కోపం తాలూకు వినాశకారి స్వభావం గురించి చెబుతూ వ్యక్తిగత క్షేమంతో పాటు సామూహిక ప్రగతి కోసం అంతరంగ శాంతిని అలవరుచుకోవాలని సూచించే ఒక లోతైన సందేశాన్ని ప్రజలతో ప్రధానమంత్రి ఈ రోజు పంచుకున్నారు.
సంస్కృతంలో ఒక ప్రాచీన శ్లోకాన్ని ప్రధానమంత్రి ఉదాహరించారు. నిర్ణయాలను తీసుకొనే సామర్థ్యాన్ని కోపం బలహీనపరిచి, సామాజిక సామరస్యాన్ని భంగపరుస్తుందని, మానవుల్లోని సామర్థ్యాన్ని తగ్గించివేస్తుందని వివరించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘క్రోధ: ప్రాణహర: శత్రు: క్రోధో మిత్రముఖో రిపు:
క్రోధో హ్యసిర్మహాతీక్షణ: సర్వ క్రోధోఅపకర్షతి’’
क्रोधः प्राणहरः शत्रुः क्रोधो मित्रमुखो रिपुः।
— Narendra Modi (@narendramodi) December 12, 2025
क्रोधो ह्यसिर्महातीक्ष्णः सर्व क्रोधोऽपकर्षति॥ pic.twitter.com/GBxlYC0oIH


