హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రపంచ దేశాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందనలు ఎంతో ప్రభావితం చేశాయని, భారత్కు సేవ చేయటం, దేశాభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల విశ్వాసమే తనకు ఎంతో బలమన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, భారతదేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి బోలా అహ్మద్ టినుబుకు ధన్యవాదాలు.
మన మధ్య స్నేహాన్ని, భారత్-నైజీరియా మధ్యనున్న బలమైన భాగస్వామ్యాన్ని నేను గౌరవిస్తాను. ఇరుదేశాల ప్రజల పురోగతి, సంక్షేమానికి, గ్లోబల్ సౌత్ దేశాల ప్రగతికి మనం కలిసికట్టుగా కృషి చేయాలి.
@officialABAT”
Thank you President Bola Ahmed Tinubu for your warm wishes.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
I deeply value our friendship and the strong partnership between India and Nigeria. Together, we will continue to work for the progress and prosperity of our peoples and for the advancement of the Global South.… https://t.co/vwM0mzIdgd
"ఆత్మీయ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం కు ధన్యవాదాలు.
భారత్, మలేషియా మధ్యనున్న బలమైన, శాశ్వతమైన స్నేహాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నా. ఇరుదేశాల ప్రజలు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేయటానికి ఆసక్తితో ఉన్నాను.
@anwaribrahim”
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు దిసనాయకేకు ధన్యవాదాలు.
Thank you Prime Minister Anwar Ibrahim for your warm wishes and kind words.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
I deeply value the strong and enduring friendship between India and Malaysia and look forward to working closely with you to further strengthen our partnership for the benefit of our peoples and the… https://t.co/s0OvEvpWYI
శ్రీలంకతో ఉన్న శాశ్వత స్నేహాన్ని భారత్ ఎంతగానో గౌరవిస్తుంది. మన ప్రత్యేకమైన, బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉంది.
@anuradisanayake"
Thank you, President Dissanayake, for your warm wishes.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
India deeply values its enduring friendship with Sri Lanka and remains committed to advancing our special and multifaceted partnership.@anuradisanayake https://t.co/HWp1wF85GE
"అధ్యక్షుడు మొయిజ్జు శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ఇరుదేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను స్పష్టం చేస్తున్నా.
@MMuizzu"
Thank you, President Muizzu, for your warm wishes. I reaffirm my government’s commitment to further strengthen India-Maldives ties for the benefit of our peoples.@MMuizzu https://t.co/vqTaYIp4iv
— Narendra Modi (@narendramodi) June 10, 2026
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు విలియం రుటోకు ధన్యవాదాలు.
కెన్యాతో ఉన్న చారిత్రక సంబంధాలను, బలమైన భాగస్వామ్యాన్ని భారత్ గౌరవిస్తుంది. ఇరుదేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నాను.
@WilliamsRuto"
Thank you President William Ruto for your warm wishes. India equally values its historical ties and strong partnership with Kenya. I look forward to continue to work closely with you for the mutual benefit of our countries and our peoples.@WilliamsRuto https://t.co/D7sLXZuskR
— Narendra Modi (@narendramodi) June 10, 2026
"ఆప్యాయతతో కూడిన శుభాకాంక్షలకు అధ్యక్షుడు కోస్టాకు ధన్యవాదాలు. యూరోపియన్ యూనియన్తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ప్రాధాన్యతనిస్తుంది. రాబోయే కాలంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కలిసి పనిచేయాలని మేం ఆశిస్తున్నాం.
@eucopresident"
Thank you President Costa for your warm wishes. India attaches great importance to its strategic partnership with the European Union and we look forward to working together to further deepen our cooperation in the times ahead.@eucopresident https://t.co/fsE8zxVtBn
— Narendra Modi (@narendramodi) June 10, 2026
"నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి మెలోనికి ధన్యవాదాలు. ఇరుదేశాలు, ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం భారత్-ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నా.
@GiorgiaMeloni"
Thank you Prime Minister Meloni for your warm wishes. I look forward to building on the strong momentum in our India-Italy Special Strategic Partnership for the mutual benefit of our two nations and peoples.@GiorgiaMeloni https://t.co/XXMjOD6rWj
— Narendra Modi (@narendramodi) June 10, 2026
"గౌరవ నేత ఆప్యాయకరమైన మాటలకు ధన్యవాదాలు. భారత్, మంగోలియా దేశాల మధ్య లోతైన, ప్రత్యేకమైన సంబంధాలున్నాయి. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రజల మధ్య శాశ్వత బంధాలను మరింత బలోపేతం చేయటానికి మీతో కలిసి పనిచేస్తాం.
@UKhurelsukh"
Thank you Excellency for your warm words. India and Mongolia share deep and special ties and I look forward to working closely with you to further strengthen our Strategic Partnership and the enduring bonds between our peoples.@UKhurelsukh https://t.co/c7UFf2Z2BY
— Narendra Modi (@narendramodi) June 10, 2026
"ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ ప్రేమతో చెప్పిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
గతేడాది ఇథియోపియాలో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఇరుదేశాల ప్రజల, గ్లోబల్ సౌత్ దేశాల పరస్పర ప్రయోజనాల కోసం మన సహకారాన్ని కొనసాగించాలని కాంక్షిస్తున్నా
@AbiyAhmedAli"
Thank you Prime Minister Abiy Ahmed Ali for your warm words.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
I fondly recall our meeting in Ethiopia last year and look forward to continuing our close cooperation for the mutual benefit of our peoples and the Global South.@AbiyAhmedAli https://t.co/eaaedUGAUT
"అధ్యక్షుడు వాన్ డెర్ లేయన్ అభినందనలకు ధన్యవాదాలు. వాణిజ్యం, సాంకేతికత, మొబిలిటీ, భద్రతతో సహా పలు రంగాల్లో భారత్-ఈయూ భాగస్వామ్యం నిరంతరం బలపడుతోంది.
రెండు దేశాల ప్రజలు, ప్రపంచ సంక్షేమం కోసం ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనం కలిసికట్టుగా కృషి చేయాలి.
@vonderleyen"
Thank you for your kind words President von der Leyen. The India-EU partnership continues to grow from strength to strength across multiple sectors including trade, technology, mobility and security.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
Together, we will continue to deepen our partnership for the benefit of our… https://t.co/EpVVlnGrpD
"శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి మిత్సోటాకిస్కు ధన్యవాదాలు.
గ్రీస్తో ఉన్న మా విలువైన వ్యూహాత్మక, బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది.
@PrimeministerGR"
Thank you Prime Minister Mitsotakis for your warm greetings.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
India is committed to further strengthening its valued strategic and multi-faceted partnership with Greece.@PrimeministerGR https://t.co/Wrf5mWszqQ
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్కు ధన్యవాదాలు.
ఇటీవల భారత్లో మీరు చేసిన పర్యటనను గుర్తు చేసుకుంటున్నాను. ఎన్నో సవాళ్ల మధ్య నిలిచిన భారత్-సైప్రస్ స్నేహాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే మీ నిబద్ధతకు నేను మద్దతిస్తున్నా.
@Christodulides"
Thank you President Christodoulides for your warm wishes.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
I fondly recall your recent state visit to India and fully reciprocate your commitment to further strengthen the time-tested friendship and strategic partnership between India and Cyprus.@Christodulides https://t.co/j0iD5rjCyj
"ఆత్మీయ అభినందనలు తెలిపిన ఛాన్సలర్ మెర్జ్కి ధన్యవాదాలు.
భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం.
@bundeskanzler"
Thank you Chancellor Merz for your warm words.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
We remain fully committed to further strengthening the India-Germany strategic partnership and deepening cooperation across key areas for the benefit of our peoples.@bundeskanzler https://t.co/C2RK6lRJ48
"ప్రధానమంత్రి కార్నీకి ధన్యవాదాలు.
ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం భారత్-కెనడా భాగస్వామ్యం నూతన శిఖరాలను చేరుకుంటుందని విశ్వసిస్తున్నా.
@MarkJCarney"
Thank you, Prime Minister Carney, for your gracious words.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
I am confident that India-Canada partnership will continue to attain new heights for the benefit of our peoples.@MarkJCarney https://t.co/EpcpMYf2G0
"ప్రధానమంత్రి ఫెడరిక్సన్ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
మూడో భారత్-నార్డిక్ సదస్సులో ఇటీవల జరిగిన ఇరుదేశాల సమావేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ గ్రీన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది"
"గౌరవ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
Thank you Prime Minister Frederiksen for your warm wishes.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
Building on our recent meeting at the 3rd India-Nordic Summit, India remains fully committed to further deepening our Green Strategic Partnership. https://t.co/W1DXeqkGEg
దక్షిణ కొరియాతో ఉన్న ప్రత్యేక భాగస్వామ్యానికి భారత్ ఎంతో విలువనిస్తుంది. ఇరుదేశాల మధ్య సహకారాన్ని కలిసికట్టుగా నూతన శిఖరాలకు తీసుకువెళ్తామని విశ్వసిస్తున్నా.
@Jaemyung_Lee"
माननीय राष्ट्रपति ली जे-म्युंग जी, आपकी शुभकामनाओं के लिए बहुत-बहुत धन्यवाद।
— Narendra Modi (@narendramodi) June 10, 2026
भारत भी दक्षिण कोरिया के साथ अपनी विशेष साझेदारी को अत्यंत महत्व देता है। मुझे विश्वास है कि हम साथ मिलकर अपने सहयोग को नई ऊँचाइयों तक ले जाएंगे।@Jaemyung_Lee https://t.co/OYkURxXBn8
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మిత్రుడికి ధన్యవాదాలు.
నేను మీతో ఏకీభవిస్తున్నా. రాబోయే ఏళ్లలో భారత్- ఇజ్రాయెల్ స్నేహం మరింత బలపడుతుందని విశ్వసిస్తున్నా.
@IsraeliPM
@netanyahu"
Thank you, my friend, for your most gracious wishes.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
I fully agree with you. India-Israel friendship will continue to grow from strength-to-strength in the years to come.@IsraeliPM@netanyahu https://t.co/ZyHp3Mlcv1
"ఇవాళ, గత కొన్ని రోజులుగా అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలపటంతో నా హృదయం ఉప్పొంగిపోయింది. ప్రతి సందేశానికి నేను వ్యక్తిగతంగా స్పందించలేకపోవచ్చు. కానీ, ప్రతీ పలకరింపును నేను అపూర్వమైనదిగా భావిస్తాను.
భారత్కు సేవ చేసే, మన దేశ అభివృద్ధి ప్రయాణంలో సహకారం అందించే అవకాశం లభించటం అదృష్టంగా భావిస్తున్నా. కొన్నేళ్లుగా భారతదేశ ప్రజలు స్థిరత్వం, సుపరిపాలన, అభివృద్ధి కోసం మళ్లీమళ్లీ ఓటు వేశారు. వారి విశ్వాసమే నాకు అతిపెద్ద బలం. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మరింత అంకితభావంతో పనిచేస్తాను"
Deeply touched by the good wishes conveyed by people from all walks of life today and over the last few days. While I may not have been able to respond to each message individually, I cherish every greeting conveyed.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
I consider it a privilege to have the opportunity to serve…
"మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు మిత్రమా.
భారత్-కెనడా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
@stephenharper"
Thank you for your kind wishes, my friend.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
We are committed to working towards strengthening India-Canada ties.@stephenharper https://t.co/1303l2PBkf
"శుభాకాంక్షలు తెలిపిన శ్రీ రబీ లమీచానేకు ధన్యవాదాలు.
నేపాల్తో ఉన్న ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని మేం ఎంతో గౌరవిస్తాం. ఇరుదేశాల మధ్య బహుముఖ భాగస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మేం నిబద్ధతతో ఉన్నాం.
@hamrorabi"
Thank you for your kind wishes Mr. Rabi Lamichhane
— Narendra Modi (@narendramodi) June 10, 2026
We deeply value our special partnership with Nepal and are committed to working towards further strengthening our multifaceted ties.@hamrorabi https://t.co/0DoXxzBvlq
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన రిషి సునాక్కు ధన్యవాదాలు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు యూకేతో కలిసి పనిచేయటానికి భారత్ సిద్ధంగా ఉంది.
@RishiSunak"
Thank you Rishi Sunak for your warm wishes.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
India is committed to working with the UK to further deepen our bilateral ties.@RishiSunak https://t.co/oxyUUc7lD9
"నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్కు ధన్యవాదాలు.
ఇటీవల నేను స్వీడన్లో పర్యటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఆ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలకు మరింత ఊపునిచ్చింది. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.
@SwedishPM"
Thank you Prime Minister Ulf Kristersson for your warm wishes.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
I fondly recall my recent visit to Sweden, which added further momentum to our ties. India remains deeply committed to advancing our strategic partnership.@SwedishPM https://t.co/pOmsLvkfGT
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు.
రెండు దేశాల ప్రయోజనాలు, ప్రపంచ సంక్షేమానికి భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయటానికి ఎంతో ఆసక్తితో ఉన్నాను.
@POTUS
@realDonaldTrump"
Thank you, President Trump, for your warm wishes.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
I look forward to working with you to further advance the India-US Comprehensive Global Strategic Partnership, for the benefit of both our nations and the world.@POTUS@realDonaldTrump pic.twitter.com/4W09WzT4Ju
"నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేకు ధన్యవాదాలు. మన మధ్య స్నేహాన్ని నేను ఎంతో గౌరవిస్తాను. భారత్, భూటాన్ మధ్యనున్న ప్రత్యేక బంధానికి ఎంతో విలువనిస్తాను.
రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేస్తాం.
@tsheringtobgay"
Thank you Prime Minister Tshering Tobgay for your heartfelt wishes. I cherish our friendship and deeply value the special relationship between India and Bhutan.
— Narendra Modi (@narendramodi) June 10, 2026
I look forward to working together to further strengthen our partnership in the years to come.@tsheringtobgay https://t.co/bznP3ed3IS
"నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్కు ధన్యవాదాలు. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్-సింగపూర్ బంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయాలని కాంక్షిస్తున్నా. @LawrenceWongST”
Thank you Prime Minister Lawrence Wong for your warm wishes.
— Narendra Modi (@narendramodi) June 11, 2026
I look forward to working closely with you to further deepen our Comprehensive Strategic Partnership and take India-Singapore ties to new heights.@LawrenceWongST https://t.co/znphRGeMUa
"గౌరవపూర్వకమైన వ్యాఖ్యలు, హృదయపూర్వక శుభాకాంక్షలకు అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీకి ధన్యవాదాలు. భారత్, గయానా ప్రజల ప్రయోజనాల కోసం మన సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా. @presidentaligy”
Thank you, President Dr. Irfaan Ali, for your gracious words and warm wishes.
— Narendra Modi (@narendramodi) June 11, 2026
I look forward to continuing our cooperation for the benefit of the people of India and Guyana.@presidentaligy https://t.co/qdriblwSJu


