ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భవనం కుప్పకూలిన ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తూ.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున హరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భవనం కూలిపోవడం వల్ల సంభవించిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ కష్ట సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటిస్తున్నాం. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం: ప్రధానమంత్రి’’
Deeply saddened by the mishap due to the collapse of a building in Prayagraj, Uttar Pradesh. My thoughts are with the affected people and their families in this difficult hour. May those injured recover at the earliest.
— PMO India (@PMOIndia) March 23, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the…


