ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ప్రమాదం ఫలితంగా ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం అందిస్తామని శ్రీ మోదీ ప్రకటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం వరుస ట్వీట్లలో పంపిన సందేశాల్లో:
“ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిన ప్రమాదం నన్నెంతో బాధించింది. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి” అని పేర్కొంది. అలాగే...
“షాజహాన్‌పూర్ దుర్ఘటన బాధితుల కోసం స్థానిక యంత్రాంగం సంపూర్ణ సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టింది: ప్రధానమంత్రి” అని తెలిపింది. మరోవైపు-
“షాజహాన్‌పూర్‌లో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం అందించబడుతుంది: ప్రధానమంత్రి” అని తెలిపింది.
उत्तर प्रदेश के शाहजहांपुर में ट्रैक्टर ट्रॉली के नदी में गिरने से हुई दुर्घटना अत्यंत आहत करने वाली है। इस हादसे में जिन लोगों ने अपने प्रियजनों को खोया है, उनके प्रति गहरी संवेदना प्रकट करने के साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 15, 2023
An ex gratia of Rs. 2 lakh would be given to the next of kin of each of those who lost their lives in the mishap in Shahjahanpur, UP. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 15, 2023


