లక్నో నగరానికి సృజనాత్మక గ్యాస్ట్రోనమీ నగరంగా యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

లక్నో ఒక శక్తిమంతమైన సంస్కృతికి పర్యాయపదంగా నిలుస్తుందనీ, అది గొప్ప వంటకాల సంప్రదాయానికి కేంద్రంగా ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. యునెస్కో గుర్తింపు లక్నో నగర విలక్షణతను సుస్పష్టం చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు లక్నోను సందర్శించి ఈ నగర ప్రత్యేకతను తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ఈ గుర్తింపు గురించి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ, శ్రీ మోదీ ఎక్స్ వేదికగా ఇలా పేర్కొన్నారు:

 

"లక్నో ఒక శక్తిమంతమైన సంస్కృతికి పర్యాయపదంగా నిలుస్తుంది. అది గొప్ప వంటకాల సంప్రదాయానికి కేంద్రంగా ఉంది. లక్నో నగర ప్రత్యేకతను యునెస్కో గుర్తించడం సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు లక్నోను సందర్శించి ఈ నగర విలక్షణతను తెలుసుకోవాలని నేను పిలుపునిస్తున్నాను."

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending

Media Coverage

Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026