హాంగ్జోవులో జరుగుతున్న ఏసియన్ గేమ్స్ 2022 ,పురుషుల స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల రిలే పోటీలలో కాంస్య పతకం గెలుచుకున్న ఆనందకుమార్ వెల్ కుమార్, సిద్ధాంత్ రాహుల్ కాంబ్లే, విక్రమ్ రాజేంద్ర ఇంగ్లేలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమ వేదిక , ఎక్స్ లో ఒక సందేశం పోస్ట్ చేస్తూ ప్రధానమంత్రి,
‘‘ అధ్బుతమైన టీమ్ వర్క్ మన దేశానికి మరో కాంస్య పతకాన్ని సాధించిపెట్టింది.
ఆనందకుమార్ వేల్ కుమార్, సిద్ధాంత్ రాహుల్ కాంబ్లే, విక్రమ్ రాజేంద్ర ఇంగ్లేలు పురుషుల 3000 మీటర్ల స్పీడ్ స్కేటింగ్ రిలే పోటీలలో గెలుపొందారు. వీరు సాధించిన విజయానికి భారతదేశం ఆనందిస్తోంది. ఎంతో గర్వపడుతోంది.’’ అని పేర్కొన్నారు.
Incredible display of teamwork brings home yet another Bronze Medal!
— Narendra Modi (@narendramodi) October 2, 2023
Anandkumar Velkumar, Siddhant Rahul Kamble, Vikram Rajendra Ingale have the Bronze in the Men's Speed Skating 3000m Relay.
India is overjoyed and takes immense pride in this accomplishment! pic.twitter.com/M9PhmYlZiK