‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘నా ప్రియ స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధానమంత్రి శ్రీ రైలా ఒడింగా మరణ వార్త తెలిసి ఎంతో బాధ పడ్డాను. ఆయన ఓ సమున్నత రాజనీతిజ్ఞుడే కాక భారత్‌కు ఆప్త మిత్రుడు కూడా. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచీ నాకు ఆయన బాగా తెలుసు.. మా అనుబంధం ఏళ్ల తరబడి కొనసాగింది. భారత్ అన్నా, మన సంస్కృతి.. మన దేశ విలువలు.. మన దేశ ప్రాచీన జ్ఞానమన్నా శ్రీ రైలా ఒడింగాకు ఎంతో ప్రేమ. ఈ ప్రేమకు నిదర్శనం భారత్-కెన్యా సంబంధాలను బలపరచడానికి ఆయన నడుం బిగించి చేసిన కృషే. మరీ ముఖ్యంగా ఆయుర్వేదతో పాటు భారత సాంప్రదాయక వైద్య పద్ధతుల పట్ల ఆయన మక్కువను కనబరచారు.. అవి ఆయన కుమార్తె ఆరోగ్యాన్ని నయం చేయడాన్ని ఆయన గమనించారు. ఈ కష్ట కాలంలో ఆయన కుటుంబానికీ, స్నేహితులతో పాటు కెన్యా ప్రజానీకానికీ నేను నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’
Deeply saddened by the passing of my dear friend and former Prime Minister of Kenya, Mr. Raila Odinga. He was a towering statesman and a cherished friend of India. I had the privilege of knowing him closely since my days as Chief Minister of Gujarat and our association continued… pic.twitter.com/Nmya9C3LZi
— Narendra Modi (@narendramodi) October 15, 2025


