మన ప్రత్యేకమైన, బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉంది.

@anuradisanayake"

 

 

"అధ్యక్షుడు మొయిజ్జు శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ఇరుదేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను స్పష్టం చేస్తున్నా.

@MMuizzu"

 

 

"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు విలియం రుటోకు ధన్యవాదాలు.

కెన్యాతో ఉన్న చారిత్రక సంబంధాలను, బలమైన భాగస్వామ్యాన్ని భారత్ గౌరవిస్తుంది. ఇరుదేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నాను.

@WilliamsRuto"

 

 

"ఆప్యాయతతో కూడిన శుభాకాంక్షలకు అధ్యక్షుడు కోస్టాకు ధన్యవాదాలు. యూరోపియన్ యూనియన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ప్రాధాన్యతనిస్తుంది. రాబోయే కాలంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కలిసి పనిచేయాలని మేం ఆశిస్తున్నాం.

@eucopresident"

 

 

"నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి మెలోనికి ధన్యవాదాలు. ఇరుదేశాలు, ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం భారత్-ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నా.

@GiorgiaMeloni"

 

 

"గౌరవ నేత ఆప్యాయకరమైన మాటలకు ధన్యవాదాలు. భారత్, మంగోలియా దేశాల మధ్య లోతైన, ప్రత్యేకమైన సంబంధాలున్నాయి. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రజల మధ్య శాశ్వత బంధాలను మరింత బలోపేతం చేయటానికి మీతో కలిసి పనిచేస్తాం.

 

@UKhurelsukh"

 

 

"ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ ప్రేమతో చెప్పిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు.

గతేడాది ఇథియోపియాలో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఇరుదేశాల ప్రజల, గ్లోబల్ సౌత్ దేశాల పరస్పర ప్రయోజనాల కోసం మన సహకారాన్ని కొనసాగించాలని కాంక్షిస్తున్నా

 

@AbiyAhmedAli"

 

 

"అధ్యక్షుడు వాన్ డెర్ లేయన్ అభినందనలకు ధన్యవాదాలు. వాణిజ్యం, సాంకేతికత, మొబిలిటీ, భద్రతతో సహా పలు రంగాల్లో భారత్-ఈయూ భాగస్వామ్యం నిరంతరం బలపడుతోంది.

రెండు దేశాల ప్రజలు, ప్రపంచ సంక్షేమం కోసం ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనం కలిసికట్టుగా కృషి చేయాలి.

@vonderleyen"

 

 

"శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి మిత్సోటాకిస్‌కు ధన్యవాదాలు.

గ్రీస్‌తో ఉన్న మా విలువైన వ్యూహాత్మక, బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది.

@PrimeministerGR"

 

 

"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌కు ధన్యవాదాలు.

ఇటీవల భారత్‌లో మీరు చేసిన పర్యటనను గుర్తు చేసుకుంటున్నాను. ఎన్నో సవాళ్ల మధ్య నిలిచిన భారత్-సైప్రస్ స్నేహాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే మీ నిబద్ధతకు నేను మద్దతిస్తున్నా.

@Christodulides"

 

 

"ఆత్మీయ అభినందనలు తెలిపిన ఛాన్సలర్ మెర్జ్‌కి ధన్యవాదాలు.

భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం.

@bundeskanzler"

 

 

"ప్రధానమంత్రి కార్నీకి ధన్యవాదాలు.

ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం భారత్-కెనడా భాగస్వామ్యం నూతన శిఖరాలను చేరుకుంటుందని విశ్వసిస్తున్నా.

@MarkJCarney"

 

 

"ప్రధానమంత్రి ఫెడరిక్సన్ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.

మూడో భారత్-నార్డిక్ సదస్సులో ఇటీవల జరిగిన ఇరుదేశాల సమావేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ గ్రీన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది"

"గౌరవ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.

 

 

దక్షిణ కొరియాతో ఉన్న ప్రత్యేక భాగస్వామ్యానికి భారత్ ఎంతో విలువనిస్తుంది. ఇరుదేశాల మధ్య సహకారాన్ని కలిసికట్టుగా నూతన శిఖరాలకు తీసుకువెళ్తామని విశ్వసిస్తున్నా.

@Jaemyung_Lee"

 

 

"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మిత్రుడికి ధన్యవాదాలు.

నేను మీతో ఏకీభవిస్తున్నా. రాబోయే ఏళ్లలో భారత్- ఇజ్రాయెల్ స్నేహం మరింత బలపడుతుందని విశ్వసిస్తున్నా.

@IsraeliPM

@netanyahu"

 

 

"ఇవాళ, గత కొన్ని రోజులుగా అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలపటంతో నా హృదయం ఉప్పొంగిపోయింది. ప్రతి సందేశానికి నేను వ్యక్తిగతంగా స్పందించలేకపోవచ్చు. కానీ, ప్రతీ పలకరింపును నేను అపూర్వమైనదిగా భావిస్తాను.

భారత్‌కు సేవ చేసే, మన దేశ అభివృద్ధి ప్రయాణంలో సహకారం అందించే అవకాశం లభించటం అదృష్టంగా భావిస్తున్నా. కొన్నేళ్లుగా భారతదేశ ప్రజలు స్థిరత్వం, సుపరిపాలన, అభివృద్ధి కోసం మళ్లీమళ్లీ ఓటు వేశారు. వారి విశ్వాసమే నాకు అతిపెద్ద బలం. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మరింత అంకితభావంతో పనిచేస్తాను"

 

 

"మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు మిత్రమా.

భారత్-కెనడా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం.

@stephenharper"

 

 

"శుభాకాంక్షలు తెలిపిన శ్రీ రబీ లమీచానేకు ధన్యవాదాలు.

నేపాల్‌తో ఉన్న ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని మేం ఎంతో గౌరవిస్తాం. ఇరుదేశాల మధ్య బహుముఖ భాగస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మేం నిబద్ధతతో ఉన్నాం.

@hamrorabi"

 

 

"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన రిషి సునాక్‌కు ధన్యవాదాలు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు యూకేతో కలిసి పనిచేయటానికి భారత్ సిద్ధంగా ఉంది.

@RishiSunak"

 

 

"నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్‌కు ధన్యవాదాలు.

ఇటీవల నేను స్వీడన్‌లో పర్యటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఆ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలకు మరింత ఊపునిచ్చింది. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.

@SwedishPM"

 

 

"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు.

రెండు దేశాల ప్రయోజనాలు, ప్రపంచ సంక్షేమానికి భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయటానికి ఎంతో ఆసక్తితో ఉన్నాను.

@POTUS


@realDonaldTrump"

 

 

"నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేకు ధన్యవాదాలు. మన మధ్య స్నేహాన్ని నేను ఎంతో గౌరవిస్తాను. భారత్, భూటాన్ మధ్యనున్న ప్రత్యేక బంధానికి ఎంతో విలువనిస్తాను.

రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేస్తాం.

@tsheringtobgay"

 

 

"నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌కు ధన్యవాదాలు. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్-సింగపూర్ బంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయాలని కాంక్షిస్తున్నా. @LawrenceWongST”

 

 

"గౌరవపూర్వకమైన వ్యాఖ్యలు, హృదయపూర్వక శుభాకాంక్షలకు అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీకి ధన్యవాదాలు. భారత్, గయానా ప్రజల ప్రయోజనాల కోసం మన సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా. @presidentaligy”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Proud Moment For Every Indian: PM Modi On Sarnath Being Inscribed On UNESCO World Heritage List

Media Coverage

Proud Moment For Every Indian: PM Modi On Sarnath Being Inscribed On UNESCO World Heritage List
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister praises historic feat at the 2026 World Junior Squash Championship
July 26, 2026

Prime Minister Shri Narendra Modi today hailed a historic feat at the 2026 World Junior Squash Championship. He expressed his pride in Anahat Singh for winning the Gold Medal and becoming the first Indian squash player ever to win the World Junior Championship title.

The Prime Minister noted that this accomplishment will further popularise squash among the youth.

In a post on X, the Prime Minister shared:

"A historic feat at the 2026 World Junior Squash Championship.

Proud of Anahat Singh for winning the Gold Medal and becoming the first Indian squash player ever to win the World Junior Championship title. This accomplishment will further popularise squash among the youth.

@Anahat_Singh13"