16 అటల్ అవాసీయ విద్యాలయాలను ప్రారంభం
"కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ వంటి కార్యక్రమాలు ఈ పురాతన నగరం సాంస్కృతిక చైతన్యాన్ని బలోపేతం చేస్తాయి"
మహాదేవుని ఆశీస్సులతో, కాశీ అపూర్వమైన అభివృద్ధి కోణాలలో సాక్షాత్కరిస్తోంది”
"కాశీ, సంస్కృతి ఒకే శక్తి కి రెండు పేర్లు"
“కాశీలోని ప్రతి మూల సంగీత స్రవంతితో తరిస్తోంది, అన్నింటికంటే, ఇది నటరాజ్ నగరం
"2014లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఊహించిన కాశీ అభివృద్ధి, వారసత్వ కల ఇప్పుడు మెల్లగా నెరవేరుతోంది"
"వారణాసి శతాబ్దాలుగా అభ్యాస కేంద్రంగా ఉంది, దీనికి అన్నింటిని కలుపుకొని పోయే స్ఫూర్తి"
"కాశీలో టూరిస్ట్ గైడ్‌ల సంస్కృతి అభివృద్ధి చెందాలని, కాశీకి చెందిన టూరిస్ట్ గైడ్‌లు ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను"

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా  దాదాపు రూ.1115 కోట్ల‌తో నిర్మించిన 16 అట‌ల్ అవ‌సియా విద్యాల‌యాలను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. కాశీ సంసద్ ఖేల్ ప్రతియోగిత నమోదు కోసం పోర్టల్‌ను కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముందు అట‌ల్ అవ‌సియా విద్యాల‌యాల విద్యార్థుల‌తో కూడా ప్ర‌ధాన మంత్రి సంభాషించారు.

 

మహాదేవుని ఆశీస్సులతో కాశీ పట్ల గౌరవం నిరంతరం పెరుగుతోందని, నగరానికి సంబంధించిన విధానాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని సభను ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు. జి20 సమ్మిట్ విజయవంతం కావడానికి కాశీ చేసిన సేవలను ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. నగరాన్ని సందర్శించిన వారు కాశీ సేవ, రుచులు, సంస్కృతి, సంగీతాన్ని తమతో తిరిగి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. మహాదేవుని ఆశీర్వాదం వల్లే జి20 సదస్సు విజయవంతం అయ్యిందని ఆయన అన్నారు.

మహాదేవుని ఆశీస్సులతో కాశీ అపూర్వమైన అభివృద్ధిని సాధిస్తోందని అన్నారు. వారణాసిలో ఈరోజు శంకుస్థాపన చేసిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, 16 అటల్ రెసిడెన్షియల్ పాఠశాలల అంకితం గురించి మాట్లాడుతూ, కాశీ, ఉత్తరప్రదేశ్ ప్రజలకు, శ్రామిక కుటుంబాలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

2014 నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా కాశీ అభివృద్ధి చేయాల‌న్న త‌న ప్రయత్నం ఎట్ట‌కేల‌కు సాకార‌మౌతోంద‌ని ప్ర‌ధాన మంత్రి ఉద్ఘాటించారు. కాశీ సాంస్కృతిక మహోత్సవ్‌లో విస్తృతంగా పాల్గొనడాన్ని ఆయన అభినందించారు. ఈ ప్రాంతంలోని వివిధ ప్రతిభావంతులతో కనెక్ట్ అయ్యే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది మహోత్సవ్ మొదటి ఎడిషన్ మాత్రమే అని పేర్కొన్న ప్రధాన మంత్రి, సుమారు 40,000 మంది కళాకారులు పాల్గొన్నారని, లక్షలాది మంది సందర్శకులు వేదికను చూసేందుకు తరలివచ్చారని తెలియజేశారు. సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ ప్రజల మద్దతుతో రాబోయే కాలంలో కాశీ తన కంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులకు కాశీ కేంద్రంగా మారుతోందని ప్రధాన మంత్రి అన్నారు. 

 

కాశీ, సంస్కృతి ఒకే శక్తికి ఉన్న రెండు పేర్లని, భారతదేశ సాంస్కృతిక రాజధానిగా కాశీకి ప్రత్యేకత ఉందని శ్రీ మోదీ అన్నారు. నగరంలోని ప్రతి మూలలో సంగీత స్రవంతి సాగుతోందని,  ఇది నటరాజ్ నగరమని ఆయన అన్నారు. మహాదేవ్ అన్ని కళారూపాలకు మూలం అని గుర్తించిన ప్రధాన మంత్రి, ఈ కళలను భరత ముని వంటి ప్రాచీన ఋషులు అభివృద్ధి చేసి, ఒక వ్యవస్థగా మార్చారని అన్నారు. స్థానిక పండుగలు, వేడుకలను ఉదహరిస్తూ, కాశీ అంతా సంగీతం మరియు కళలతో నిండి ఉందని ప్రధాని అన్నారు.

నగరంఅద్భుతమైన శాస్త్రీయ సంగీత సంస్కృతిని, ప్రాంతీయ పాటలను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ నగరం తబలా, షెహనాయి, సితార్, సారంగి, వీణ వంటి సంగీత వాయిద్యాల సమ్మేళనమని పేర్కొన్నారు. వారణాసి శతాబ్దాలుగా ఖ్యాల్, థుమ్రీ, దాద్రా, చైతీ, కజ్రీ సంగీత రీతులను అలాగే తరతరాలుగా సజీవంగా ఉంచిన గురు-శిష్య సంప్రదాయాన్ని కాపాడిందని ఆయన నొక్కిచెప్పారు. తెలియా ఘరానా, పియారీ ఘరానా, రామపుర కబీరచౌరా ముహల్లా సంగీత విద్వాంసుల గురించి కూడా ప్రస్తావించిన ప్రధాని, వారణాసి సంగీతరంగంలో ఎంతో మంది మహానుభావులను అందించిందని, ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసుకున్నదని అన్నారు. వారణాసి నుండి అనేక మంది గొప్ప సంగీత విద్వాంసులతో సంభాషించే అవకాశం లభించినందుకు కూడా ప్రధాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈరోజు ప్రారంభించిన కాశీ సంసద్ ఖేల్ ప్రతియోగిత పోర్టల్‌ను ప్రస్తావిస్తూ, ఖేల్ ప్రత్యోగితా లేదా కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ అయినా కాశీలో ఇది కొత్త సంప్రదాయాలకు నాంది మాత్రమే అని ప్రధాని అన్నారు. ఇప్పుడు కాశీ సంసద్ జ్ఞాన  ప్రత్యోగితా  కూడా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. "కాశీ సంస్కృతి, వంటకాలు, కళల గురించి అవగాహన పెంచుకోవడమే ప్రయత్నం" అని ఆయన అన్నారు. "కాశీ సంసద్ జ్ఞాన  ప్రత్యోగితా వివిధ స్థాయిలలో కాశీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నిర్వహిస్తారు."

కాశీ గురించి నగర ప్రజలు అత్యంత అవగాహన కలిగి ఉన్నారని, ప్రతి నివాసి కాశీకి నిజమైన బ్రాండ్ అంబాసిడర్ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ జ్ఞానాన్ని సరిగ్గా తెలియజేయడానికి వారిని సన్నద్ధం చేయడానికి, నగరాన్ని సరిగ్గా వివరించగల నాణ్యమైన టూరిస్ట్ గైడ్‌ల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాన మంత్రి ప్రతిపాదించారు. ఇందుకోసం కాశీ సంసద్ టూరిస్ట్ గైడ్ పోటీలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. “నా కాశీ గురించి ప్రపంచం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.  కాశీకి చెందిన టూరిస్ట్ గైడ్‌లు ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను” అని ఆయన అన్నారు.

 

సంస్కృతం నేర్చుకునేందుకు ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది పండితులు కాశీని సందర్శిస్తున్నారని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, ఈ నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని 1100 కోట్ల రూపాయల వ్యయంతో అటల్ అవాసీయ విద్యాలయాలను ఈ రోజు ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. శ్రామికులతో సహా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఈ పాఠశాలలను ప్రారంభించినట్లు ఆయన ఉద్ఘాటించారు. “కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలను జీరో ఫీజుతో ఈ పాఠశాలల్లో చేర్చుకుంటారు” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. సాధారణ కోర్సులే కాకుండా సంగీతం, కళలు, క్రాఫ్ట్‌లు, సాంకేతికత, క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను కూడా అందుబాటులోకి తెస్తామని హైలైట్‌ చేశారు. గిరిజన సమాజం కోసం 1 లక్ష ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ''కొత్త విద్యా విధానంతో ప్రభుత్వం ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. పాఠశాలలు ఆధునికమవుతున్నాయి మరియు తరగతులు స్మార్ట్‌గా మారుతున్నాయి” అని ఆయన అన్నారు. ఆధునిక సాంకేతికత సహాయంతో దేశంలోని వేలాది పాఠశాలలను ఆధునీకరించాలన్న ప్రధాన మంత్రి ప్రధానాకర్షణగా ఉంది. 

 

నగరం కోసం తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలలో కహ్సీ ప్రజల పూర్తి సహకారాన్ని ప్రధాన మంత్రి గుర్తించారు.

వలస కార్మికుల పిల్లల సంరక్షణ కోసం అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ, అనేక రాష్ట్రాలు ఎన్నికల అవకాశవాద ప్రయోజనాల కోసం ఈ నిధులను ఉపయోగించాయని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి జీ ఆధ్వర్యంలో పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించారని శ్రీ మోదీ అన్నారు. సమాజంలోని పేద వర్గాల నుండి. రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థుల విశ్వాసాన్ని ప్రధాని ప్రశంసించారు. "నా మాటలను గుర్తించండి, రాబోయే 10 సంవత్సరాలలో ఈ పాఠశాలల నుండి కాశీ వైభవం బయటకు వస్తుందని మీరు చూస్తారు" అని ఆయన ముగించారు.

ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్  మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Positive consumer sentiments drive automobile dispatches up 12% in 2024: SIAM

Media Coverage

Positive consumer sentiments drive automobile dispatches up 12% in 2024: SIAM
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 జనవరి 2025
January 15, 2025

Appreciation for PM Modi’s Efforts to Ensure Country’s Development Coupled with Civilizational Connect