జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొంది:
‘‘జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత విచారకరం. ఈ దుర్ఘటన కారణంగా భక్తజనం తమ ప్రాణాలు కోల్పోవాల్సివచ్చింది. వారి ఆత్మీయులకు నేను నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారు ఈ వేదనను తట్టుకొనే శక్తిని దైవం వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరూ అతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రధానమంత్రి @narendramodi”.
झारखंड के देवघर में हुई सड़क दुर्घटना अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर उन्हें इस पीड़ा को सहने की शक्ति दे। इसके साथ ही मैं सभी घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं: PM…
— PMO India (@PMOIndia) July 29, 2025


