ప్రముఖ అథ్లెట్ శ్రీ మిల్కాసింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీ మిల్కాసింగ్ ను గొప్ప క్రీడాకారుడిగా అభివర్ణించిన ప్రధానమంత్రి దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసి  భారత ప్రజల హృదయాలలో ఆయన సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు.

మిల్కా సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ శ్రీ నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. ' శ్రీ మిల్కాసింగ్ మృతితో భారతదేశం ఒక గొప్ప క్రీడాకారుడుని కోల్పోయింది. ఆయన భారతదేశానికి క్రీడారంగంలో ఎనలేని సేవలను అందించి దేశ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. తన వ్యక్తిత్వంతో ఆయన లక్షలాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచారు.  ఆయన మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కొన్ని రోజుల ముందే నేను శ్రీ మిల్కా సింగ్ తో మాట్లాడాను. ఆయనతో ఇది నా చివరి సంభాషణ అవుతుందని అనుకోలేదు. అనేకమంది ఔత్సాహిక అథ్లెట్లు ఆయన నుంచి స్ఫూర్తి పొందుతారు. ఆయన కుటుంబ సభ్యులు, ప్రపంచవ్యాపితంగా ఉన్న ఆయన అభిమానులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.' అని శ్రీ నరేంద్ర మోడీ తన ట్వీట్లలో పేర్కొన్నారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Special, As Always’: PM Modi Shares Video Of Feeding Cows, Peacocks Before Red Fort Visit

Media Coverage

‘Special, As Always’: PM Modi Shares Video Of Feeding Cows, Peacocks Before Red Fort Visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Maharashtra met the Prime Minister
August 17, 2026

The Chief Minister of Maharashtra, Shri Devendra Fadnavis, today met Prime Minister Shri Narendra Modi.

In a post on X, the Prime Minister's Office shared:

"Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis met Prime Minister @narendramodi.

@CMOMaharashtra"