సికందరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి లో నిర్వహిస్తున్నటువంటి ‘‘హెల్దీ బేబీ శో’’ ప్రచార ఉద్యమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సంస్కృతి, పర్యటన మరియు తూర్పు ప్రాంతాల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి చేసిన పలు ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందించారు. మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తన ట్వీట్ లలో సికందరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని ప్రతి బస్తీ లోను, ప్రతి కాలనీ లోను మరియు సొసైటీ లోను ‘‘హెల్దీ బేబీ శో’’ కు గాను నమోదు ఫారాలను ఇవ్వడం తో ఈ కార్యక్రమం ఆరంభం అయిందని తెలిపారు. ఆరోగ్యవంతులైన బాలల ను మరియు వారి కుటుంబాల ను సర్టిఫికెట్ ల తో, ఇంకా ‘పోషణ్ కిట్ స్’ తో సమ్మానించడం జరుగుతుంది అని కూడా శ్రీ కిషన్ రెడ్డి వెల్లడించారు.
కేంద్ర మంత్రి చేసిన పలు ట్వీట్ ల కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ ఒక ట్వీట్ లో -
‘‘ఇది చెప్పుకోదగినటువంటి ప్రయాస. దీని వల్ల బాలల కు ఎంతో మేలు జరుగుతుంది.’’ అని పేర్కొన్నారు.
This is a noteworthy effort, which will greatly benefit children. https://t.co/qC1LUbArRc
— Narendra Modi (@narendramodi) February 24, 2023


