ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘డిస్కస్ త్రో ఎఫ్-11’లో రజత పతకం సాధించిన మోను ఘంగాస్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. అతడి నైపుణ్యం, అంకిత భావం దేశంతోపాటు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల ‘డిస్కస్ త్రో ఎఫ్-11’లో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన మోను ఘంగాస్‌కు హృదయపూర్వక అభినందనలు. అతని తిరుగులేని శక్తి ఈ రజత పతకంతో మరింత ప్రకాశించి దేశం గర్వించేలా చేసింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations to @GhangasMonu for the exceptional performance in Men's Discus Throw-F11 at the Asian Para Games. His power and skill have earned him a brilliant Silver Medal, making India proud. pic.twitter.com/INnz7Dzrkl
— Narendra Modi (@narendramodi) October 26, 2023


