హుకుంచంద్ మిల్ వర్కర్లకు బకాయిలకు సంబంధించిన చెక్కులను అందజేసిన ప్రధానమంత్రి.
ఖర్గాంవ్ జిల్లాలో 60 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటుకు శంకు స్థాపన చేసిన ప్రధానమంత్రి.
‘‘“శ్రామికుల దీవెనలు, ప్రేమ ప్రభావం ఎంతటిదో నాకు తెలుసు”
“పేదలు, అణగారిన వర్గాల వారికి గౌరవం కల్పించడం మా ప్రాధాన్యత. సాధికారత కలిగిన శ్రామికులు సుసంపన్న భారతావనికి తోడ్పడగలరన్నది మా లక్ష్యం”
స్వచ్ఛత,రుచికరమైన వంటకాలకు ఇండోర్ పెట్టింది పేరు
ఇటీవల ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు రాష్ట్రప్కభుత్వం కృషిచేస్తోంది.
‘మోడీ కీ గ్యారంటీ ద్వారా పూర్తి ప్రయోజనం పొందాల్సిందిగా నేను మధ్యప్రదేశ్ ప్రజలను కోరుతున్నాను.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ‘ మజ్దూరోంకా హిత్  మజ్దూరోంకా సమర్పిత్  కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి, హుకుంచంద్ మిల్ వర్కర్ల బకాయిలకు సంబంధించి 224 కోట్ల రూపాయల బకాయిల చెక్కును అఫిషియల్ లిక్విడేటర్కు ,ఇండోర్ లోని  హుకుం చంద్ మిల్  లేబర్యూనియన్ నాయకులకు అందజేశారు. హుకుం చంద్ మిల్ వర్కర్లు ఎంతోకాలంగా చేస్తున్న డిమాండ్లను దీనితో పరిష్కరించినట్టు అయింది.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖర్గోం జిల్లాలో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటుకు కూడా శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, సంవత్సరాలుగా శ్రామికులు కన్న కలలు, చెప్పుకున్న సంకల్పాలు సాకారం చేసుకుంటున్న రోజని అన్నారు. మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుందడడంపట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి పాల్గొన్న తొలి కార్యక్రమం ఇది. కొత్త ప్రభుత్వం శ్రామికులకు, పేదలకు అంకితమై పనిచేస్తోంది.  

శ్రామికులు, మధ్యప్రదేశ్ లో కొత్తగా ఎన్నికైన డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి తమ ఆశీస్సులు అందించగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. శ్రామికుల ప్రేమ, దీవెనల ప్రభావం ఎలా ఉంటుందో తనకు తెలుసునని ప్రధానమంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్త బృందం,  రాగల కొద్ది సంవత్సరాలలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.

 

ప్రస్తుతం నిర్వహించిన కార్యక్రమం, ఇండోర్ లోని శ్రామికులకు ప్రస్తుత పండగ సీజన్లో మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చినట్టు ప్రధానమంత్రి తెలిపారు.మధ్యప్రదేశ్తో అటల్జీకిగల అనుబంధం గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అటల్జీ జయంతి రోజున సుపరిపాలనా దినోత్సవం జరుపుకుంటున్నట్టు కూడా ప్రధానమంత్రి గుర్తుచేశారు. 224 కోట్ల రూపాయలు శ్రామికులకు బదిలీ చేయడం వల్ల వారికి ఉజ్వల భవిష్యత్తు ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈరోజు ను శ్రామికులు, శ్రామికులకు న్యాయం జరిగిన రోజుగా గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. శ్రామికుల సహనం, వారి శ్రమను ప్రధానమంత్రి ప్రత్యేకంగా కొనియాడారు.

 

ప్రధానమంత్రి తన నాలుగు నినాదాలైన పేదలు, యువత, మహిళలు, రైతులగురించి ప్రస్తావిస్తూ, సమాజంలోని పేదల అభ్యున్నతికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు. ‘‘పేదలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం మా ప్రాధాన్యత, సాధికారత కలిగిన శ్రామికులు సుసంపన్న భారతావనికి తోడ్పాటు నందించేలా చేయడం మన లక్ష్యం అని ప్రధానమంత్రి అన్నారు.

 

పారిశుధ్యంలో, రుచికరమైన వంటకాల విషయంలో ఇండోర్ అత్యున్నత స్థానంలో ఉన్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండోర్ పారిశ్రామిక ప్రగతిలో టెక్స్టైల్ పరిశ్రమ పాత్ర గురించి కూడా ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కోన్నారు. మహారాజా తుకోజీరావ్ క్లాత్మార్కెట్, హోల్కర్ లు ఇండోర్ లో ఏర్పాటు చేసిన తొలి కాటన్ మిల్లు, మాల్వా కాటన్ ప్రత్యేకతల గురించి ప్రధానమంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావించారు. అది ఇండోర్ టెక్స్టైల్స్ కు సువర్ణకాలమని ప్రధానమంత్రి కొనియాడారు. గత ప్రభుత్వాలు ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన డబుల్ ఇంజిన్ సర్కారుతో పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.భోసాలఖ–ఇండోర్ లమధ్య  పెట్టుబడి కారిడార్ నిర్మాణం, ఇండోర్ పిథాంపూర్ ఎకనమిక్ కారిడార్ ఏర్పాటు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, విక్రమ్ ఉద్యోగ్పురిలో మెడికల్ డివైసెస్ పార్కు, ధార్లో పి.ఎం.మిత్రా పార్క్, వంటి ప్రాజెక్టులు ఉద్యోగాలు కల్పిస్తాయని, ఆర్ధిక విస్తరణకు తోడ్పడతాయని తెలిపారు. 

 

మధ్యప్రదేశ్ సహజసౌందర్యం, సాంస్కృతిక వారతస్వం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రాష్ట్ంలో ఇండోర్ తో సహా పలు పట్టణాలు, అభివృద్ధికి , ప్రకృతికి మధ్య సమతూకం సాధించేందుకు ఉదాహరణగా నిలిచాయన్నారు. ఆసియాలోనే అతిపెద్ద గోవర్ధన్ ప్లాంట్ కార్యరూపం దాల్చడం, ఈవి చార్జింగ్ మౌలికసదుపాయాలు నగరంలో అభివృద్ధి చెందడం వంటి వాటిని ఆయన గుర్తుచేశారు. ఖర్గాం జిల్లాలో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన విషయం గురించి మాట్లాడారు.దీనివల్ల నాలుగు కోట్ల రూపాయల మేరకు విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయన్నారు. ప్లాంట్ కోసం,  గ్రీన్ బాండ్ల వినియోగం గురించి మాట్లాడుతూ, ఇది ప్రకృతిని కాపాడడంలో ప్రజల భాగస్వామ్యానికి వీలు కల్పిస్తుందన్నారు.

 

 

ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్రప్రభుత్వం కృషిచ చేస్తున్నట్టు ప్రధానమంత్రి   తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ చేరేవిధంగా చూసేందుకువికసిత్ భారత్ సంకల్ప యాత్ర మధ్యప్రదేశ్లోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళుతున్నదని చెప్పారు. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళికారణంగా వికసిత్ భారత్ యత్రలో కొంత జాప్యం జరిగినప్పటికీ, ఈ యాత్ర ఇప్పటికే 600 కార్యక్రమాలు నిర్వహించింది. ఇది లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చింది.““‘’ “మోడీకీ గ్యారంటీ వాహనం ద్వారా పూర్తిస్థాయి ప్రయోజనం పొందాల్సిందిగా  మధ్యప్రదేశ్ ప్రజలను కోరుతున్నాను. ” అని ప్రధానమంత్రి అన్నారు. 

తన ప్రసంగాన్ని ముగిస్తూ ప్రధానమంత్రి, శ్రామికుల ముఖాలపై చిరునవ్వులు, శ్రామికులు వేసిన పూలమాలల నుంచి వస్తున్న పరిమళాలు సమాజ ప్రయోజనానికి మరింత గా కృషిచేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

నేపథ్యం:

 

ఇండోర్లోని హుకుంచంద్ మిల్లు 1992లో మూతపడిన తర్వాత, ఆ మిల్లు కార్మికులు తమకు రావలసిన బకాయిల కోసం సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. ఇది ఆ తర్వాత లిక్విడేషన్కు వెళ్లింది. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో సానుకూల పాత్ర పోషించింది. కోర్టులు, లేబర్ యూనియన్లు, మిల్లు వర్కర్లు , ఇతర స్టేక్ హోల్డర్లకు సంతృప్తి కరమైన రీతిలో సంప్రదింపులు జరిపి సానుకూల పరిష్కారం సాధించింది.  ఈ పరిష్కార పాకేజ్ కింద, మధ్యప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల బకాయిలను చెల్లిస్తుంది. ఇందుకు మిల్లు భూమిని ప్రభుత్వం సేకరిస్తుంది. దీనిని నివాస, వాణిజ్య ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తుంది.

ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి 60 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. దీనిని ఖర్గాం జిల్లా సమ్రాజ్, అషుఖేడి గ్రామాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ దీనిని ఏర్పాటు చేస్తోంది.  దీనిని 308 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. కొత్త సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుతో ఇండోర్ ము నిసిపల్ కార్పొరేషన్కు నెలకు సుమారు 4 కోట్ల రూపాయల మేరకు విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయి. సౌర విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి, ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ 244 కోట్ల రూపాయల మేరకు గ్రీన్ బాండ్లను విడుదల చేసింది. దేశంలో తొలిసారిగా గ్రీన్ బాండ్లను జారీ చేసిన నగరపాలక సంస్థగా ఇండోర్ నిలిచింది. 29 రాష్ట్రాలు ఈ బాండ్లకు సబ్స్క్రయిబ్ చేశాయి. వీటి విలువ 720 కోట్ల రూపాయల వరకు ఉంది. అంటే తొలుత వాటి జారీ విలువ కంటే ఇది మూడురెట్లు అధికం.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India among the few vibrant democracies across world, says White House

Media Coverage

India among the few vibrant democracies across world, says White House
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 మే 2024
May 18, 2024

India’s Holistic Growth under the leadership of PM Modi