ఝార్ ఖండ్ లోని ధన్ బాద్ లో ఒక అగ్ని ప్రమాదం జరిగిన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదం లో ప్రాణాల ను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ధన్ బాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లిన విషయం తెలిసి ఎంతో బాధ పడ్డాను. ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడిన వారు త్వరలోనే పునః స్వస్థత ను పొందుదురు గాక: ప్రధాన మంత్రి @narendramodi’’
‘‘ధన్ బాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన లో మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. క్షతగాత్రుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి@narendramodi’’ అని తెలిపింది.
Deeply anguished by the loss of lives due to a fire in Dhanbad. My thoughts are with those who lost their loved ones. May the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 31, 2023


