నౌకా వాణిజ్య అనుసంధానం, ప్రపంచ స్థాయిలో నౌకాయాన ధోరణులు, భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నౌకా వాణిజ్య రంగంలో పెరుగుతున్న అవకాశాలపై సీఎంఏ సీజీఎం చైర్మన్, సీఈవో శ్రీ రోడాల్ఫ్ సాడేతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు.
నౌకా నిర్మాణం, కంటైనర్ల తయారీ, నౌకా వాణిజ్యంలో డిజిటల్ ఆవిష్కరణలు, సరుకు రవాణా, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో మరింత సహకారానికి గల అవకాశాలపై చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు.
రోజురోజుకీ విస్తరిస్తున్న భారత ఓడరేవు మౌలిక సదుపాయాలు ప్రపంచ నౌకా వాణిజ్య రంగ నాయకులకు ఆశాజనకమైన అవకాశాలను అందిస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“సీఎంఏ సీజీఎమ్ చైర్మన్, సీఈవో శ్రీ రోడోల్ఫ్ సాడేతో నౌకా వాణిజ్య అనుసంధానం, ప్రపంచ నౌకాయాన ధోరణులు, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత నౌకా వాణిజ్య రంగంలో పెరుగుతున్న అవకాశాలపై ఫలవంతమైన చర్చ జరిగింది.
నౌకా నిర్మాణం, కంటైనర్ తయారీ, నౌకా వాణిజ్యంలో డిజిటల్ ఆవిష్కరణలు, సరుకు రవాణా, నైపుణ్యాభివృద్ధిలో మరింత సహకారం కోసం గల అవకాశాలను చర్చించాం.
విస్తరిస్తున్న భారత ఓడరేవు మౌలిక సదుపాయాలు ప్రపంచ నౌకా వాణిజ్య రంగ నాయకులకు మంచి అవకాశాలను అందిస్తున్నాయి.
@cmacgm”
Had a fruitful discussion with Mr. Rodolphe Saadé of CMA CGM on maritime connectivity, global shipping trends and emerging opportunities in India’s rapidly growing maritime sector.
— Narendra Modi (@narendramodi) June 18, 2026
Discussed avenues for greater collaboration in shipbuilding, container manufacturing, digital… pic.twitter.com/k3vrCH3IiD


