"ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన 9 లక్షల మందికి పైగా విద్యార్థుల స్కిల్ స్నాతకోత్సవం సందర్భంగా నేడు చరిత్ర సృష్టించబడింది"
"విశ్వకర్మ జయంతి అనేది నిజమైన అర్థంలో కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తి గౌరవం, ఇది శ్రమ దినం"
"భారతదేశంలో, శ్రామికుడి నైపుణ్యాలలో భగవంతుడి చిత్రణను మనం ఎల్లప్పుడూ చూశాము, అవి విశ్వకర్మ రూపంలో కనిపిస్తాయి"
"దీనిని భారతదేశ శతాబ్దంగా మార్చడానికి, భారతదేశంలోని యువత విద్యతో పాటు సమానంగా నైపుణ్యం కలిగి ఉండటం చాలా ముఖ్యం’’
‘’ఐటిఐల నుండి సాంకేతిక శిక్షణ పొందిన యువతను సైన్యంలో రిక్రూట్ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు"
"ఇందులో ఐటిఐల పాత్ర చాలా ముఖ్యమైనది, మన యువత ఈ అవకాశాల లో చాలా వాటిని సద్వినియోగం చేసుకోవాలి"
"భారతదేశం నైపుణ్యాలలో నాణ్యతను కలిగి ఉంది, వైవిధ్యాన్ని కూడా కలిగి ఉంది"
" యువత విద్య , నైపుణ్యం కూడా కలిగి ఉన్నప్పుడు, వారిలో ఆత్మవిశ్వాసం దానికదే పెరుగుతుంది"
"మారుతున్న ప్రపంచ పరిస్థితులలో, భారతదేశంపై ప్రపంచం విశ్వాసం’’
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లోని విద్యార్థుల ను ఉద్దేశించి మొట్ట మొదటి కౌశల్ దీక్షాంత్ సమారోహ్ లో వీడియో సందేశం ద్వారా ప్రmసంగించారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లోని విద్యార్థుల ను ఉద్దేశించి మొట్ట మొదటి కౌశల్ దీక్షాంత్ సమారోహ్  లో వీడియో సందేశం ద్వారా ప్రmసంగించారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు.

సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి

ప్రసంగిస్తూ, 21వ శ తాబ్దంలో భారత దేశం పురోగ తి సాధిస్తున్నప్పుడు, పారిశ్రామిక శిక్షణ సంస్థ కు చెందిన 9 లక్షల మందికి పైగా విద్యార్థుల స్కిల్ స్నాతకోత్స వం సందర్భంగా ఈ రోజు చ రిత్ర సృష్టించడం జరిగిందని, 40 లక్ష ల మందికి పైగా విద్యార్థులు మనతో

వర్చువల్ గా కలిసి ఉన్నారని అన్నారు. విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా విద్యార్థులు తమ నైపుణ్యాలతో ఆవిష్కరణ బాట లో తొలి అడుగు వేస్తున్నారని ప్ర ధాన మంత్రి పేర్కొన్నారు. "మీ ప్రారంభం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, రేపటికి మీ ప్రయాణం కూడా మరింత సృజనాత్మకంగా ఉంటుందని నేను నమ్మకంగా చెప్పగలను" అని ఆయన అన్నారు.

విశ్వకర్మ జయంతి గురించి ప్రధాన మంత్రి

వివరిస్తూ, ఇది గౌరవ ,నైపుణ్యాల ప్రతిష్ఠకు సంబంధించిన పండుగ అని అన్నారు.

ఒక శిల్పి దేవుడి విగ్రహాన్ని తయారు చేయడాన్ని సాదృశ్యంగా చిత్రీకరిస్తూ, ఈ రోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా విద్యార్థుల నైపుణ్యాలను గౌరవించడం , గుర్తించడం మనందరికీ గర్వకారణమని ప్రధాని అన్నారు.

"విశ్వకర్మ జయంతి అనేది నిజమైన అర్థంలో కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తి గౌరవం, ఇది శ్రమ దినం" అని  అంటూ,  "భారతదేశంలో, శ్రామికుడి నైపుణ్యంలో భగవంతుడి రూపాన్ని మనం ఎల్లప్పుడూ చూశాము, వారు విశ్వకర్మ రూపంలో కనిపిస్తారు. వారు కలిగి ఉన్న నైపుణ్యంలో ఎక్కడో ఒక చోట దేవుని రూప రేఖ ఉంటుంది.  విశ్వకర్మకు ఈ కార్యక్రమం  'కౌశలాంజలి' వంటి ఒక భావోద్వేగ నివాళి లాంటిదని నేను భావిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

గత ఎనిమిదేళ్ళలో ప్రభుత్వం సాధించిన

విజయాలను ప్ర ధాన మంత్రి ప్రస్తావిస్తూ,

విశ్వకర్మ స్ఫూర్తితో భారత దేశం కొత్త పథకాల ను ప్రారంభించిందని, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ' శ్రమ ఏవ జయతే' అనే సంప్రదాయాన్ని పునరుద్ధరించేందుకు

ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి అన్నారు."ఈ శతాబ్దాన్ని భారతదేశ శతాబ్దంగా

తీర్చిదిద్దడానికి భారత దేశ యువత విద్య తో పాటు నైపుణ్యాలలో కూడా అంతే ప్రావీణ్యం సాధించాలి" అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. యువత లో నైపుణ్యాల అభివృద్ధి, కొత్త సంస్థల ఏర్పాటు కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని శ్రీ మోదీ అన్నారు. ‘’ మన దేశంలో తొలి ఐటీఐ ని 1950లో ఏర్పాటు చేశారు. తరువాతి ఏడు దశాబ్దాలలో 10 వేల ఐటిఐలు ఏర్పడ్డాయి.

మా ప్రభుత్వం 8 సంవత్సరాలలో దేశంలో సుమారు 5 వేల కొత్త ఐటిఐలను ఏర్పాటు చేసింది. గ త 8 సంవత్సరాలలో 4 లక్షలకు పైగా కొత్త సీట్లు కూడా ఐటిఐ లకు చేరాయి" అని ప్ర ధాన మంత్రి పేర్కొన్నారు.

జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ , వేలాది నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలను  కూడా ఐటిఐల తో పాటు దేశ వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని ప్రధాన మంత్రి చెప్పారు. పాఠశాల స్థాయిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం 5000 కు పైగా స్కిల్ హబ్ లను కూడా తెరవబోతోందని ప్రధాన మంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యావిధానం అమలు చేసిన తరువాత, అనుభవం ఆధారిత అభ్యసనను కూడా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలల్లో నైపుణ్య కోర్సులను ప్రవేశపెడుతున్నారు.

10వ తరగతి ఉత్తీర్ణులైన తరువాత ఐటిఐ కి వచ్చే వారు 12వ క్లియరింగ్ సర్టిఫికేట్ ను

నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా సులువుగా పొందుతారని విద్యార్థులకు తెలియచేయడానికి సంతోషిస్తున్నామని 

ప్రధానమంత్రి పేర్కొన్నారు. "ఇది తదుపరి అధ్యయనాలలో మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఐటిఐల నుండి సాంకేతిక శిక్షణ పొందిన యువతను సైన్యంలో

చేర్చుకోవడానికి ఒక ప్రత్యేక సదుపాయం ఉందని కూడా ప్రధాన మంత్రి తెలిపారు.

నాల్గవ పారిశ్రామిక విప్లవ శకం  'పరిశ్రమ 4.0' గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ,

భారత దేశ విజయంలో పారిశ్రామిక శిక్షణ సంస్థలు ప్రముఖ పాత్రను పోషిస్తాయని అన్నారు. కాలానుగుణంగా ఉద్యోగ స్వభావం మారుతోందని, అందువల్ల మన ఐటిఐలలో చదివే విద్యార్థులు కూడా ప్రతి ఆధునిక కోర్సు సౌకర్యాన్ని పొందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ఆయన చెప్పారు. ఈ కోర్సుల లభ్యత గురించి వివరిస్తూ, ఐటిఐల్లో కోడింగ్ , ఏఐ, రోబోటిక్స్ , 3డీ ప్రింటింగ్ , డ్రోన్ టెక్నాలజీ, టెలి మెడిసిన్ కు సంబంధించిన అనేక కోర్సు లను ప్రారంభించామని శ్రీ మోదీ

వివరించారు. పునరుత్పాదక  ఇంధనం,  సౌర విద్యుత్, విద్యుత్ వాహనాల రంగంలో

భారత దేశం ముందంజలో ఉన్నందున అటువంటి రంగాలకు సంబంధించిన కోర్సులు మన అనేక ఐటిఐల లో ప్రవేశ పెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి తెలిపారు. ‘’మీలాంటి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించడం సులభం అవుతుంది ‘’ అని ఆయన అన్నారు.

ప్రతి గ్రామానికి ఆప్టిక ల్ ఫైబర్ ను

అందించడం, లక్ష ల కొద్దీ కామన్ స ర్వీస్ సెంటర్ల ను ప్రారంభించడం వంటి

ఇటీవల జరిగిన మార్పుల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దేశంలో సాంకేతిక

పరిజ్ఞానం విస్తరించడం వల్ల ఉద్యోగ

అవకాశా లు కూడా పెరుగుతున్నాయని

ప్రధాన మంత్రి అన్నారు. ఐటిఐల నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులకు గ్రామాల్లో మరిన్ని అవకాశాలను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. "ఇది గ్రామంలో మొబైల్ రిపేర్ పని కావచ్చు లేదా వ్యవసాయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పని కావచ్చు, ఎరువులను పిచికారీ చేయడం కావచ్చు లేదా డ్రోన్ల సహాయంతో ఔషధాలను సరఫరా చేయడం కావచ్చు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇటువంటి అనేక కొత్త ఉద్యోగాలు జోడించబడుతున్నాయి" అని ప్రధాన మంత్రి వివరించారు. "ఇందులో ఐటిఐల పాత్ర చాలా ముఖ్యమైనది, మన యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి." ఇదే దార్శనికతను దృష్టిలో పెట్టుకొని ఐటిఐలను అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.

నైపుణ్యాల అభివృద్ధితో పాటు, యువతకు సాఫ్ట్ స్కిల్స్ ఉండటం కూడా అంతే ముఖ్యమని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఒక వ్యాపార ప్ర ణాళిక ను రూపొందించడం, బ్యాంకు నుంచి రుణం పొందేందుకు ప్ర ణాళికలు, అవసరమైన ఫారాలను నింపడం, ఒక కొత్త కంపెనీని

రిజిస్టర్ చేసుకోవడం వంటి విషయాలను కోర్సులో భాగంగా కవర్ చేయడం జరిగిందని

శ్రీ మోదీ అన్నారు. "ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాల ఫలితమేమిటంటే, నేడు, భారతదేశం నైపుణ్యాలలో నాణ్యత , వైవిధ్యాన్ని కూడా కలిగి ఉంది. గత కొన్ని సంవత్సరాలలో మన ఐటిఐ ఉత్తీర్ణులు

ప్రపంచ నైపుణ్యాల పోటీల్లో ఎన్నో పెద్ద బహుమతులు  గెలుచుకున్నారు" అని

ఆయన అన్నారు.

నైపుణ్యాల అభివృద్ధి గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, "ఒక యువతకు విద్యతో పాటు నైపుణ్యాల సామర్ధ్యం కూడా ఉన్నప్పుడు, వారిలో ఆత్మవిశ్వాసం దానంతటగా పెరుగుతుంది. యువత నైపుణ్యాలతో సాధికారత పొందినప్పుడు, స్వయం ఉపాధి స్ఫూర్తికి మద్దతు ఇవ్వడానికి, తన పనిని ఎలా ప్రారంభించాలనే దానిపై ఒక ఆలోచన వస్తుంది’’ అని అన్నారు. ముద్ర యోజన , స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి పథకాల ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి

వివరించారు, ఇవి గ్యారెంటీ అవసరం లేకుండా రుణాలు అందిస్తున్నాయి.

"లక్ష్యం ముందుంది, మీరు ఆ దిశలో ముందుకు సాగాలి. ఈ రోజు దేశం మీ చేతిని పట్టుకుంది, రేపు మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి" అని ప్రధాన మంత్రి కోరారు.

ఆజాదీ కా అమృత్ కాల్ గురించి ప్రస్తావిస్తూ, భారత దేశానికి వచ్చే 25 సంవత్సరాల మాదిరి వచ్చే 25 సంవత్సరాలు మన జీవితాలకు కూడా అంతే ముఖ్యమని అన్నారు. 'మీరంతా మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ ప్రచార సారదులు. మీరు భారత దేశ పరిశ్రమకు వెన్నెముక లాంటి వారు. అందువల్ల అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో మీరు పెద్ద పాత్ర పోషించాల్సి ఉంది’’ అని ప్రధాన మంత్రి

తన సందేశంలో పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయిలో అవకాశాలను గురించి

ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలకు తమ కలలను సాకారం చేసుకోవడానికి, తమ అభివృద్ధి వేగాన్ని

నిలుపుకోవడానికి నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరమని అన్నారు. దేశంతో పాటు విదేశాలతో కూడా ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు. ‘’మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో భారత్ పై ప్రపంచానికి విశ్వాసం నిరంతరం పెరుగుతోంది. కరోనా కాలంలో కూడా, భారతదేశం తన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, దాని యువత అతిపెద్ద సవాళ్లకు పరిష్కారాలను అందించగల సామర్థ్యాన్ని ఎలా కలిగి ఉందో నిరూపించిం ది’’ అన్నారు. ఆరోగ్య సేవలు లేదా హోటల్ - ఆస్పత్రుల

నిర్వహణ , డిజిటల్ పరిష్కారాలు, లేదా విప త్తు నిర్వహణ వంటి వాటి  లో భారతీయులు తమ నైపుణ్యాలు ప్ర తిభా సామర్ధ్యాలతో 

ప్రతి దేశంలోనూ tతమదైన ముద్ర

వేస్తున్నారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, యువత తమ  భవిష్యత్తుకు ఆధారమైన నైపుణ్యాలను  అప్ గ్రేడ్ చేసుకోవలసిన

అవసరాన్ని పునరుద్ఘాటించారు. నైపుణ్యాల విషయానికి వస్తే, 'స్కిల్లింగ్, రీస్కిల్లింగ్','అప్ స్కిల్లింగ్' మన మంత్రం కావాలని శ్రీ మోదీ అన్నారు. విద్యార్థులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని, వారి జ్ఞానాన్ని పంచుకోవాలని ప్రధాన మంత్రి కోరారు. "మీరు ఇదే వేగంతో ముందుకు వెళతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, మీ నైపుణ్యంతో, మీరు నవ భారతదేశ మెరుగైన భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలి" అని పిలుపు ఇచ్చారు.

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's cumulative exports rise to $720.76 billion in Apr-Jan 2025-26, up 6.15%

Media Coverage

India's cumulative exports rise to $720.76 billion in Apr-Jan 2025-26, up 6.15%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister speaks with the King of Jordan
March 02, 2026

Prime Minister Narendra Modi spoke with His Majesty King Abdullah II, the King of Jordan.

The Prime Minister conveyed deep concern at the evolving situation in the region. He reaffirmed support for the peace, security, and well-being of the people of Jordan.

The Prime Minister also thanked His Majesty for taking care of the Indian community in Jordan in this difficult hour.

The Prime Minister shared on X;

"Spoke with His Majesty King Abdullah II, the King of Jordan. Conveyed our deep concern at the evolving situation in the region. We reaffirm our support for peace, security and the well-being of the people of Jordan. I thanked him for taking care of the Indian community in Jordan in this difficult hour."