ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో లావెండర్ (మరువం వంటి సుగంధ పుష్పజాతి) సంబంధిత ప్రసంగ భాగాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌లో ఈ సుగంధ పుష్పానికి విశేష ప్రజాదరణ లభిస్తుండటంపై శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.
దీనిపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:
“జమ్ముకశ్మీర్‌లో లావెండర్‌కు ప్రజాదరణ నానాటికీ పెరుగుతుండటం ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఇటీవలి నా ‘మన్ కీ బాత్’ #MannKiBaat కార్యక్రమంలో ఈ అంశాన్ని నేను ప్రముఖంగా ప్రస్తావించాను. దీన్ని youtu.be/kkbQzipkqrA లో చూడవచ్చు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Good to see Lavender becoming popular in Jammu and Kashmir. I had highlighted this topic during a recent #MannKiBaat programme as well. https://t.co/V6Zs2665rp https://t.co/AjvT1nFbcO
— Narendra Modi (@narendramodi) June 9, 2023


