ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా.. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ సభ స్పీకర్‌కు ప్రధాని కృతజ్ఞతలను వ్యక్తం చేశారు. ‘‘మీ అందరి ప్రేమే నాలో నిరంతరం దేశసేవ చేస్తూండాలన్న స్ఫూర్తిని నింపుతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘ఓం బిర్లా (@ombirlakota) గారూ, మీరందించిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలను వ్యక్తం చేస్తున్నా. దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశాన్ని సమగ్రాభివృద్ధి బాటలో ముందుకు నడపడం కోసం మన ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. మీరందరూ చూపిస్తున్న ప్రేమే దేశ సేవలో నేను నిరంతరం నిమగ్నం కావడానికి నాలో స్ఫూర్తిని నింపుతోంది.’’ అని పేర్కొన్నారు.
शुभकामनाओं के लिए आपका बहुत-बहुत आभार @ombirlakota जी। देशवासियों के कल्याण और राष्ट्र के समग्र विकास के लिए हमारी सरकार अपने प्रयासों में कोई कोर-कसर नहीं छोड़ने वाली है। यह आप सबका स्नेह ही है, जो मुझे निरंतर देशसेवा में जुटे रहने के लिए प्रेरित करता रहता है। https://t.co/QZJJONUj2a
— Narendra Modi (@narendramodi) September 17, 2025


