షేర్ చేయండి
 
Comments
గతంలో పెద్ద మానవతా సంక్షోభం ఏర్పడినప్పుడల్లా, సైన్స్ మంచి భవిష్యత్తు కోసం మార్గం సిద్ధం చేసింది: ప్రధాని
నేటి భారతదేశం ప్రతి రంగంలోనూ స్వావలంబన మరియు అధికారం పొందాలని కోరుకుంటుంది: ప్రధాని మోదీ
భారతదేశం యొక్క లక్ష్యాలు ఈ దశాబ్దం యొక్క అవసరాలకు అనుగుణంగా ఉండాలి మరియు తరువాతి దశాబ్దం పాటు ఉండాలి: ప్రధాని మోదీ

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) సమావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు.

ఈ సందర్భం లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ఈ శతాబ్ది లో అతి పెద్ద సవాలు గా నిలచిందని వ్యాఖ్యానించారు.  అయితే గత కాలం లో మానవాళి కి ఒక భారీ సంకటం ఎదురైనపుడల్లా విజ్ఞాన శాస్త్రం ఓ మెరుగైన దారి ని సిద్ధపరచిందని ఆయన అన్నారు.  పరిష్కారాల ను కనుగొనడం, సంకట కాలాల్లో వీలుపడే కార్యాల కు నడుం బిగించడం ద్వారా కొత్త బలాన్ని జోడించడమనేది విజ్ఞాన శాస్త్రం మౌలిక స్వభావం అని కూడా ఆయన అన్నారు.  ప్రపంచ వ్యాప్త వ్యాధి బారి నుంచి మానవ జాతి ని రక్షించడం కోసం టీకా మందుల ను ఒక సంవత్సరం లోపే శరవేగం గా, పెద్ద ఎత్తు న తయారు చేసినందుకు  శాస్త్రవేత్తల ను ప్రధాన మంత్రి పొగడారు.   చరిత్ర లో అటువంటి ఒక పెద్ద ఘటన జరగడం ఇది ఒకటో సారి అని ఆయన అన్నారు.  కిందటి శతాబ్దం లో నూతన ఆవిష్కరణ లు ఇతర దేశాల లో చోటు చేసుకొన్నాయి, భారతదేశం చాలా సంవత్సరాల పాటు వేచివుండవలసి వచ్చింది అని కూడా ఆయన అన్నారు.  అయితే ప్రస్తుతం మన దేశం లోని శాస్త్రజ్ఞులు ఒకే రకమైనటువంటి వేగం తోను, ఇతర దేశాల తో సమానం గాను శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు.  కరోనా కు వ్యతిరేకం గా సాగుతున్నటువంటి పోరు లో కోవిడ్-19 టీకా మందుల విషయం లో, టెస్టింగ్ కిట్స్ విషయం లో, అవసరమైనటువంటి సామగ్రి విషయం లో, సరికొత్త ప్రభావకారి ఔషధాల విషయం లో భారతదేశాన్ని సొంత కాళ్ల మీద నిలబడేటట్టు చేసిన శాస్త్రవేత్తల ను ఆయన ప్రశంసించారు.  విజ్ఞాన శాస్త్రాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చెందిన దేశాల తో సమాన స్థాయి కి తీసుకు రావడం ఇటు పరిశ్రమ కు, అటు బజారు కు శ్రేష్ఠతరం గా ఉంటుంది అని ఆయన అన్నారు.
 
మన దేశం లో, విజ్ఞాన శాస్త్రాన్ని, సమాజాన్ని, పరిశ్రమ ను ఒకే స్థాయి లో ఉంచే ఒక సంస్థాగత సర్దుబాటు వ్యవస్థ గా సిఎస్ఐఆర్ పాటుపడుతోందని ప్రధాన మంత్రి అన్నారు.  శాంతి స్వరూప భట్ నాగర్ వంటి ఎంతో మంది ప్రతిభావంతులను, శాస్త్రవేత్తల ను మన ఈ సంస్థ అందించింది, శాంతి స్వరూప్ భట్ నాగర్ ఈ సంస్థ కు నాయకత్వం వహించారు అని ప్రధాన మంత్రి చెప్పారు.   పరిశోధన, పేటెంట్ ల ఇకోసిస్టమ్ తాలూకు ఒక శక్తిమంతమైనటువంటి జత సిఎస్ఐఆర్ కు ఉంది అని ఆయన తెలిపారు.  దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల ను పరిష్కరించడం కోసం సిఎస్ఐఆర్ కృషి చేస్తోందని ఆయన అన్నారు.

దేశం తాలూకు ప్రస్తుత లక్ష్యాలు, 21వ శతాబ్దం తాలూకు దేశవాసుల కల లు ఒక పునాది మీద ఆధారపడి ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  కాబట్టి సిఎస్ఐఆర్ వంటి సంస్థ ల లక్ష్యాలు కూడా అసాధారణమైనవే అని ఆయన అన్నారు.  బయో టెక్నాలజీ మొదలుకొని బ్యాటరీ సాంకేతికత ల వరకు, వ్యవసాయం మొదలుకొని ఖగోళశాస్త్రం వరకు, విపత్తుల నిర్వహణ మొదలుకొని రక్షణ సంబంధి సాంకేతిక విజ్ఞానం వరకు, వ్యాక్సీన్ ల మొదలుకొని వర్చువల్ రియాలిటి వరకు.. ప్రతి ఒక్క రంగం లో.. స్వయంసమృద్ధియుతమైంది గా రూపుదిద్దుకోవాలని నేటి భారతదేశం కోరుకొంటోంది అని ఆయన అన్నారు.  ప్రస్తుతం భారతదేశం సుస్థిర అభివృద్ధి, శుద్ధ శక్తి రంగం లో ప్రపంచానికి దారి ని చూపుతోంది అని కూడా ఆయన అన్నారు.  ప్రస్తుతం సాఫ్ట్ వేర్ మొదలుకొని ఉపగ్రహాల వరకు ఇతర దేశాల అభివృద్ధి వేగాన్ని భారతదేశం పెంచుతోంది, ప్రపంచ అభివృద్ధి లో ఒక ప్రధాన యంత్రం  పాత్ర ను పోషిస్తోంది అని ఆయన చెప్పారు.  ఈ కారణం గా, భారతదేశం లక్ష్యాలు ఈ దశాబ్దం అవసరాల తో పాటు తరువాతి దశాబ్ది అవసరాలకు కూడా అనుగుణం గా ఉండాలి అని ఆయన అన్నారు.జలవాయు పరివర్తన ను గురించి ప్రపంచవ్యాప్త నిపుణులు అదే పని గా భయాన్ని వ్యక్తం చేస్తున్నారని ప్రధాన మంత్రి అన్నారు.  శాస్త్రీయ దృష్టికోణం తో సన్నాహాల ను చేయవలసింది గా శాస్త్రవేత్తల కు, సంస్థల కు ఆయన పిలుపునిచ్చారు.  కార్బన్ కేప్చర్ మొదలుకొని శక్తి ని నిలవ చేయడం నుంచి హరిత ఉదజని సాంకేతికత ల దాాకా ప్రతి ఒక్క రంగం లోనూ అందరి కన్నా ముందు నడవండి అని వారిని ఆయన కోరారు.  సమాజాన్ని, పరిశ్రమ ను వెంట బెట్టుకొని సాగవలసిందిగా సిఎస్ఐఆర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.  ఆయన ఇచ్చిన సలహా ను అనుసరించి ప్రజల వద్ద నుంచి సూచనలను, ఆలోచనల ను తీసుకోవడం మొదలుపెట్టినందుకు గాను సిఎస్ఐఆర్ ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.  2016వ సంవత్సరం లో ప్రారంభించిన అరోమ మిశన్ లో సిఎస్ఐఆర్ పోషించిన పాత్ర ను ఆయన కొనియాడారు.  ప్రస్తుతం దేశం లో వేల కొద్దీ రైతులు పూల మొక్కల పెంపకం ద్వారా వారి భాగ్యరేఖల ను మార్చివేసుకొంటున్నారు అని ఆయన చెప్పారు.  భారతదేశం ఇంగువ కోసం దిగుమతుల పై ఆధారపడేదని, దేశం లో ఇంగువ సేద్యం లో సాయపడినందుకు సిఎస్ఐఆర్ ను ఆయన ప్రశంసించారు.

ఒక మార్గ సూచీ దన్ను తో సరైన మార్గం లో ముందుకు సాగిపోవలసింది గా సిఎస్ఐఆర్ ను ప్రధాన మంత్రి కోరారు.  కరోనా తాలూకు ప్రస్తుత కోవిడ్-19 సంకటం అభివృద్ధి గమనం పైన ప్రభావాన్ని చూపివుండవచ్చు గాని ఆత్మనిర్భర్ భారత్ (స్వయంసమృద్ధియుత భారత్) ను ఆవిష్కరించాలి అనే కల ను నెరవేర్చుకోవాలన్న వచనబద్ధత స్థిరం గానే ఉంది అని ఆయన అన్నారు.  మన దేశం లో లభిస్తున్నటువంటి అవకాశాల ను అనుకూలం గా వినియోగించుకోవాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు.  మన ఎమ్ఎస్ఎఇ లకు, స్టార్ట్ అప్స్ కు వ్యవసాయ రంగం మొదలుకొని విద్య రంగం వరకు ప్రతి ఒక్క రంగం లో గొప్ప కార్యక్షమత కు ఆస్కారం ఉందని ఆయన తెలిపారు.  కోవిడ్ సంక్షోభం కాలం లో ప్రతి రంగం లోనూ సాధించిన సాఫల్యాన్ని తిరిగి సాధించవలసిందంటూ శాస్త్రవేత్తలందరికీ, పరిశ్రమ కు ఆయన విజ్ఞప్తి చేశారు.  

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Consumer confidence rally in Sep shows 2% points upswing: Survey

Media Coverage

Consumer confidence rally in Sep shows 2% points upswing: Survey
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 సెప్టెంబర్ 2021
September 19, 2021
షేర్ చేయండి
 
Comments

Citizens along with PM Narendra Modi expressed their gratitude towards selfless contribution made by medical fraternity in fighting COVID 19

India’s recovery looks brighter during these unprecedented times under PM Modi's leadership –