శ్రీమద్ పంచఖండ పీఠాధిపతి ఆచార్య ధర్మేంద్ర కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“సమాజం కోసమే కాకుండా దేశసేవకూ అంకితమైన శ్రీమద్ పంచఖండ పీఠాధిపతి శ్రీ ఆచార్య ధర్మేంద్ర మృతి అత్యంత బాధాకరం. ఆయన కన్నుమూత ధార్మిక, ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు. భగవంతుడు ఆయనకు తన పాదాల చెంత స్థానం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి!” అని ప్రధాని పేర్కొన్నారు.
समाज और राष्ट्रसेवा में समर्पित श्रीमद् पंचखण्ड पीठाधीश्वर आचार्य धर्मेंद्र जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना धार्मिक और आध्यात्मिक जगत के लिए एक अपूरणीय क्षति है। ईश्वर उन्हें अपने श्रीचरणों में स्थान दे। ओम शांति!
— Narendra Modi (@narendramodi) September 19, 2022


