హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లో 11,000కోట్ల రూపాయల కు పైగా విలువైన జల విద్యుత్తుపథకాల ను ప్రారంభించి, అటువంటివే మరికొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేసిన ప్రధాన మంత్రి
‘‘ఈ రోజు న ప్రారంభించినజల విద్యుత్తు పథకాలుపర్యావరణ మిత్ర పూర్వక అభివృద్ధి పట్ల భారతదేశం నిబద్ధత ను ప్రతిబింబిస్తున్నాయి’’
‘‘2016వ సంవత్సరం లో, భారతదేశం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొంది.. అది ఏమిటి అంటే తనస్థాపిత విద్యుత్తు సామర్ధ్యం లో 40శాతాన్ని శిలాజేతర శక్తి వనరుల నుంచిసంపాదించుకోవాలన్నదే; భారతదేశం ఈలక్ష్యాన్ని ఈ సంవత్సరం నవంబర్ లోనే సాధించింది’’
‘‘ప్లాస్టిక్ అంతటా వ్యాపించింది, ప్లాస్టిక్ అనేది నదుల లోకి వెళ్తోంది, అది హిమాచల్ కు కలుగజేస్తున్న నష్టాన్ని ఆపడం కోసం మనం సమష్టి ప్రయాసలు చేసి తీరాలి.’’
‘‘భారతదేశం ప్రస్తుతం ప్రపంచ ఔషధాలయం గా పేరు తెచ్చుకొంది అంటేదాని వెనుక గల శక్తి హిమాచల్’’
‘‘కరోనా విశ్వమారి కాలం లో హిమాచల్ ప్రదేశ్ ఇతర రాష్ట్రాల కు సాయపడటంఒక్కటే కాకుండా ఇతర దేశాల కు కూడా సాయం చేసింది’’
‘‘జాప్యానికి చోటిచ్చే ఆలోచనవిధానాలు హిమాచల్ ప్రజలుదశాబ్దాల తరబడి ఎదురు చూసే స్థితి ని కల్పించాయి. ఈ విధానాల కారణం గా, ఇక్కడిప్రాజెక్టుల లో అనేక సంవత్సరాల పాటు ఆలస్యంచోటు చేసుకొంది’’
15-18 ఏళ్ళ వయస్సు కలిగిన వారి కి టీకామందు ను, ఫ్రంట్ లైన్ వర్కర్ లు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్త లు, ఇంకా వ్యాధుల తో బాధపడుతున్న సీనియర్సిటిజన్ ల కు ప్రికాశన్ డోజు ను ఇవ్వడం గురించి తెలియజేసిన ప్రధాన మంత్రి
‘‘కుమార్తెల కు వివాహ వయస్సు ను 21 సంవత్సరాల కు పెంచుతుండడం అనేది చదువుకోవడానికి వారికి పూర్తి కాలాన్నిప్రసాదిస్తుంది, వారు వారి ఉద్యోగ జీవనాన్ని కూడాను తీర్చిదిద్దుకో గలుగుతారు’’
‘‘దేశ భద్రత ను పెంచడం కోసం గడచిన ఏడు సంవత్సరాల లో మాప్రభుత్వం చేసిన పని, సైనికులు, మాజీ సైనికోద్యోగుల కోసం తీసుకొన్న నిర్ణయాలుసైతం హిమాచల్ ప్రజల కు ఎక్కడ లేని లబ్ధి ని చేకూర్చాయి’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లో జరిగిన ‘హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’ తాలూకు రెండో గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమని కి అధ్యక్షత వహించారు. దాదాపు 28,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంతం లో పెట్టుబడి కి ఈ సదస్సు ఒక దన్ను గా నిలుస్తుందన్న అంచనా ఉంది. ప్రధాన మంత్రి 11,000 కోట్ల రూపాయల కు పైగా విలువ గల జల విద్యుత్తు పథకాల ను కూడా ప్రారంభించి, ఆ తరహా పథకాలు మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. జల విద్యుత్తు పథకాల లో కొన్ని ఏవేవంటే అవి రేణుకాజీ ఆనకట్ట పథకం, లుహ్ రీ ఒకటో దశ జల విద్యుత్తు పథకం, ధౌలాసిధ్ జల విద్యుత్ పథకం. ఆయన సావ్ రా- కుడ్ డూ జల విద్యుత్తు పథకాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రామ్ ఠాకుర్, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ లు ఉన్నారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, హిమాచల్ ప్రదేశ్ తో తనకు ఉన్నటువంటి భావోద్వేగభరిత బంధాన్ని గుర్తు కు తెచ్చుకున్నారు. ఆ రాష్ట్రం లోని పర్వతాలు తన జీవనం లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించాయి అని ఆయన అన్నారు. నాలుగు సంవత్సరాల పాటు జోడు ఇంజిన్ ల ప్రభుత్వానికిగాను హిమాచల్ ప్రదేశ్ ప్రజల కు ఆయన అభినందనల ను కూడా తెలియ జేశారు. ఈ నాలుగేళ్ళ లో రాష్ట్రం మహమ్మారి సవాలు ను ఎదుర్కొని, అలాగే అభివృద్ధి తాలూకు శిఖరాల ను కూడా అధిరోహించింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘జయ్ రామ్ గారు మరియు ఆయన నేతృత్వం లో కష్టించి పనిచేసిన బృందం హిమాచల్ ప్రదేశ్ ప్రజల కలల ను పండించడం కోసం ఏ ఒక్క అవకాశాన్ని అయినా విడిచిపెట్టలేదు’’ అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.

దేశం లోని ప్రజల కు ‘జీవించడం లో సౌలభ్యం’ కల్పన అనేది అగ్ర ప్రాథమ్యాల లో ఒకటి గా ఉంది మరి దీని ని నెరవేర్చడం లో విద్యుత్తు ఒక పెద్ద పాత్ర ను పోషిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న ప్రారంభించినటువంటి జల విద్యుత్తు పథకాలు పర్యావరణ మిత్ర పూర్వకమైన అభివృద్ధి పట్ల భారతదేశం యొక్క వచన బద్ధత కు అద్దం పడుతున్నాయి అని ఆయన అన్నారు. ‘‘గిరి నది మీది శ్రీ రేణుకాజీ ఆనకట్ట ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది అంటే, దాని వల్ల ఒక విశాల ప్రాంతం ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి అందే ఏ ఆదాయం లో అయినా సరే అందులోని ఒక పెద్ద భాగాన్ని కూడా ఇక్కడి అభివృద్ధి కై వెచ్చించడం జరుగుతుంది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

‘న్యూ ఇండియా’ పని తీరు మారింది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. భారతదేశం తన పర్యావరణ సంబంధి లక్ష్యాల ను నెరవేర్చుకొంటున్న వేగాన్ని గురించి ఆయన మాట్లాడారు. ‘‘2016వ సంవత్సరం లో, భారతదేశం తన స్థాపిత విద్యుత్తు సామర్ధ్యం లో 40 శాతాన్ని 2030వ సంవత్సరానికల్లా శిలాజేతర శక్తి వనరుల నుంచి సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకొంది. ఈ లక్ష్యాన్ని భారతదేశం ఈ ఏడాది నవంబర్ లోనే సాధించింది అనే విషయం పట్ల భారతదేశం లోని ప్రతి ఒక్కరు ప్రస్తుతం గర్వించాలి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘పర్యావరణాన్ని కాపాడుతూనే భారతదేశం ఏ విధం గా అభివృద్ధి ని వేగిరపరచుకొంటున్నదీ గమనించి యావత్తు ప్రపంచం భారతదేశాన్ని మెచ్చుకొంటున్నది. సౌర విద్యుత్తు మొదలుకొని జల విద్యుత్తు వరకు, పవన విద్యుత్తు మొదలుకొని గ్రీన్ హైడ్రోజన్ వరకు నవీకరణ యోగ్య శక్తి తాలూకు ప్రతి ఒక్క వనరు ను పూర్తి స్థాయి లో వినియోగించుకోవడాని కి దేశం అదే పని గా పాటుపడుతోంది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

ప్లాస్టిక్ ను ఒకసారి ఉపయోగించిన తరువాత వదలివేయాలి అనే తన ఆలోచన ను గురించి ప్రధాన మంత్రి మరోమారు వెల్లడించారు. ప్లాస్టిక్ వల్ల పర్వతాల కు వాటిల్లిన నష్టం విషయం లో ప్రభుత్వం అప్రమత్తం గా ఉంది అని ఆయన చెప్పారు. ఒకసారి వినియోగించవలసిన ప్లాస్టిక్ పట్ల దేశవ్యాప్త ప్రచార ఉద్యమాన్ని నడపడం తో పాటుగా ప్రభుత్వం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అంశం పైన సైతం కృషి చేస్తోంది. మనిషి ప్రవర్తన లో మార్పు రావలసిన అవసరాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, ‘‘హిమాచల్ ను స్వచ్ఛం గాను, ప్లాస్టిక్ కు మరియు ఇతర వ్యర్థ పదార్థాల కు తావు ఉండనటువంటివి గాను అట్టిపెట్టడం లో పర్యటకుల కు కూడా ఒక ప్రధాన బాధ్యత ఉంది. ప్లాస్టిక్ అన్ని చోట్ల కు వ్యాపించింది. ప్లాస్టిక్ నదుల లోకి వెళ్తోంది. అది హిమాచల్ కు కలుగజేస్తున్న నష్టాన్ని అడ్డుకోవడం కోసం మనమంతా కలసి తప్పక పాటుపడాలి’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో ఔషధ నిర్మాణ రంగం యొక్క వృద్ధి ని ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. ‘‘భారతదేశం ప్రస్తుతం ప్రపంచ ఔషధాలయం అనే పేరు ను తెచ్చుకొందీ అంటే దాని వెనుక ఉన్న శక్తి హిమాచల్. హిమాచల్ ప్రదేశ్ కరోనా విశ్వమారి కాలం లో ఇతర రాష్ట్రాల కు సాయపడటం ఒక్కటే కాకుండా ఇతర దేశాల కు కూడాను సాయం చేసింది’’ అని ఆయన అన్నారు.

రాష్ట్రం కనబరచిన గొప్ప పని తీరు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘హిమాచల్ తన యావత్తు వయోజనుల కు టీకామందు ను అందించడం లో ఇతర రాష్ట్రాల కంటే ఉజ్జ్వలం గా ప్రకాశించింది. ఇక్కడ ప్రభుత్వం లో ఉన్న వారు రాజకీయ స్వార్ధపరత్వం లో మునిగిపోలేదు. అంతకంటే వారు వారి పూర్తి దృష్టి ని హిమాచల్ లోని ప్రతి ఒక్క పౌరుడు\పౌరురాలు ఏ విధం గా వ్యాక్సీన్ ను పొందగలరు అనే అంశం పైనే నిలిపారు’’ అని ఆయన అన్నారు.

అమ్మాయిలకు వివాహ వయస్సు ను మార్చడాని కి ప్రభుత్వం ఇటీవల తీసుకొన్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘కుమారుల ను వివాహానికి అనుమతించే వయస్సు తో సమానం గా కుమార్తె ల వివాహ వయస్సు కూడా ఉండాలి అని మేం నిర్ణయించాం. కుమార్తెల కు వివాహ యుక్త ప్రాయాన్ని 21 సంవత్సరాల కు పెంచడం అనేది వారికి చదువుకోవడానికి పూర్తి కాలాన్ని ప్రసాదిస్తుంది. మరి వారు వారి యొక్క ఉద్యోగ జీవనాన్ని కూడా తీర్చిదిద్దుకోగలుగుతారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

కొత్త వాక్సీనేశన్ కేటగిరీ ల విషయం లో ఇటీవల ప్రకటనల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ప్రతి ఒక్క అవసరాన్ని దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం అత్యంత సూక్ష్మ గ్రాహ్యత తో, జాగ్రత తో పని చేస్తోంది అని ఆయన అన్నారు. 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వారి కి సైతం రాబోయే జనవరి 3వ తేదీ నుంచి టీకామందు ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

గడచిన రెండు సంవత్సరాల లో కరోనా కు వ్యతిరేకం గా జరుగుతూ ఉన్న యుద్ధం లో మన ఆరోగ్య రంగ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్ లు దేశాని కి బలం గా నిలచారు అని ప్రధాన మంత్రి అన్నారు. వారికి ప్రికాశన్ డోజు ను ఇచ్చే ప్రక్రియ కూడా రాబోయే జనవరి 10వ తేదీ నుంచి మొదలవుతుంది. 60 సంవత్సరాల వయస్సు పైబడిన వృద్ధులు ఇదివరకే గంభీరమైన వ్యాధుల బారిన పడి ఉన్నట్లయితే వారికి కూడా వైద్యుల సలహా ప్రకారం ప్రికాశన్ డోసేజీ తాలూకు ఐచ్ఛికాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి తెలిపారు.

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, ఇంకా సబ్ కా ప్రయాస్’ మంత్రం స్ఫూర్తి తో కృషి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘ప్రతి దేశాని కి వేరు వేరు ఆదర్శవాదాలంటూ ఉంటాయి. కానీ ప్రస్తుతం మన దేశ ప్రజలు రెండు విధాలైన ఆలోచనవిధానాల ను స్పష్టం గా గమనిస్తున్నారు. ఒక ఆలోచన విధానం జాప్యాని కి సంబంధించింది. మరొక ఆలోచన విధానం అభివృద్ధి కి సంబంధించింది. జాప్యం చేయడం అనే ఆలోచన విధానం కలిగిన వారు పర్వత ప్రాంతాల లో ప్రజల పట్ల ఎన్నడూ శ్రద్ధ వహించ నేలేదు’’ అని ఆయన అన్నారు. జాప్యాని కి తావునిచ్చే ఆలోచన విధానం హిమాచల్ ప్రదేశ్ ప్రజల ను దశాబ్దుల పాటు నిరీక్షణ కు గురి చేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణం గా అటల్ సొరంగ మార్గం నిర్మాణం లో అనేక సంవత్సరాల ఆలస్యం జరిగింది. రేణుక ప్రాజెక్టు కూడా మూడు దశాబ్దాల పాటు ఆలస్యం అయింది. ప్రభుత్వం నిబద్ధతల్లా అభివృద్ధే అని ఆయన నొక్కి చెప్పారు. అటల్ సొరంగ మార్గం పని పూర్తి అయింది. మరి చండీగఢ్ నుంచి మనాలీ ని మరియు శిమ్ లా ను కలిపే రహదారి ని కూడా విస్తరించడం జరిగింది అని ఆయన వివరించారు.

హిమాచల్ ఒక పెద్ద సంఖ్య లో రక్షణ సిబ్బంది కి పుట్టినిల్లుగా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. రక్షణ సిబ్బంది కి, ఆ రంగం లో ఇది వరకు పని చేసిన వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యల ను గురించి ఆయన వివరించారు. ‘‘హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి ఒక్క కుటుంబం లోను దేశాన్ని కాపాడే ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలు ఉన్నారు . దేశ భద్రత ను పెంచడం కోసం గత ఏడేళ్ళ లో మా ప్రభుత్వం చేసిన కార్యాలు, సిపాయిలు, మాజీ సైనికోద్యోగుల కోసం తీసుకొన్న నిర్ణయాలు సైతం హిమాచల్ ప్రజల కు గొప్ప ప్రయోజనాల ను అందించాయి’’ అని చెప్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India

Media Coverage

'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 డిసెంబర్ 2025
December 15, 2025

Visionary Leadership: PM Modi's Era of Railways, AI, and Cultural Renaissance