ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్-2025లో అద్భుత ప్రదర్శనతో రికార్డులు బద్దలుగొట్టిన భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
క్రీడాకారులు మునుపెన్నడూ లేనివిధంగా 9 స్వర్ణాలు సహా 20 పతకాలను దేశానికి అందించారని ప్రశంసించారు. భారత బాక్సింగుకు ఇదో చరిత్రాత్మక విజయమన్నారు. దేశ బాక్సర్ల సంకల్పం, కృతనిశ్చయం, అలుపెరుగని స్ఫూర్తే ఈ విజయానికి కారణమన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్- 2025లో మన అద్భుత క్రీడాకారులు అసాధారణమైన, రికార్డు స్థాయి ప్రదర్శన కనబరిచారు. మునుపెన్నడూ లేనివిధంగా 9 స్వర్ణాలు సహా 20 పతకాలను దేశానికి సాధించి పెట్టారు. మన బాక్సర్ల సంకల్పం, కృతనిశ్చయమే దీనికి కారణం. వారికి అభినందనలు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.”
Our phenomenal athletes delivered an extraordinary, record-breaking performance at the World Boxing Cup Finals 2025! They brought home an unprecedented 20 medals including 9 Golds. This is due to the resolve and determination of our boxers. Congratulations to them. Best wishes… pic.twitter.com/jTLeJntODZ
— Narendra Modi (@narendramodi) November 24, 2025


