రోమ్‌లోని అధ్యక్ష భవనం క్విరినాలేలో ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.
భారత్-ఇటలీ సంబంధాలను బలోపేతం చేసేందుకు అందిస్తున్న సహకారం, నాయకత్వానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ అధ్యక్షుడు మట్టారెల్లాకు ధన్యవాదాలు తెలిపారు. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగమిస్తున్న తీరును ఇరు దేశాల నేతలు ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, ఆవిష్కరణలు, రక్షణ, అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధ, కొత్త సాంకేతికతలు, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు మెరుగ్గా సాగుతుండటంపై ఇరు నేతలు హర్షం వ్యక్తం చేశారు.
భారత్-ఈయూ స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై త్వరగా పూర్తయితే ఇరు దేశాల ధ్వైపాక్షిక భాగస్వామ్యానికి కొత్త ఉత్సాహం వస్తుందని ఇరు నేతలు అభిప్రాయపడ్డారు. డిజిటల్ అనుసంధానం, సముద్ర భద్రత, ఇంధన సరఫరాలను బలోపేతం చేయడంలో భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ ప్రాముఖ్యతపై చర్చించారు.

ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై ఇద్దరు నేతలు చర్చించారు. పశ్చిమాసియా, ఐరాపాలో జరుగుతున్న యుద్ధాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, నౌకాయాన స్వేచ్ఛను, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
తనకు లభించిన ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. అనుకూలమైన సమయంలో భారత్‌లో పర్యటించాల్సిందిగా ఇటలీ అధ్యక్షుడు మట్టారెల్లాను ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆహ్వానించారు.
Met President Sergio Mattarella in Rome. We discussed different aspects relating to the India-Italy friendship, including trade, investment and cultural linkages. We talked about how our nations can collaborate in areas such as AI, critical minerals, space and nuclear energy.… pic.twitter.com/9CcbLqfbL2
— Narendra Modi (@narendramodi) May 20, 2026
Ho incontrato il Presidente Sergio Mattarella a Roma. Abbiamo discusso di diversi aspetti relativi all'amicizia tra India e Italia, tra cui commercio, investimenti e legami culturali. Abbiamo parlato di come settori quali l'intelligenza artificiale, i minerali critici, lo spazio… pic.twitter.com/UWuXnmBDt7
— Narendra Modi (@narendramodi) May 20, 2026


