ఒక లక్ష మంది కి పైగా ఎస్ హెచ్ జి సభ్యుల కు సీడ్ కేపిటల్అసిస్టెన్స్ ను ఇచ్చారు
వరల్డ్ ఫూడ్ ఇండియా 2023 లో భాగం గా ఫూడ్ స్ట్రీట్ నుప్రారంభించారు
‘‘రుచి మరియు సాంకేతిక విజ్ఞ‌ానం ల మేళనం భావి కాల ఆర్థిక వ్యవస్థ కు బాట ను పరుస్తుంది’’
‘‘ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్ వెస్టర్- ఫ్రెండ్ లీ విధానాలు ఆహార రంగాన్ని నూతన శిఖరాల కుచేర్చుతున్నాయి’’
‘‘ఫూడ్ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లో ప్రతి రంగం లో భారతదేశం అసాధారణమైన వృద్ధి నిసాధించింది’’
‘‘ఫూడ్ ప్రాసెసింగ్ సెక్టర్ లో భారతదేశం యొక్క వృద్ధి కిఉన్నటువంటి మూడు స్తంభాలు ఏవేవి అంటే అవి చిన్న రైతులు, చిన్న పరిశ్రమలు మరియుమహిళలు అనేవే’’
‘‘ ‘ఒక జిల్లా ఒక ఉత్పాదన’ వంటి పథకాలు చిన్న రైతుల కుమరియు చిన్న పరిశ్రమల కు క్రొత్త గుర్తింపు ను ఇస్తున్నాయి’’
‘‘ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లో నాయకత్వం వహించే స్వాభావిక సామర్థ్యం భారతదేశం మహిళల కు ఉంది’’
‘‘భారతదేశం లో గల ఆహారపరమైన వైవిధ్యం గ్లోబల్ ఇన్ వెస్టర్లకు ఒక డివిడెండ్ అని చెప్పవచ్చును’’
భారతదేశం లో దీర్ఘకాలం మన్నిక ను కలిగివున్నటువంటి ఆహార సంస్కృతివేల సంవత్సరాలు గా రూపురేఖలను సంతరించుకొన్నది. మన పూర్వికులు ఆహారపు అలవాటుల ను ఆయుర్వేదం తో పెనవేశారు’’
భారతదేశం యొక్క ‘సూపర్ ఫూడ్ బకెట్’ లో చిరు ధాన్యాలు ఒక భాగం; వాటిని ‘శ్రీ అన్న’ గా ప్రభుత్వం గుర్తించింది’’
దీర్ఘకాలం పాటు మన్నిక ను కలిగివుండేటటువంటి జీవన శైలియొక్క ధ్యేయాన్ని నెరవేర్చుకోవడం లో ఆహార వ్యర్థాల ను తగ్గించడం ఒక ముఖ్య ప్రయాసఅని చెప్పాలి’’

‘వరల్డ్ ఫూడ్ ఇండియా 2023’ అనే ఆహార సంబంధి పెద్ద కార్యక్రమం యొక్క రెండో ఎడిశన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఉన్న భారత్ మండపమ్ లో ఈ రోజు న ప్రారంభించారు. స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జిస్)ను బలపరచడం కోసం ఉద్దేశించినటువంటి సీడ్ కేపిటల్ అసిస్టెన్స్ ను ఒక లక్ష మంది కి పైగా ఎస్ హెచ్ జి సభ్యుల కు ఆయన అందజేశారు. ఈ సందర్భం లో ఏర్పాటైన ఒక ప్రదర్శన ను కూడా ఆయన సందర్శించారు. భారతదేశాన్ని ప్రపంచాని కి ఆహార గంప గా చాటి చెప్పడం తో పాటు ‘శ్రీ అన్న యొక్క అంతర్జాతీయ సంవత్సరం’ గా 2023 వ సంవత్సరాన్ని పాటించడం కూడా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాల లో భాగాలు గా ఉన్నాయి.

 

జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ సందర్భం లో ఏర్పాటైన టెక్నాలజీ ఎండ్ స్టార్ట్ అప్ పెవిలియన్ ను మరియు ఫూడ్ స్ట్రీట్ ను ప్రశంసించారు. రుచి మరియు సాంకేతిక విజ్ఞ‌ానం ల మేళనం భవిష్యత్తు కాలానికి చెందిన ఆర్థిక వ్యవస్థ కు బాట ను పరచగలుగుతుందని కూడా ప్రధాన మంత్రి అన్నారు. మార్పుల కు లోనవుతున్నటువంటి వర్తమాన ప్రపంచం లో, ఆహార భద్రత కు సంబంధించిన ప్రధానమైన సవాళ్ల లో ఒక ప్రధానమైన సవాలు ను గురించి మరియు వరల్డ్ ఫూడ్ ఇండియా 2023 కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రముఖం గా పేర్కొన్నారు.

 

‘చక్కని అవకాశాల ను ప్రసాదించే రంగం’ గా భారతదేశం యొక్క ఫూడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ను గుర్తిస్తూ ఉండడం అనేది వరల్డ్ ఫూడ్ ఇండియా యొక్క ఫలితాల కు ఒక పెద్ద ఉదాహరణ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పరిశ్రమ కు అనుకూలమైన విధానాలు మరియు రైతు లకు అనుకూలమైన విధానాల పర్యవసానం గా ఈ రంగం ఏభై వేల కోట్ల రూపాయల కు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ) ని ఆకట్టుకొందన్నారు. ఫూడ్ ప్రాసెసింగ్ రంగం లో ఉత్సాదన తో ముడిపెట్టినటువంటి ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, అది పరిశ్రమ లో క్రొత్త పాత్రదారుల కు పెద్ద సహాయాన్ని సమకూరుస్తోంది అన్నారు. సుమారు గా ఏభై వేల కోట్ల రూపాయల కు పైగా పెట్టుబడి తో కూడిన ఎగ్రి-ఇన్ ఫ్రా ఫండ్ ఫార్ పోస్ట్-హార్వెస్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో భాగం గా, వేల కొద్దీ ప్రాజెక్టు ల పనులు జరుగుతున్నాయి, అలాగే పశుపోషణ మరియు చేపల పెంపకం రంగం లో వేల కొద్దీ కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి తో ప్రాసెసింగ్ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ను ప్రోత్సహించడం కూడ జరుగుతోంది అని ఆయన వివరించారు.

 

‘‘ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారు మిత్రపూర్వక విధానాలు ఆహార రంగాన్ని నూతన శిఖరాల కు చేర్చుతున్నాయి’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో భారతదేశం యొక్క వ్యావసాయక ఎగుమతుల లో శుద్ధి చేసిన ఆహారం యొక్క వాటా 13 శాతం నుండి 23 శాతాని కి వృద్ధి చెందింది అని ప్రధాన మంత్రి తెలిపారు; దీనితో ప్రాసెస్డ్ ఫూడ్స్ ఎగుమతుల లో మొత్తం మీద చూస్తే 150 శాతం వృద్ధి చోటు చేసుకొందన్నారు. ‘‘ప్రస్తుతం భారతదేశం వ్యావసాయక ఉత్పత్తి పరం గా చూసినప్పుడు 50,000 మిలియన్ యుఎస్ డాలర్ కు పైచిలుకు సమగ్రమైన ఎగుమతి సంబంధి విలువ తో ఏడో స్థానం లో ఉంది’’ అని ఆయన వెల్లడించారు. భారతదేశం ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లో ఇదివరకు ఎరుగనంత వృద్ధి ని నమోదు చేయని రంగం అంటూ ఏదీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తో అనుబంధం కలిగి ఉన్న ప్రతి ఒక్క కంపెనీ కి మరియు స్టార్ట్-అప్ కు ఇది ఒక సువర్ణావకాశం అని ఆయన అన్నారు.

 

భారతదేశం లో ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ శరవేగం గా వృద్ధి చెందుతూ ఉన్నందుకు ఖ్యాతి ప్రభుత్వం చేపడుతున్నటువంటి నిరంతర ప్రయాస లు మరియు సమర్పణ భావం తో కూడిన ప్రయాసలదే అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం లో మొట్టమొదటి సారి ఎగ్రి-ఎక్స్ పోర్ట్ పాలిసి కి రూపకల్పన చేయడం, జాతీయ స్థాయి లో లాజిస్టిక్స్ మరియు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లను అభివృద్ధి చేయడం, జిల్లా ను గ్లోబల్ మార్కెట్ తో సంధానించేందుకు వంద కు పైగా జిల్లా స్థాయి కేంద్రాల ను ఏర్పాటు చేయడం, మెగా ఫూడ్ పార్క్ లను రెండు నుండి ఇరవై కి పైచిలుకు స్థాయి కి పెంచడం తో పాటు భారతదేశం యొక్క ఫూడ్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని 12 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 200 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు స్థాయి కి చేర్చడం వంటి అంశాల ను గురించి ఆయన ప్రస్తావించారు. భారతదేశం లో ఫూడ్ ప్రాసెసింగ్ సామర్థ్యం గడచిన తొమ్మిది ఏళ్ళ లో 15 రెట్ల వృద్ధి ని చూసింది అని ఆయన అన్నారు. భారతదేశం నుండి మొట్టమొదటి సారి గా ఎగుమతి అవుతున్న వ్యావసాయక ఉత్పాదన ల తాలూకు ఉదాహరణల ను కొన్నిటి ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు. ఆయన హిమాచల్ ప్రదేశ్ నుండి నల్ల వెల్లుల్లి, జమ్ము & కశ్మీర్ నుండి డ్రాగన్ ఫ్రూట్, మధ్య ప్రదేశ్ నుండి సోయా పాల పొడి, లద్దాఖ్ నుండి కర్ చీఛూ రకం ఆపిల్స్, పంజాబ్ నుండి కేవెండిశ్ రకం అరటి, జమ్ము నుండి గుచ్చీ రకం పుట్టగొడుగులు మరియు కర్నాటక నుండి ముడి తేనె లను గురించి చెప్పారు.

 

భారతదేశంలో వేగవంతమైన పట్టణీకరణ నేపథ్యంలో రైతులు, అంకుర సంస్థలు,  చిన్న పారిశ్రామికవేత్తలకు ఇప్పటివరకు అన్వేషించని అవకాశాలను కల్పించేలా ప్యాకేజ్డ్ ఫుడ్‌కు పెరుగుతున్న డిమాండ్‌పై ప్రధానమంత్రి ఆలోచనలు పంచుకున్నారు. ఈ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక అవసరమని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. 

ఆహార శుద్ధి రంగంలో భారతదేశం వృద్ధి ప్రస్థానానికి మూడు ప్రధాన స్తంభాలు - చిన్న రైతులు, చిన్న పరిశ్రమలు మరియు మహిళలు అని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. చిన్న రైతుల భాగస్వామ్యాన్ని, వారి లాభాలను పెంచడానికి ఒక వేదికగా రైతు ఉత్పత్తి సంస్థలు లేదా ఎఫ్‌పిఓలను సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. "మనం  భారతదేశంలో 10 వేల కొత్త  ఎఫ్‌పిఓలను ఏర్పాటు చేస్తున్నాము. వాటిలో 7 వేలు ఇప్పటికే సిద్ధమయ్యాయి" అని ఆయన తెలియజేశారు. రైతులకు మార్కెట్ సదుపాయం, ప్రాసెసింగ్ సౌకర్యాల లభ్యత పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. చిన్న తరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో సుమారు 2 లక్షల సూక్ష్మ పరిశ్రమలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. "ఒక జిల్లా ఒక ఉత్పత్తి"- ఓడీఓపి వంటి పథకాలు చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు కూడా కొత్త గుర్తింపును అందిస్తున్నాయి" అని ఆయన అన్నారు. 

భారతదేశంలో మహిళల సారథ్యంలోని అభివృద్ధి పథం వెలుగులతో నిండడాన్ని ప్రధానమంత్రి చెబుతూ... ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న మహిళల సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. తద్వారా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుంది. భారతదేశంలో 9 కోట్ల మందికి పైగా మహిళలు నేడు స్వయం సహాయక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారని ఆయన తెలియజేశారు. భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా మహిళలు ఆహార శాస్త్రంలో అగ్రగామిగా ఉన్నారని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, భారతదేశంలో ఆహార వైవిధ్యం, ఆహారపు రకాలు భారతీయ మహిళల నైపుణ్యాలు, జ్ఞానం ఫలితమని అన్నారు. ఊరగాయలు, పాపడ్‌లు, చిప్స్‌, మురబ్బా వంటి అనేక ఉత్పత్తుల మార్కెట్‌ను మహిళలు తమ ఇళ్ల నుంచే నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. "ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు నాయకత్వం వహించే సహజ సామర్థ్యం భారతీయ మహిళలకు ఉంది", మహిళల కోసం ప్రతి స్థాయిలో కుటీర పరిశ్రమలు, స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తున్నట్లు శ్రీ మోదీ తెలియజేసారు. ఈ కార్యక్రమం సందర్భంగా లక్ష మందికి పైగా మహిళలకు కోటి రూపాయల విలువైన సీడ్ క్యాపిటల్‌ను పంపిణీ చేయడాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. 

 

“భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యం ఎంత ఉందో అంతే ఆహార వైవిధ్యం ఉంది. భారతదేశ ఆహార వైవిధ్యం ప్రపంచంలోని ప్రతి పెట్టుబడిదారునికి డివిడెండ్‌గా నిలుస్తుంది” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశం పట్ల ఉత్సుకత పెరగడాన్ని గమనించిన ప్రధాన మంత్రి, భారతదేశ ఆహార సంప్రదాయాల నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆహార పరిశ్రమ చాలా నేర్చుకోవాలని ఉద్ఘాటించారు. భారతదేశ సుస్థిర ఆహార సంస్కృతి వేల సంవత్సరాల అభివృద్ధి ప్రయాణం ఫలితమని ఆయన అన్నారు. వేల సంవత్సరాలలో భారతదేశ స్థిరమైన ఆహార సంస్కృతి పరిణామంపై మాట్లాడుతూ, భారతదేశ పూర్వీకులు ఆహారపు అలవాట్లను ఆయుర్వేదంతో అనుసంధానించారని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. "ఆయుర్వేదంలో, 'రీతా-భుక్' అని చెప్పబడింది, అంటే సీజన్ ప్రకారం తినడం, 'మిత భుక్' అంటే సమతుల్య ఆహారం, 'హిత భుక్' అంటే ఆరోగ్యకరమైన ఆహారాలు, ఇవి భారతదేశ శాస్త్రీయ అవగాహనలో ముఖ్యమైన భాగాలు" అని ఆయన వివరించారు. ఆహార ధాన్యాల వాణిజ్యం, ముఖ్యంగా భారతదేశం నుండి వచ్చే సుగంధ ద్రవ్యాల వాణిజ్యం ప్రపంచంపై శాశ్వత ప్రభావాన్ని కూడా ఆయన గుర్తించారు. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ గురించి ప్రస్తావిస్తూ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ సుస్థిరమైన, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించిన పురాతన జ్ఞానాన్ని అర్థం చేసుకుని అమలు చేయవలసిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ప్రపంచం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నదని శ్రీ మోదీ అంగీకరించారు. "మిల్లెట్స్ భారతదేశపు 'సూపర్ ఫుడ్ బకెట్'లో ఒక భాగం, ప్రభుత్వం దానిని శ్రీ అన్నగా గుర్తించింది" అని శ్రీ మోదీ అన్నారు. శతాబ్దాలుగా చాలా నాగరికతలలో ఈ చిరుధాన్యాలకు గొప్ప ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, గత కొన్ని దశాబ్దాలలో భారతదేశంతో సహా అనేక దేశాలలో ఆహార అలవాటు నుండి పక్కకు తప్పుకోవడంతో, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యానికి, సుస్థిర వ్యవసాయానికి, అలాగే స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లిందని ప్రధాన మంత్రి సూచించారు.  "భారతదేశం చొరవతో, ప్రపంచంలో చిరుధాన్యాలకు సంబంధించి అవగాహన ప్రచారం ప్రారంభమైంది", అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రభావంతో ప్రపంచంలోని ప్రతి మూలకు మినుములు చేరుకుంటాయన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన జి-20 సదస్సు సందర్భంగా భారత్‌ను సందర్శించే ప్రముఖుల కోసం మిల్లెట్‌లతో తయారు చేసిన వంటకాలతో పాటు మార్కెట్‌లో మినుములతో తయారు చేసిన ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల లభ్యతను ఆయన ప్రస్తావించారు. శ్రీ అన్న వాటాను పెంచే మార్గాలపై చర్చించాలని, పరిశ్రమలకు, రైతులకు మేలు జరిగేలా సామూహిక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రముఖులను కోరారు.

ఢిల్లీ డిక్లరేషన్‌లో జి-20 గ్రూప్ సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత మరియు పౌష్టికాహార భద్రతను ప్రముఖంగా ప్రస్తావించిందని, ఫుడ్ ప్రాసెసింగ్‌తో సంబంధం ఉన్న భాగస్వాములందరి ఆ పాత్రను హైలైట్ చేసిందని శ్రీ మోదీ అన్నారు. ఆహార పంపిణీ కార్యక్రమాన్ని డైవర్సిఫైడ్ ఫుడ్ బాస్కెట్‌గా మార్చాలని, చివరికి పంట తర్వాత నష్టాలను తగ్గించాలని ఆయన నొక్కి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా వృథాను తగ్గించాలని ఆయన నొక్కి చెప్పారు. వృధాను అరికట్టేందుకు, నిల్వకు ఆస్కారం లేని ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ను పెంచాలని, తద్వారా రైతులకు మేలు జరగాలని, ధరల హెచ్చుతగ్గులను నివారించాలని కోరారు. ప్రసంగాన్ని ముగించిన ప్రధాన మంత్రి, రైతుల ప్రయోజనాలకు మరియు వినియోగదారుల సంతృప్తికి మధ్య సమతూకం పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇక్కడ చేసే  తీర్మానాలు ప్రపంచానికి స్థిరమైన,  ఆహార-భద్రతతో కూడిన భవిష్యత్తుకు పునాది వేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

 

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,  ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పశుపతి కుమార్ పరాస్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ సహాయ మంత్రి శ్రీ. పర్షోత్తం రూపాలా, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

నేపథ్యం: 

స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసేందుకు, లక్ష మందికి పైగా ఎస్ హెచ్ జీ సభ్యులకు ప్రధాన మంత్రి సీడ్ క్యాపిటల్ సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ మద్దతు మెరుగైన ప్యాకేజింగ్, నాణ్యమైన తయారీ ద్వారా మార్కెట్లో మెరుగైన ధరల వాస్తవికతను పొందేందుకు  ఎస్ హెచ్ జీ లకు సహాయం చేస్తుంది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023లో భాగంగా ఫుడ్ స్ట్రీట్‌ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇందులో ప్రాంతీయ వంటకాలు, రాచరిక వారసత్వ వంటకాలు ఉన్నాయి. ఇందులో 200 మందికి పైగా చెఫ్‌లు పాల్గొని సాంప్రదాయ భారతీయ వంటకాలను చేస్తారు.  ఇది ఒక ప్రత్యేకమైన పాక శాస్త్ర అనుభవంగా గోచరించింది. 

ఈ కార్యక్రమం భారతదేశాన్ని 'ప్రపంచ ఆహార బాస్కెట్'గా ప్రదర్శించడం, 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ నిపుణులు, రైతులు, వ్యవస్థాపకులు, ఇతర వాటాదారులకు చర్చలలో పాల్గొనడానికి, భాగస్వామ్యాలను స్థాపించడానికి, వ్యవసాయ-ఆహార రంగంలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి నెట్‌వర్కింగ్, వ్యాపార వేదికను అందిస్తుంది. సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశాలు,  పెట్టుబడి, సులభ తర వాణిజ్యంపై దృష్టి పెడతాయి. 

 

భారతీయ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ ఆవిష్కరణ, సామర్థ్యాలను ప్రదర్శించడానికి వివిధ పెవిలియన్లు ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోని వివిధ అంశాలపై దృష్టి సారించే 48 సెషన్‌లను నిర్వహిస్తున్నారు. ఆర్థిక సాధికారత, నాణ్యత హామీ, యంత్రాలు,  సాంకేతికతలో ఆవిష్కరణలను నొక్కి చెబుతుంది.

ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల సీఈఓలతో సహా 80కి పైగా దేశాల నుండి పాల్గొనేవారికి ఈ ఈవెంట్ ఆతిథ్యం ఇస్తోంది.1200 మంది విదేశీ కొనుగోలుదారులతో రివర్స్ కొనుగోలుదారు సెల్లర్ మీట్‌ను కూడా కలిగి ఉంటుంది. నెదర్లాండ్స్ భాగస్వామ్య దేశంగా ఉండగా, జపాన్ ఈవెంట్ ఫోకస్ కంట్రీగా ఉంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Indian Air Force’s Made-in-India Samar-II to shield India’s skies against threats from enemies

Media Coverage

Indian Air Force’s Made-in-India Samar-II to shield India’s skies against threats from enemies
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The Ashwamedha Yagya organized by the Gayatri Parivar has become a grand social campaign: PM Modi
February 25, 2024
"The Ashwamedha Yagya organized by the Gayatri Parivar has become a grand social campaign"
"Integration with larger national and global initiatives will keep youth clear of small problems"
“For building a substance-free India, it is imperative for families to be strong as institutions”
“A motivated youth cannot turn towards substance abuse"

गायत्री परिवार के सभी उपासक, सभी समाजसेवी

उपस्थित साधक साथियों,

देवियों और सज्जनों,

गायत्री परिवार का कोई भी आयोजन इतनी पवित्रता से जुड़ा होता है, कि उसमें शामिल होना अपने आप में सौभाग्य की बात होती है। मुझे खुशी है कि मैं आज देव संस्कृति विश्वविद्यालय द्वारा आयोजित अश्वमेध यज्ञ का हिस्सा बन रहा हूँ। जब मुझे गायत्री परिवार की तरफ से इस अश्वमेध यज्ञ में शामिल होने का निमंत्रण मिला था, तो समय अभाव के साथ ही मेरे सामने एक दुविधा भी थी। वीडियो के माध्यम से भी इस कार्यक्रम से जुड़ने पर एक समस्या ये थी कि सामान्य मानवी, अश्वमेध यज्ञ को सत्ता के विस्तार से जोड़कर देखता है। आजकल चुनाव के इन दिनों में स्वाभाविक है कि अश्वमेध यज्ञ के कुछ और भी मतलब निकाले जाते। लेकिन फिर मैंने देखा कि ये अश्वमेध यज्ञ, आचार्य श्रीराम शर्मा की भावनाओं को आगे बढ़ा रहा है, अश्वमेध यज्ञ के एक नए अर्थ को प्रतिस्थापित कर रहा है, तो मेरी सारी दुविधा दूर हो गई।

आज गायत्री परिवार का अश्वमेध यज्ञ, सामाजिक संकल्प का एक महा-अभियान बन चुका है। इस अभियान से जो लाखों युवा नशे और व्यसन की कैद से बचेंगे, उनकी वो असीम ऊर्जा राष्ट्र निर्माण के काम में आएगी। युवा ही हमारे राष्ट्र का भविष्य हैं। युवाओं का निर्माण ही राष्ट्र के भविष्य का निर्माण है। उनके कंधों पर ही इस अमृतकाल में भारत को विकसित बनाने की जिम्मेदारी है। मैं इस यज्ञ के लिए गायत्री परिवार को हृदय से शुभकामनाएँ देता हूँ। मैं तो स्वयं भी गायत्री परिवार के सैकड़ों सदस्यों को व्यक्तिगत रूप से जानता हूं। आप सभी भक्ति भाव से, समाज को सशक्त करने में जुटे हैं। श्रीराम शर्मा जी के तर्क, उनके तथ्य, बुराइयों के खिलाफ लड़ने का उनका साहस, व्यक्तिगत जीवन की शुचिता, सबको प्रेरित करने वाली रही है। आप जिस तरह आचार्य श्रीराम शर्मा जी और माता भगवती जी के संकल्पों को आगे बढ़ा रहे हैं, ये वास्तव में सराहनीय है।

साथियों,

नशा एक ऐसी लत होती है जिस पर काबू नहीं पाया गया तो वो उस व्यक्ति का पूरा जीवन तबाह कर देती है। इससे समाज का, देश का बहुत बड़ा नुकसान होता है।इसलिए ही हमारी सरकार ने 3-4 साल पहले एक राष्ट्रव्यापी नशा मुक्त भारत अभियान की शुरूआत की थी। मैं अपने मन की बात कार्यक्रम में भी इस विषय को उठाता रहा हूं। अब तक भारत सरकार के इस अभियान से 11 करोड़ से ज्यादा लोग जुड़ चुके हैं। लोगों को जागरूक करने के लिए बाइक रैलियां निकाली गई हैं, शपथ कार्यक्रम हुए हैं, नुक्कड़ नाटक हुए हैं। सरकार के साथ इस अभियान से सामाजिक संगठनों और धार्मिक संस्थाओं को भी जोड़ा गया है। गायत्री परिवार तो खुद इस अभियान में सरकार के साथ सहभागी है। कोशिश यही है कि नशे के खिलाफ संदेश देश के कोने-कोने में पहुंचे। हमने देखा है,अगर कहीं सूखी घास के ढेर में आग लगी हो तो कोई उस पर पानी फेंकता है, कई मिट्टी फेंकता है। ज्यादा समझदार व्यक्ति, सूखी घास के उस ढेर में, आग से बची घास को दूर हटाने का प्रयास करता है। आज के इस समय में गायत्री परिवार का ये अश्वमेध यज्ञ, इसी भावना को समर्पित है। हमें अपने युवाओं को नशे से बचाना भी है और जिन्हें नशे की लत लग चुकी है, उन्हें नशे की गिरफ्त से छुड़ाना भी है।

साथियों,

हम अपने देश के युवा को जितना ज्यादा बड़े लक्ष्यों से जोड़ेंगे, उतना ही वो छोटी-छोटी गलतियों से बचेंगे। आज देश विकसित भारत के लक्ष्य पर काम कर रहा है, आज देश आत्मनिर्भर होने के लक्ष्य पर काम कर रहा है। आपने देखा है, भारत की अध्यक्षता में G-20 समिट का आयोजन 'One Earth, One Family, One Future' की थीम पर हुआ है। आज दुनिया 'One sun, one world, one grid' जैसे साझा प्रोजेक्ट्स पर काम करने के लिए तैयार हुई है। 'One world, one health' जैसे मिशन आज हमारी साझी मानवीय संवेदनाओं और संकल्पों के गवाह बन रहे हैं। ऐसे राष्ट्रीय और वैश्विक अभियानों में हम जितना ज्यादा देश के युवाओं को जोड़ेंगे, उतना ही युवा किसी गलत रास्ते पर चलने से बचेंगे। आज सरकार स्पोर्ट्स को इतना बढ़ावा दे रही है..आज सरकार साइंस एंड रिसर्च को इतना बढ़ावा दे रही है... आपने देखा है कि चंद्रयान की सफलता ने कैसे युवाओं में टेक्नोलॉजी के लिए नया क्रेज पैदा कर दिया है...ऐसे हर प्रयास, ऐसे हर अभियान, देश के युवाओं को अपनी ऊर्जा सही दिशा में लगाने के लिए प्रेरित करते हैं। फिट इंडिया मूवमेंट हो....खेलो इंडिया प्रतियोगिता हो....ये प्रयास, ये अभियान, देश के युवा को मोटीवेट करते हैं। और एक मोटिवेटेड युवा, नशे की तरफ नहीं मुड़ सकता। देश की युवा शक्ति का पूरा लाभ उठाने के लिए सरकार ने भी मेरा युवा भारत नाम से बहुत बड़ा संगठन बनाया है। सिर्फ 3 महीने में ही इस संगठन से करीब-करीब डेढ़ करोड़ युवा जुड़ चुके हैं। इससे विकसित भारत का सपना साकार करने में युवा शक्ति का सही उपयोग हो पाएगा।

साथियों,

देश को नशे की इस समस्या से मुक्ति दिलाने में बहुत बड़ी भूमिका...परिवार की भी है, हमारे पारिवारिक मूल्यों की भी है। हम नशा मुक्ति को टुकड़ों में नहीं देख सकते। जब एक संस्था के तौर पर परिवार कमजोर पड़ता है, जब परिवार के मूल्यों में गिरावट आती है, तो इसका प्रभाव हर तरफ नजर आता है। जब परिवार की सामूहिक भावना में कमी आती है... जब परिवार के लोग कई-कई दिनों तक एक दूसरे के साथ मिलते नहीं हैं, साथ बैठते नहीं हैं...जब वो अपना सुख-दुख नहीं बांटते... तो इस तरह के खतरे और बढ़ जाते हैं। परिवार का हर सदस्य अपने-अपने मोबाइल में ही जुटा रहेगा तो फिर उसकी अपनी दुनिया बहुत छोटी होती चली जाएगी।इसलिए देश को नशामुक्त बनाने के लिए एक संस्था के तौर पर परिवार का मजबूत होना, उतना ही आवश्यक है।

साथियों,

राम मंदिर प्राण प्रतिष्ठा समारोह के समय मैंने कहा था कि अब भारत की एक हजार वर्षों की नई यात्रा शुरू हो रही है। आज आजादी के अमृतकाल में हम उस नए युग की आहट देख रहे हैं। मुझे विश्वास है कि, व्यक्ति निर्माण से राष्ट्र निर्माण के इस महाअभियान में हम जरूर सफल होंगे। इसी संकल्प के साथ, एक बार फिर गायत्री परिवार को बहुत-बहुत शुभकामनाएं।

आप सभी का बहुत बहुत धन्यवाद!