ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ లారెన్స్ వాంగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ - సింగపూర్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాల ద్వారా బలమైన, బహుముఖీనమైన భాగస్వామ్యం నెలకొని ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన @LawrenceWongST కు హృదయపూర్వక అభినందనలు. సన్నిహిత ప్రజా సంబంధాల ఆధారంగా భారత్, సింగపూర్ మధ్య బలమైన, బహుముఖీనమైన భాగస్వామ్యం ఉంది. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మీతో కలిసి పనిచేయడం కోసం నేను ఎదురుచూస్తున్నాను.”
Heartiest congratulations @LawrenceWongST on your resounding victory in the general elections. India and Singapore share a strong and multifaceted partnership, underpinned by close people-to-people ties. I look forward to continue working closely with you to further advance our…
— Narendra Modi (@narendramodi) May 4, 2025


